English | Telugu

సినిమా పేరు:పెద్దన్న
బ్యానర్:సన్ పిక్చర్స్
Rating:1.75
విడుదలయిన తేది:Nov 4, 2021

సినిమా పేరు: పెద్దన్న
తారాగ‌ణం: రజినీకాంత్, కీర్తి సురేష్, నయనతార, ప్రకాష్ రాజ్, ఖుష్బూ, మీనా, జగపతిబాబు, అభిమన్యు సింగ్
సంగీతం: ఇమ్మాన్
సినిమాటోగ్ర‌ఫీ: వెట్రి
ఎడిటింగ్: రూబెన్
ప్రొడక్షన్: సన్ పిక్చర్స్
ద‌ర్శ‌క‌త్వం: శివ
విడుద‌ల తేదీ: నవంబర్ 4, 2021

సూపర్ స్టార్ రజినీకాంత్.. ఆయనో సెన్సేషన్.. ఆయన పేరే ఒక సెలెబ్రేషన్. మరే హీరోకి సాధ్యం కానీ క్రేజ్ ఆయన సొంతం. ఆయన వెండితెరపై కనిపిస్తే అభిమానులు పండగ చేసుకుంటారు. అయితే కొంతకాలంగా ఆయన స్థాయి విజయం మాత్రం ఆయనకు దక్కట్లేదు. దీంతో అభిమానులు విజయ దాహాంతో ఆయన సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ దీపావళికి 'పెద్దన్న' సినిమాతో రజినీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కమర్షియల్ సినిమాలతో సంచలన విజయాలు అందుకున్న శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడంతో 'పెద్దన్న'పై మొదటి నుంచి మంచి అంచనాలే నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్ తోనే ఈ సినిమా ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకొని తీసిన పక్కా కమర్షియల్ సినిమా అని అర్థమైంది. మరి 'పెద్దన్న'తో అయినా రజినీ తన అభిమానులు దాహాన్ని తీర్చారా? అనేది రివ్యూ చదివి తెలుసుకుందాం.

కథ:
చుట్టుపక్కల కొన్ని గ్రామాలకు పెద్దగా ఉంటే వీరన్న(రజినీకాంత్) సెటిల్మెంట్స్ అంటూ ఎప్పుడూ పొలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆయనకు తన చెల్లెలు కనకమహలక్ష్మి(కీర్తి సురేష్) అంటే ప్రాణం. చెల్లెలని చూడకుండా ఉండలేడు. చెల్లెల్ని చదువు కోసం దూరం పంపినా వారానికొకసారి ఊరికి రప్పించుకుంటాడు. ఇంతలో చెల్లెలి చదువు అయిపోయి ఆమెకి పెళ్లి చేయాల్సిన సమయం వస్తుంది. అప్పుడు ఆమెకి పెళ్లి చేసి దూరం పంపడం ఇష్టం లేని వీరన్న.. దగ్గరలోనే పెళ్లి సంబంధాలు చూస్తాడు. అలా ఒక సంబంధం కుదురుతుంది. ఏర్పాట్లు అన్ని అయిపోయి మరికొద్దిసేపట్లో పెళ్లి జరగబోతుంది అనగా ఊహించని ఘటన జరుగుతుంది. అసలు కనకమహలక్ష్మి పెళ్లి వద్దనుకొని ఎందుకు వెళ్ళిపోయింది?.. చెల్లెలి కోసం వీరన్న కలకత్తా ఎందుకు వెళ్ళాడు? అక్కడ మహలక్ష్మికి వచ్చిన కష్టం ఏంటి? వీరన్న పెద్దన్నగా ఎందుకు మారాడు అనేది మిగతా కథ.

ఎనాలసిస్ :

కమర్షియల్ సినిమాలో కొత్త కథ ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేయడం పొరపాటే. కానీ ఎన్నో విభిన్న కథలు వస్తున్న ఈ సమయంలో ఇలాంటి పాతకాలం నాటి రొటీన్ కథతో రజినీ కాంత్ లాంటి స్టార్ ని పెట్టి సినిమా తీసి హిట్ కొట్టాలి అనుకోవడం శివ చేసిన పెద్ద పొరపాటు అనే చెప్పాలి. ఈ సినిమాలో అప్పట్లో పవన్ కళ్యాణ్ నటించిన 'అన్నవరం' సినిమా ఛాయలు కనిపిస్తుంటాయి. ఈ సినిమాలో కేవలం కథే కాదు, సన్నివేశాలు కూడా రొటీన్ గా ఉన్నాయి. కథ పాతది అయినప్పుడు కొత్తగా చెప్పాలి అంటారు. కానీ అలా పాత కథని కొత్తగా చెప్పడంలో కూడా శివ&టీమ్ ఫెయిల్ అయింది.

పెద్దన్న ఎవరు?(who is peddanna?) అంటూ ఒక క్యూరియాసిటీతో సినిమా ప్రారంభమవుతుంది. మీడియా, సోషల్ మీడియాలో పెద్దన్న పేరు మారుమోగిపోతుంటుంది. పెద్దన్న కోసం గ్యాంగ్స్ వెతుకుంటాయి. కానీ ఆ క్యూరియాసిటీ ఎంతోసేపు నిలవలేదు. ఆరు నెలల క్రితం అంటూ విలేజ్ లో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అన్న చెల్లెలి అనుబంధంతో మొదలై ఔట్ డేటెడ్ కామెడీతో రన్ అవుతూ ఉంటుంది ఫస్ట్ హాఫ్. ప్రకాష్ రాజ్, నయనతార, ఖుష్బూ, మీనాల సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేక పోయాయి. ఇంటర్వెల్ కి 10 నిమిషాల ముందు మాత్రం సినిమాలో వేగం పెరిగి సన్నివేశాలు కాస్త ఆకట్టుకునేలా ఉంటాయి. ముఖ్యంగా 'నీ నీడలా ఉంటూ నిన్ను కాపాడుకుంటా' అని వీరన్న తన చెల్లెలికి చెప్పినట్లు అర్థం వచ్చేలా చూపించిన ఇంటర్వెల్ షాట్ సినిమాకే హైలెట్ అని చెప్పాలి.

ఇక సెకండ్ హాఫ్ అంతా కలకత్తాలో జరుగుతుంది. చెల్లెలి కోసం పెద్దన్న విలన్స్ తో తలబడే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే కమర్షియల్ సినిమాల్లో విలన్ ని ఎంత పవర్ ఫుల్ గా చూపిస్తే హీరోయిజం అంత ఎలివేట్ అవుతుంది. ఈ సినిమాలో అది మిస్ అయింది. పేరుకి ఈ సినిమాలో ఇద్దరు విలన్స్(జగపతి బాబు, అభిమన్యు సింగ్) ఉన్నా కానీ బలమైన సన్నివేశాలు లేకపోవడం వల్ల విలనిజం అంత పవర్ ఫుల్ గా అనిపించలేదు. దీంతో రజినీ తన మ్యానరిజం, యాక్షన్ తో హీరోయిజం చూపించడమే తప్ప.. సన్నివేశాలతో అంతగా ఎలివేట్ అవ్వలేదు. క్లైమాక్స్ కూడా ఆకట్టుకోలేకపోయింది.

ఇమ్మాన్ సంగీతం కూడా ఈ సినిమాకి ప్లస్ కాలేదు. పాటలు హమ్ చేసుకునేలా లేవు. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం పర్లేదు. ఇక వెట్రి సినిమాటోగ్రఫీ సినిమాకి రిచ్ లుక్ తీసుకొచ్చింది.

న‌టీన‌టుల ప‌నితీరు:
రజినీకాంత్ నటన గురించే కొత్తగా చెప్పేది ఏముంది. రొటీన్ సన్నివేశాలను నిలబెట్టటానికి ఆయన బాగానే ప్రయత్నించారు. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ లో కంటతడి పెట్టించారు. ఇక కీర్తిసురేష్ కూడా సెంటిమెంట్స్ సీన్స్ ఎప్పటిలా బాగానే నటించింది. ప్రకాష్ రాజ్, నయనతార, ఖుష్బూ, మీనా, జగపతిబాబు వంటి ఎందరో స్టార్ కాస్ట్ ఉన్నా వాళ్ళకి తగ్గ పాత్రలు పడలేదనే చెప్పాలి. పాత్రల పరిధి మేరకు మెప్పించే ప్రయత్నం చేశారు. ఉత్తవ్ పారేకర్ పాత్రలో కనిపించిన జగపతిబాబు లుక్ క్రూరంగా ఉన్నా, సన్నివేశాలు బలంగా లేకపోవడంతో ఆ పాత్ర తేలిపోయింది.

తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

రొటీన్ స్టొరీతో దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పెద్దన్న' తుస్ అనిపించింది. టైటిల్ లో 'పెద్దన్న' ఉన్నా వినోదాన్ని పంచడంలో మాత్రం 'చిన్నన్న'గా మిగిలిపోయింది.

  -గంగసాని

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25