Read more!

English | Telugu

సినిమా పేరు:ప్రేమలు
బ్యానర్:భావన స్టూడియోస్
Rating:3.00
విడుదలయిన తేది:Mar 8, 2024

సినిమా పేరు:ప్రేమలు 
తారాగణం: నస్లెన్ కె. గఫూర్, మమితా బైజు, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్ తదితరులు
రచన, దర్శకత్వం : గిరీష్ ఎ.డి
మాటలు: ఆదిత్య హాసన్ 
కెమెరా: అజ్మల్ సాంబు
సంగీతం: విష్ణు విజయ్
నిర్మాతలు: ఫాహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్
బ్యానర్: భావన స్టూడియోస్ 
విడుదల తేదీ:  మార్చి 8  2024 

ఫిబ్రవరి 9 న మలయాళం లో రిలీజ్ అయ్యి సంచలన విజయాన్ని సాధించిన మూవీ ప్రేమలు. మరి  ఈ రోజు  తెలుగులో కూడా విడుదల అయ్యింది. మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ
కేరళకి చెందిన  సచిన్ (నస్లెన్ కె. గఫూర్) ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు. ఇంజనీరింగ్ చదివిన అతను యుకె వెళ్లాలనే ప్లాన్ లో ఉంటాడు.కానీ ఆర్ధిక స్థోమత పెద్దగా ఉండదు. చిన్న ఉద్యోగం చేసుకుంటునే  అందుకు సంబంధించిన  పనుల్లో ఉంటాడు.ప్రేమ మీద మంచి నమ్మకం ఉన్న సచిన్ కి అప్పటికే ఇద్దరు అమ్మాయిల చేత లవ్ రిజెక్ట్ చేయబడి ఉంటుంది. దీంతో ప్రేమని అందుకునే అదృష్టం తనకి లేదని అనుకుంటాడు. ఇంకో పక్క హైదరాబాద్ లో రీనూ (మమితా బైజు)  ఐటీ జాబ్ చేస్తుంటుంది. తను చాలా రిచ్ అండ్ ఫ్యాషన్ గర్ల్. తను చేసుకోబోయే వాడు బాగా డబ్బున్న వాడై  ఉండాలని అలాగే  లైఫ్ లో సెటిల్ అయ్యి ఉండాలని కోరుకుంటుంది. సింపుల్ గా చెప్పాలంటే  30 సంవత్సరాల జీవితాన్ని ముందుగానే ప్లాన్ చేసుకుంటుంది. మరి ఆ ఇద్దరు ఎలా కలిశారు? కలిస్తే వాళ్ళ జర్నీ ఎలా సాగింది? అనేదే ఈ ప్రేమలు 


ఎనాలసిస్ :

పైన చెప్పుకున్నట్టు ఇది చాలా సింపుల్ కథ. ఇంకా చెప్పాలంటే ప్రతి వ్యక్తి జీవితంలో ఇలాంటి కథ ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఒక అమ్మాయని చూసి ఇష్టపడటం ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తే ఇంకో అమ్మాయి ప్రేమలో పడటమనేది  కామన్.అదే ఈ సినిమా చెప్పింది. అదే టైం లో  ప్రేక్షకులకి ఒక సినిమా నచ్చటానికి బీభత్సమైన సీన్స్ అక్కర్లేదని కూడా చెప్పింది. జనరల్ గా ఒక సినిమా గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఇలా ఉంది సెకండ్ ఆఫ్ ఇలా ఉంది అని చెప్పుకుంటాము. కానీ ఈ ప్రేమలు రెండు భాగాలు చాలా బాగుంది. మూవీ మొత్తం ఒక ఐదు  క్యారెక్టర్లు కనపడతునట్టు  అనిపించినా కూడా  డైలాగ్స్ సునామి లో ఆ ఫీలింగ్  కొట్టుకుపోయింది. కథనంలో ఉన్న కొన్ని లోపాలని కూడా  డైలాగ్స్ వల్ల  ప్రేక్షకుడు ఆలోచించడు. ఉదాహరణకి  హీరో క్యారక్టర్ మందు తాగుతుండం, హీరోయిన్ తన జీవిత లక్ష్యాన్ని హఠాత్తుగా మార్చుకోవడం లాంటివి. కాకపోతే  ప్రేమకి ఒక మనిషి ఆర్ధిక పరిస్థితికి  చేసే వృత్తికి సంబంధం లేదని అంతర్లీనంగా చెప్పడం బాగుంది. అలాగే మన మనసుకి  నచ్చే వాళ్ళు మళ్ళీ దొరుకుతారు  అని చెప్పడం కూడా బాగుంది.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు

నటీనటులందరూ ఈ కథ కోసమే పుట్టినట్టుగా నటించారు.ముఖ్యంగా హీరో హీరోయిన్  నస్లెన్, మమితా బైజు లు  తమ పాత్రల్లో జీవించారని చెప్పవచ్చు .చిన్న చిన్న ఎక్సప్రెషన్స్ లో కూడా సూపర్ గా చేసారు.  హీరో ఫ్రెండ్ గా చేసిన  సంగీత్ ప్రతాప్, హీరోయిన్ ఫ్రెండ్ గా చేసిన అఖిలా భార్గవన్ కూడా ఆ పాత్రలు తమ కోసమే పుట్టినట్టుగా చేసారు.ఇలా  ఒక్కరిని కాదు కానీ అందరు చాలా చక్కగా చేసారు. ఇక డైలాగ్ రైటర్  ఆదిత్య హాసన్ మరో సారి తన మ్యాజిక్ ని రిపీట్ చేసాడు. ఎలాంటి హంగామా లేకుండా ఆయన రాసిన కామన్ మాన్  మాట్లాడుకునే  మాటలు  సూపర్ గా పేలాయి.ఇక దర్శకుడి  పని తనం చాలా స్పష్ఠంగా కనపడింది. నిర్మాణ విలువలు ఇలాంటి సినిమాల్లో పెద్దగా కనపడవు. అలాగే ఇలాంటి కథ లని నమ్మి తెరకెక్కించడం  నిజంగా అభినందనీయమే. పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా కొత్తగా ఉంది. ఫొటోగ్రఫీ   రెగ్యులర్ గానే  ఉంది.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ప్రేమలు లాంటి  మిరాకిల్ మూవీస్ ప్లాన్ చేస్తే రావు. అలా జరిగిపోతాయంతే..ఈ వేసవికి మీకు చల్ల దనం కావాలంటే ప్రేమలు ఆడుతున్న థియేటర్స్ కి వెళ్ళండి. మీరు నవ్వుల జడివానలో తడిసి ముద్దవ్వడం  ఖాయం. నవ్వుకి ఎలాంటి టాక్స్ లేదు. ఓన్లీ టికెట్ డబ్బులే
 

-అరుణా చలం