Read more!

English | Telugu

సినిమా పేరు:ప్రసన్నవదనం
బ్యానర్:లిటిల్ థాట్స్ సినిమాస్
Rating:2.75
విడుదలయిన తేది:May 3, 2024

సినిమా పేరు: ప్రసన్నవదనం
తారాగణం: సుహాస్,పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్,నితిన్ ప్రసన్న, నందు,  హర్ష వర్ధన్,వైవా హర్ష, సాయి శ్వేత 
రచన, దర్శకత్వం : అర్జున్ వై.కె
సంగీతం : విజయ్ బుల్గానిన్ 
నిర్మాతలు : మణికంఠ,ప్రసాద్ రెడ్డి
విడుదల తేదీ: మే  3, 2024 

 

వరుస హిట్లతో దూసుకుపోతున్న సుహాస్ ఈ రోజు ప్రసన్నవదనం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మరి సుహాస్ విజయపరంపర కంటిన్యూ అయ్యిందో లేదో చూద్దాం

 

కథ
తన తల్లి తండ్రులతో కలిసి కారులో వెళ్తున్న సూర్య ( సుహాస్ ) కారు  యాక్సిడెంట్ కి గురవుతుంది. ఆ ప్రమాదంలో తల్లి తండ్రులు ఇద్దరు చనిపోతారు. సూర్య  మాత్రం ఫేస్ బ్లైండ్ నెస్ అనే ఒక అరుదైన వ్యాధి బారిన పడతాడు. అంటే ఒక మనిషి ముఖం సూర్యకి రక రకాలుగా కనపడుతుంటుంది. సింపుల్ గా చెప్పాలంటే మనిషి ముఖం అతనికి గుర్తు ఉండదు. రేడియో మిర్చిలో జాకీగా పని చేస్తుంటాడు. సాటి వారి పట్ల జాలి దయ కల్గిన సూర్య మెంటాలిటీ నచ్చి  ఆధ్య   (పాయల్ రాధాకృష్ణ) ప్రేమిస్తుంది. సూర్య కూడా ఆమెని ప్రేమిస్తాడు. ఈ క్రమంలో అమృత (సాయిశ్వేత) అనే అమ్మాయి హత్య జరుగుతుంది . కాకపోతే ప్రపంచం మొత్తం యాక్సిడెంట్ అని నమ్ముతుంది. దాంతో  పోలీసులు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్  వైదేహి (రాశీ సింగ్ )  ఆధ్వర్యంలో  కేసు క్లోజ్ చెయ్యాలని చూస్తుంటారు. కానీ అమృత ది  హత్యా అని సూర్య కంప్లైంట్ ఇస్తాడు. కానీ పోలీసులే  సూర్య మీద మూడు హత్యలు చేసినట్టు కేసు ఫైల్ చేస్తారు. వాళ్ళు అలా ఎందుకు చేసారు?  అమృత  కేసు విషయంలో  తనకున్న ఫేస్  బ్లైండ్ నెస్ అనే వ్యాధిని దాటుకొని అసలు నేరస్తుల్ని సూర్య  ఎలా పట్టుకున్నాడు?  అసలు అమృత ఎవరు? తన లవ్ ఏమైంది ? అనేదే ఈ కథ.
 


ఎనాలసిస్ :

ముందుగా ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడుకున్న  కథని ఎంచుకున్నందుకు దర్శకుడుకి కంగ్రాట్స్ చెప్పాలి. మూవీ చూస్తున్నంత సేపు ఎక్కడ  బోర్ కొట్టదు.కాకపోతే  ఫేస్ బ్లైండ్ నెస్ ఉన్న వ్యక్తి తన లోపాన్ని నయం చేసుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తే బాగుండేది. ఈ యాంగిల్ ని ఫస్ట్ ఆఫ్ లో ఎంటర్ టైన్మెంట్ కోణంలో చెప్పుండాల్సింది. క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ లాంటివి మధ్య మధ్యలో వచ్చి వచ్చి ఉంటే బాగుండేది.  హీరో హీరోయిన్ ల మధ్య కామెడీ ట్రాక్ ని నడిపే అవకాశం ఉన్నా ఎందుకనో ఆ దిశగా వెళ్ళలేదు.కాకపోతే  హీరో హీరోయిన్ల  పరిచయం సీన్స్ చాలా బాగున్నాయి. ఇంటర్వెల్ సీన్ కూడా చాలా బాగుంది. ఇక సెకండ్ ఆఫ్ లో వచ్చిన చాలా  ట్విస్ట్ లు సినిమాకి చాలా హెల్ప్ అయ్యాయి.  ముఖ్యంగా రాశి సింగ్, సూర్య,  పాయల్ రాధాకృష్ణ,  నితిన్ ప్రసన్న ల మధ్య వచ్చిన సీన్స్ ప్రేక్షకులకి థ్రిల్ ని కలిగించాయి. కాకపోతే ప్రేక్షకుడికి సినిమా చూస్తున్నంత సేపు కూడా  మైండ్ లో ఒక ఆలోచన వస్తు ఉంటుంది. అబ్బా బడ్జట్ ఇంకొంచం ఎక్కువ ఉంటే సినిమా రేంజ్ వేరేలా ఉండేది అని. అది నూటికి నూరుపాళ్లు నిజం కూడా 

 

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు
సుహాస్ మరోసారి తన సహజమైన నటనతో  అదరగొట్టాడు.ఫేస్ బ్లైండ్ నెస్ ప్రాబ్లం వల్ల  మనుషుల్ని గుర్తుపట్టలేని పరిస్థితిలో బాధపడే సన్నివేశాల్లో సూపర్ గా నటించాడు. తన కెరీర్ లో మొదటి సారి యాక్షన్ సీక్వెన్స్ లో చాలా బాగా చేసాడు.ఇక హీరోయిన్  పాయల్ రాధాకృష్ణ తన పాత్ర పరిధి మేరకు చాలా చక్కగా చేసింది. అసలు ఆ పాత్ర తన కోసమే పుట్టిందేమో అనేలా చేసింది.క్లోజ్ షాట్స్ లో కూడా మంచి ఎక్సప్రెషన్స్ ని  పలికించింది. ఇక ఏసిపి క్యారక్టర్ లో రాశి సింగ్ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తన నట విశ్వ రూపాన్ని ప్రదర్శించింది. వరలక్ష్మి శరత్ కుమార్ అవకాశాలని రాశి సింగ్ దక్కించుకునే అవకాశం ఉంది. ఎస్ఐ క్యారక్టర్ చేసిన  నితిన్ ప్రసన్న కూడా సూపర్ గా చేసాడు. ఫ్యూచర్ లో అతనికి మరిన్ని అవకాశాలు రావచ్చు. వైవా హర్ష,  నందు, సత్య లు కూడా తమ   పరిధిమేరకు చక్కగానే నటించారు.

ఫొటోగ్రఫీ చాలా బాగుంది. ఇక మ్యూజిక్ ని అందించిన  విజయ్ బుల్గానిన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో  సినిమాని నిలబెట్టాడు. సాంగ్స్ కూడా బాగున్నాయి. నిర్మాణ విలువలు మాత్రం సోసో గా ఉన్నాయి
 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఎంత చెట్టుకి అంతే గాలి అనే సామెత ప్రసన్నవదనంతో  మరోసారి రుజువయ్యింది. సినిమా అయితే నాట్ బాడ్.. వెరైటీ కాన్సెప్ట్ తో కూడిన థ్రిల్లర్ మూవీ కాబట్టి టైటిల్ కూడా డిఫరెంట్ గా పెట్టుండాల్సింది. ప్రసన్న వదనం అంటే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నవ్వు ముఖంతో ఉండటం.

- అరుణాచలం