Read more!

English | Telugu

సినిమా పేరు:ప్రవరాఖ్యుడు
బ్యానర్:టాలీ 2 హాలీ ఫిల్మ్స్
Rating:2.25
విడుదలయిన తేది:Dec 4, 2009
ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే చాలా సింపుల్‌ కథ. పి.జీ. కాలేజీలో నిర్వహించిన ప్రతి ప్రోగ్రామ్స్‌లోనూ, చదువులోనూ అందరికంటే ఫస్ట్‌ ప్లేస్‌ సంపాదిస్తుంది శైలజ (ప్రియమణి). అంతే కాదు ఆమెకి సపరేట్‌గా ఒక గ్యాంగ్ కూడా వుంటుంది. ఈ గ్యాంగ్‌లో మరో వ్యక్తి జాయిన్‌ అవుతాడు.... అతనే శశీ (జగపతిబాబు). ఇక ఆ కాలేజీలో ప్రతీ యువకుడు శైలజకు ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమించమంటూ వెంటపడతారు. వారి ప్రేమను మాత్రం తిరస్కరిస్తూ తన ఫ్రెండ్స్‌తో చూసారా నా వెంట ఎలా తిరుగుతున్నారో అంటూ వుంటుంది. శైలజ చెప్పే ప్రతిదీ వింటూ తన ఫ్రెండ్స్‌ ఆమెను ఆకాశానికి ఎత్తేస్తుంటే జగపతిబాబు మాత్రం శైలజను డిజపాయింట్‌ చేస్తూ.. నీ చదువు, నీ సంస్కారం, నీ తెలివితేటలు చూసి కాదు వారు నీకు ప్రేమలేఖలు రాస్తుంది అంటుండగా మధ్యలో శైలజ మరి ఎందుకు రాస్తున్నారు అంటుంది.. నీ ఫిజిక్‌ చూసి అంటాడు శశీ. ఇలా ఆ కాలేజీలో శశితో ప్రతి విషయంలోనూ గొడవపడుతూనే తనకు తెలియకుండానే అతని ప్రేమించి అదే విషయాన్ని శశీతో చెబుతుంది. కానీ శశీ మాత్రం ఆమె ప్రేమను తిరస్కరిస్తాడు. తన ప్రేమను కాదన్న వ్యక్తికి కనిపించకుండా వుండాలని ఆ కాలేజీలో నుంచి వేరే కాలేజీకి శైలజ వెళ్ళాలనుకుంటున్న సమయంలో శశి ఆమెను కలిసి నీవు ఎక్కడికీ వెళ్ళవద్దు నేనే వెళ్ళిపోతాను అంటూ ఆ కాలేజీ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శశి అమెరికా వెళ్ళి హాక్స్‌ యూనివర్సిటీలో జువాలజీ మీద ప్రయోగాలు చేస్తూ మంచి పేరు సంపాదించుకొని పెళ్ళిచేసుకోవాలని ఇండియాకు వచ్చి అమ్మాయిల వేటలో పడతాడు శశి. ఇలా పెళ్ళి ఆలోచనలో ఉన్న శశికి తన కాలేజ్‍ ఫ్రెండ్‌ రవి (సునీల్‌) ద్వారా శైలజ ఉమెన్స్‌ కాలేజీలో ప్రిన్స్ పాల్‍ హోదాలో జాబ్‌ చేస్తుందని తెలుసుకొని ఆమెను కలవడానికి వెళ్ళితే ఆమె అతన్ని తిరస్కరిస్తుంది. మొదట తనని ప్రేమిస్తున్న శైలజను కాదన్న శశి ఆ తర్వాత అతను ఆమెను ఎందుకు ప్రేమించాడు...? శశి ప్రేమకు శైలజ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందా.. శైలజ, శశిలు ఒక్కటవుతారా అని మీకు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్ :
మదన్‌, జగపతిబాబు, ప్రియమణిల కాంబినేషన్‌లో "పెళ్ళైన కొత్తలో'' చిత్రం తర్వాత వచ్చిన ఈ "ప్రవరాఖ్యుడు'' చిత్రాన్ని కూడా కుటుంబ సమేతంగా చూడవచ్చు. ఈ చిత్రంలో ఎక్కడా అశ్లీలత, అసభ్యతలకు తావు లేకుండా తీసిన మదన్‌ని మనస్ఫూర్తిగా అభినందించాలి. చక్కని కథ, చక్కని కథనం, చక్కని స్ర్కీన్‌ప్లే, కడుపుబ్బ నవ్వించే హాస్యం, మన సంప్రదాయం, సంస్కృతి, ఆచార వ్యవహారాలు ఈ చిత్రంలో చూపించిన తీరు చూడ ముచ్చటేస్తుంది. అంతే కాదు మదన్‌ రచయిత కూడా కావడంతో "ప్రవరాఖ్యుడు'' చిత్రంలోని ప్రతీ క్యారెక్టర్‌ని తీర్చిదిద్ది, ఈనాటి ప్రేక్షకులకు కావలసిన అన్ని అంశాల్ని జతచేయడమే కాకుండా... ప్రతి చిన్న అంశాన్ని ఎంతో కేర్‌ తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన:- ఈ చిత్రంలో జగపతిబాబు చాలా బ్యాలెన్స్‌గా నటించాడనే చెప్పాలి. ఆయన శశిగా తన క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేయడమే కాకుండా జీవం పోసాడు. ఇక ప్రియమణి విషయానికి వస్తే... తాను చదువుకునే రోజుల్లో ఒక యువకుడిని ప్రేమించే క్యారెక్టర్‌లోనూ, ఆ తర్వాత కాలేజీ ప్రిన్స్‌పాల్‌ క్యారెక్టర్స్‌కి ఆమె పూర్తి న్యాయం చేసారు. బ్రహ్మానందం, ఏ.వి.యస్, ఆలీ, సునీల్‌ల కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. సంగీతం:- ఈ చిత్రానికి కీరవాణి అందించిన సంగీతం చాలా బాగుంది. ఎడిటింగ్‌:- బాగానే వుంది. కొరియోగ్రఫీ:- డీసెంట్‌గా, నీట్‌గా, ఎట్రాక్టీవ్‌గా వుంది. మాటలు:- ఈ చిత్రానికి మదన్‌ అందించిన ప్రతీ డైలాగ్‌లోనూ ఎదో ఒక జీవిత సత్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మదన్‌, జగపతిబాబు, ప్రియమణిల కాంబినేషన్‌లో వచ్చిన "పెళ్ళైనకొత్తలో" చిత్రాన్ని దృష్టిలో పెట్టుకుని వెళితే మాత్రం మీరు కొంచెం నిరాశ పడక తప్పదు.