English | Telugu

సినిమా పేరు:రెమో
బ్యానర్:24ఏఎమ్ స్టూడియోస్
Rating:2.00
విడుదలయిన తేది:Nov 25, 2016

తెలుగు ప్రేక్ష‌కులు చాలా మంచోళ్లు. సినిమా న‌చ్చితే చాలు, అందులో హీరో ఎవ‌రైనా... అది తెలుగు సినిమా అయినా.. కాక‌పోయినా నెత్తిమీద పెట్టేసుకొంటారు. త‌మిళ హీరోలు, త‌మిళ ద‌ర్శ‌క నిర్మాత‌లు.. 'జ‌య‌హో తెలుగు ఇండ్ర‌స్ట్రీ' అనేది అందుక‌నే. త‌మిళంలో యావ‌రేజ్ గా ఆడిన సినిమా కూడా అప్పుడ‌ప్పుడూ తెలుగులో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిపోతుంటుంది. మొన్నొచ్చిన బిచ్చ‌గాడు సినిమానే ఇందుకు సాక్ష్యం. అలాంటి సినిమాలు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా.. 'డ‌బ్బింగ్ సినిమాల్లో ఏదో మాయ ఉంది' అని మ‌న నిర్మాత‌లు తెగ ఫీలైపోయి.. డ‌బ్బింగ్ బొమ్మ‌ల్ని తెలుగులో దించేస్తుంటారు. అలా వ‌చ్చిన సినిమానే రెమో. త‌మిళంలో సూప‌ర్ హిట్ అయిన సినిమా ఇది. దానికి తోడు కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించింది. అన్నింటికంటే ముఖ్యంగా 'దిల్‌రాజు' అనే బ్రాండ్ ఈ సినిమాపై  ప‌డింది. ఇన్ని ప్ర‌త్యేక‌త‌ల‌తో వ‌చ్చిన 'రెమో' ఎలా ఉంది?  త‌మిళంలో హిట్ట‌య్యే ల‌క్ష‌ణాలు ఉన్నాయా, లేదా?  చూద్దాం.. ప‌దండి.

* క‌థ‌

య‌స్‌కె (శివ‌కార్తికేయన్‌) హీరో అవ్వాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటాడు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ సినిమాలో అత‌నికి ఓ వేషం దొరుకుతుంది. అదీ.. లేడీ న‌ర్స్‌గా. అందుకోసం త‌న గెట‌ప్ మార్చుకొంటాడు. అదే గెట‌ప్‌లో డాక్ట‌ర్ కావ్య (కీర్తి సురేష్‌)తో ప‌రిచ‌యం పెంచుకొంటాడు. కావ్య ఎస్‌కెని నిజంగానే అమ్మాయి అనుకొని స్నేహం చేస్తుంది. త‌న ఆసుప‌త్రిలో న‌ర్స్‌గా కూడా ఉద్యోగం ఇప్పిస్తుంది. అయితే అంత‌కు ముందే.. ఎస్‌కె.. ఆమెని ప్రేమించ‌డం మొద‌లెడ‌తాడు. కానీ... త‌న మ‌న‌సులోమాట చెప్పుకోలేడు. ఈ ద‌శ‌లో న‌ర్సు వేషంలో రెమోగా ఆమెకు ద‌గ్గ‌ర‌య్యే అవ‌కాశం వ‌స్తుంది. ఎస్ కె గా కావ్య ప్రేమ‌ని సాధించ‌లేకోపోయినా.. రెమోగా ఆమెకు ఎలా చేరువ‌య్యాడు?  త‌న ప్రేమ‌ని ఎలా గెలిపించుకొన్నాడు?  అనేదే ఈ చిత్ర క‌థ‌.


ఎనాలసిస్ :

* విశ్లేష‌ణ‌

క‌థ‌గా చూస్తే.. 'ఓస్‌.. ఈ క‌థ‌లో కొత్త‌ద‌నం ఏముంది' అనిపిస్తుంది. అది నిజం కూడా. ఏమాత్రం మ‌లుపులు, ఊహించ‌ని ట్విస్టులూ లేని ఓ సాదా సీదా క‌థ ఇది. అయితే ద‌ర్శ‌కుడు క‌థ‌పై కంటే క‌థ‌నాన్ని న‌మ్ముకొని తీసిన సినిమా ఇది. ఓ రేఖా మాత్ర‌మైన క‌థ‌ని రాసుకొని, దాని చుట్టూ వినోదాత్మక సన్నివేశాలు రాసుకొంటూ వెళ్లాడు. సినిమా ప్రారంభం, పాత్ర‌ల ప‌రిచ‌యం, క‌థ‌లోకి వెళ్ల‌డం... ఇవ‌న్నీ ఎంగేజ్డ్‌గానే ఉంటాయి. స‌న్నివేశాలు కొత్త‌గా లేక‌పోయినా టైమ్ పాస్ అయిపోతాయి. అమ్మాయి ప్రేమ‌ని సంపాదించుకోవ‌డానికి అబ్బాయి ప‌డే పాట్లు న‌వ్విస్తాయి. విశ్రాంతి ముందొచ్చే ట్విస్టు పెద్ద‌గా ఆస‌క్తి క‌లిగించ‌లేదు. పాత సినిమాల ఛాయ‌లు చాలా క‌నిపిస్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు చాలా చోట్ల ర‌బ్‌నే బ‌నాదీ జోడీ సినిమా గుర్తొస్తుంటుంది.

క‌థానాయ‌కుడు న‌ర్సుగా మారిన త‌ర‌వాత‌.. జ‌రిగే ప‌రిణామాలు, టూ ఇన్ వ‌న్‌గా న‌టిస్తున్న‌ప్పుడు పుట్టే క‌న్‌ఫ్యూజ‌న్ కామెడీ ఈ సినిమాకి ప్ర‌ధాన బ‌లం. అయితే ఆయా స‌న్నివేశాలు అనుకొన్నంత‌గా పండ‌లేదు. త‌మిళంలో జ‌నాలు విర‌గ‌బ‌డి న‌వ్విన స‌న్నివేశాలు తెలుగులో వ‌చ్చేస‌రికి తేలిపోయాయి. దానికి కార‌ణం... కొన్ని సంభాష‌ణ‌ల్లో ఛ‌మ‌క్కు యాస‌తో ముడిప‌డి ఉంటాయి. త‌మిళంలో ఆ యాస‌, దాంతో పాటు పుట్ట‌కొచ్చిన హాస్యం అక్క‌డ ప్ల‌స్ అయ్యింది. పైగా శివ కార్తికేయ‌న్ త‌మిళంలో ఫేమ‌స్ న‌టుడు. అత‌ని బాడీ లాంగ్వేజ్ త‌మిళ జ‌నాల‌కు బాగా అల‌వాటు. కొంచెం కామెడీ చేసినా.. చాలా ఎక్కువ చేసిన‌ట్టు అనిపిస్తుంది. ఆ హీరో, అత‌ని బాడీ లాంగ్వేజ్ మ‌న‌వాళ్ల‌కు చాలా కొత్త‌. అందుకే.. ఆ పాత్ర‌ని రిసీవ్ చేసుకోవ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుంది.  మ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఇలాంటి క‌థ‌లు కొత్తేం కాదు. న‌రేష్‌, రాజేంద్ర ప్రసాద్ లాంటి కామెడీ హీరోలు ఈ త‌ర‌హా క‌థ‌లు చాలా చేశారు. అవ‌న్నీ చూసీ చూసీ ఉన్న మ‌న‌కు క‌థ‌, క‌థ‌నం, అందులోంచి పుట్టిన వినోదం కొత్త‌గా అనిపించ‌దు. దానికి తోడు త‌మిళ కామెడీ డోసు మ‌రీ ఎక్కువైంది. కొన్ని సన్నివేశాల్లో న‌టీన‌టుల ఓవ‌ర్ యాక్ష‌న్ భ‌రించ‌లేనంత స్థాయిలో ఉంది. ఇవ‌న్నీ ఈ సినిమాకి మైన‌స్‌లే.

* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

శివ కార్తికేయ‌న్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా కొత్త‌. ఆ ప్లేసులో మ‌రో హీరో ఉంటే బాగుండేదే అనిపిస్తుంది. అయితే అది కొద్ది సేపే. ఆ త‌ర‌వాత అత‌ను అల‌వాటైపోతాడు. రెండు పాత్ర‌ల్లో తాను చూపించిన వైవిధ్యం ఆక‌ట్టుకొంటుంది. కీర్తి సురేష్ మ‌రోసారి అందంగా కనిపించింది. హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ , వాళ్ల ల‌వ్ ట్రాక్ ఈ సినిమాకి ప్ర‌ధాన బ‌లం. అయితే అక్క‌డ‌క్క‌డ కీర్తి న‌ట‌న కూడా ఓవ‌ర్ అయిన‌ట్టే అనిపిస్తుంది. ఈ సినిమాలోని న‌టీన‌టులంతా కాస్త గీత దాటే న‌టించారు. త‌మిళ జ‌నాల‌కు కావ‌ల్సిందే అది. కానీ.. తెలుగులోకి వ‌చ్చేస‌రికి ఆ ఓవ‌ర్ భ‌రించ‌డం క‌ష్ట‌మైపోతుంది.


* సాంకేతికంగా...

ఓ సాధార‌ణ‌మైన క‌థ‌ని, గొప్ప సాంకేతిక నిపుణుల‌కు ఇస్తే దాని ఫ‌లితం ఎలా ఉంటుందో చెప్పే సినిమా ఇది. ప్ర‌తీ సీన్ రిచ్‌గా.. క‌ల‌ర్‌ఫుల్‌గా ఉంటుంది. పిసి శ్రీ‌రామ్ కెమెరా ఈ సినిమాని కొత్త‌గా చూపించింది. అనిరుథ్ పాట‌లు, నేప‌థ్య సంగీతం మ‌రో ప్ల‌స్ పాయింట్‌. మాట‌లు అక్క‌డ‌క్క‌డా ఆక‌ట్టుకొన్నాయి. కామెడీ కొన్ని చోట్ల బాగా వ‌ర్కవుట్ అయ్యింది. సెకండాఫ్ భ‌రించ‌డం కొంచెం క‌ష్ట‌మే. అక్క‌డా చిన్న చిన్న మార్పులు చేసుకొంటే బాగుండేది.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

చివ‌ర‌గా:  త‌మిళ జ‌నాల‌కు న‌చ్చే కామెడీ ఇది. అది తెలుగు ప్రేక్ష‌కుల‌కూ ఎక్కేస్తుంద‌న్న న‌మ్మ‌కంతో దిల్ రాజు ఈ సినిమాని తెలుగులో డ‌బ్ చేయించాడు. అయితే అది అంత‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. త‌మిళంలో సూప‌ర్ హిట్ చిత్రాల జాబితాలో నిలిచిన ఈ సినిమా.. తెలుగులో మాత్రం జ‌స్ట్ టైమ్ పాస్ సినిమా అనిపించుకొంటుందంతే.

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25