Read more!

English | Telugu

సినిమా పేరు:పరమ వీర చక్ర
బ్యానర్:తేజ సినిమా
Rating:2.75
విడుదలయిన తేది:Jan 12, 2011
గతంలో దాసరి దర్శకత్వంలో యన్ టి ఆర్ నటించిన "బొబ్బిలిపులి"చిత్రంలోని కోర్టు సీన్ తో ఈ చిత్రం మొదలవుతుంది.యన్ టి ఆర్ ని ఉరి వేయటానికి తీసుకెళ్ళేటప్పుడు జయసుధ వచ్చి "అన్నా నీవు లేకపోతే మేమంతా ఆత్మహత్యలు చేసుకుంటా"మనగానే యన్ టి ఆర్ "ఒక బొబ్బిలి చనిపోతే మరో బొబ్బిలి పులి పుడతాడు"అని నిండు గర్భవతిగా ఉన్న ఆమె కడుపుని నిమిరి వెళ్ళిపోతాడు.ఆమె కొడుకు చక్రధర్ (బాలకృష్ణ)సినీ హీరో అవుతాడు.అతనికి కథ చెపుతామని వచ్చిన మిలటరీ ఆఫీసర్ (మురళీ మోహన్)మేజర్ జయసింహ (బలకృష్ణ)కథ ఆసక్తికరంగా చెపుతాడు.దాంతో జయసింహ పాత్రను ఆవహింపచేసుకుంటాడు చక్రధర్.అప్పుడు చక్రధర్ ని హిమాచల్ ప్రదేశ్ తీసుకెళ్ళి చావుబ్రతుకుల మధ్య ఉన్న జయసింహను అతనికి మిలటరీ ఆఫీసర్ చూపిస్తాడు.జయసింహ అచ్చుగుద్దినట్లు చక్రధర్ లాగా ఉంటాడు.కొందరు దేశద్రోహులు నిజాయితీపరుడూ,దేశభక్తుడైన జయసింహను దేశద్రోహిగా చిత్రీకరించారనీ,అతను దేశద్రోహి కాదనీ,దేశభక్తుడని నిరూపించటానికే చక్రధర్ ని అక్కడికి తెచ్చామనీ అంటాడు మిలటరీ ఆఫీసర్.జయసింహను చక్రధర్ దేశభక్తుడిగా ఎలా నిరూపించాడనేది మిగిలిన కథ.
ఎనాలసిస్ :
ఇది దర్శకరత్న దాసరి నారాయణరావుకి 150 వ చిత్రం కావటంతో,ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు ఆయన ఈ చిత్రం ప్రారంభోత్సవంనాడు చెప్పటం జరిగింది.కానీ ఈ చిత్రాన్ని చూస్తుంటే అంతలేదనిపిస్తుంది.దాసరి కాలంతో పాటు తనను తాను మలచుకోవటంలో విఫలమయ్యారని అర్థమవుతుంది.ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకోవటంలో కానీ,టేకింగ్ పరంగా కానీ,స్క్రీన్ ప్లే పరంగా కానీ,నేటి యువ దర్శకులతో పోటీ పడటం ఆయనకు శక్తికి మించిన పనే అయ్యిందీ చిత్రంలో అని అర్థమవుతుంది.నేటి ప్రముఖ యువ దర్శకులతో ఏ కోశానా పోటీపడే రీతిలో ఆయన టేకింగ్ లేదు.ఇక ఆయన స్క్రీన్ ప్లే ఈ చిత్రానికి పెద్ద మైనస్.బాలకృష్ణ సినీ యాక్టర్ గా రావణాసురుడు,కార్మిక నాయకుడు,కొమరం భీం వంటి వేషాలతోఈ చిత్రం ఫస్ట్ హాఫ్ కాస్త ఫరవాలేదనిపించుకుంటుదనుకుంటుండగా స్క్రీన్ ప్లే లో ఉన్న డ్రాపవుట్స్ ఈ చిత్రం గ్రాఫ్ ని పడేశాయి.అది సెకండ్ హాఫ్ లో మరింత కొట్టొచ్చినట్టు కనపడుతుంది.సెకండ్ హాఫ్ లో సినిమా దెబ్బతినటానికి అనేక కారణాలున్నాయి.చివర్లో షీలాతో పాట పెట్టటం,బాలయ్య జైల్లో ఉన్నప్పుడు అతని కొడుకు పాట నేర్పించమనటం వంటి సీన్లు, విజయ కుమార్,విజయచందర్,మురళీ మోహన్,నాగినీడుల పాత్రలు నడిచిన తీరు సినిమా కథనానికి అడ్డంకిగా మారాయని చెప్పాలి. నటన - ఈ చిత్రంలో యువరత్న నందమూరి బాలకృష్ణ మిలటరీ మేజర్ గా,సినీ హీరోగా ద్విపాత్రాభియం చేశారు.50 వ పడిలో పడినా ఆయన స్పీడ్ కానీ,ఆయన జోష్ కానీ ఎక్కడా తగ్గలేదు.షీలా ఒక ఇంటర్ వ్యూలో చెప్పినట్టు ఆయన స్పీడ్ చూస్తుంటే ఆయన జూనియర్ యన్ టి ఆర్ కి అన్నయ్య అనుకుంటారే కానీ బాబాయ్ అని అనుకోరు.డ్యాన్సుల్లో,ఫైట్స్ లో ఆయన అదరగొట్టారు.ఇక డైలాగ్ డెలివరీలో,డైలాగ్ మాడ్యులేషన్ లో ఆయన ఈ చిత్రంలో కొత్తపుంతలు తొక్కారు.సినీ హీరోగా ఆయన నిజజీవితంలోని పాత్రను ఒక పాత్రగా ఆయనీ చిత్రంలో పోషించారు.ఆ పాత్ర ద్వారా రావణాసురుడు, కొమరం భీం వంటి పాత్రలను చక్కగా పోషించారు.ఒక నటుడిగా ఆయన నటనలో చక్కని పరిణితి కనిపించింది.ఆయన వరకూ ఎక్కడా తన కృషి లోపం లేకుండా తన పాత్రలకు సంపూర్ణ న్యాయం చేశారని చెప్పాలి.ఈ చిత్రంలోని ముగ్గురు హీరోయిన్లు..అంటే మేజర్ భార్యగా అమీషా పటేల్,సినీ హీరో అభిమానిగా షీలా,నెగెటీవ్ షేడ్ ఉన్న పాత్ర రజియా సుల్తానాగా నేహా ధూపియా ఎవరికి వారు తమ పాత్రలకు న్యాయం చేశారు.రోబోగా ఆలీ,సైంటిస్ట్ గా బ్రహ్మానందం కామెడీని అక్కడక్కడా పండించారు.నిర్మాణపు విలువలు ఫరవాలేదు. సంగీతం - చెప్పుకోతగిన స్థాయిలో ఈ చిత్రంలోని పాటలు లేవు.అది కాకుండా గతంలో బాలకృష్ణ,మణిశర్మ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాల సంగీతంతో పోలిస్తే ఈ చిత్రంలోని సంగీతం ఆశించిన స్థాయిలో లేదు.రీ-రికార్డింగ్ ఫరవాలేదు. సినిమాటోగ్రఫీ -ఈ చిత్రంలో కేమెరా పనితనం ఆశించిన స్థాయిలో లేదనే చెప్పాలి.రమణరాజు కెమెరా వర్క్ ఈ చిత్రానికి మైనస్ అనే చెప్పాలి.విఠలాచార్య కాలంనాటి స్టైల్ ఈ చిత్రంలో కనిపిస్తుంది. మాటలు - మాటల్లో కొన్ని అర్థవంతమైన మాటలతో అలరించాయి.ఉదాహరణకు మేజర్ చెప్పే "వేర్ పోలీస్ ఫెయిల్స్ దేర్ మిలటరీ కమ్స్.అప్పుడు నో రూల్స్,నో డిస్కషన్స్.కుమ్ముడే","నేను కొట్టినా ఛస్తావ్...నన్ను కొట్టినా ఛస్తావ్","నేను యాక్షన్ లో ఉండగా రియాక్షన్ ఉండకూడదు"వంటి మాటలు మాస్ ప్రేక్షకులను కాస్తో కూస్తో అలరిస్తాయి. పాటలు - పాటల్లో సాహిత్యం సగటు స్థాయిలోనే ఉంది.పెద్దగా చెప్పుకోటానికేం లేదు. ఎడిటింగ్ - ఎడిటింగ్ ఒ.కె. ఆర్ట్ - ఫరవాలేదు. కొరియోగ్రఫీ - ఈ చిత్రంలో కొన్ని పాటల్లో కొరియోగ్రఫీ బాగున్నా,కొత్తగా ఏం లేకపోవటంతో పాటలు పెద్దగా ఆకట్టుకోవు. యాక్షన్ - ఇది మాత్రం అవసరానికి మించి బాగుందని చెప్పాలి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
గతంలో దాసరి "ఇది నా వందవ చిత్రం...చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టుగా తీస్తాను"అని "లంకేశ్వరుడు"చిత్రాన్ని డిజాస్టర్ చేసిన ఘనచరిత్ర దాసరిది.ఈ 150 వ చిత్రాన్ని కూడా దానికి భిన్నంగా ఏం తీయలేదు దాసరి.ఈ చిత్రం వందవ చిత్రం అంత దారుణంగా లేకపోయినా బాలయ్యమంచితనాన్ని,"సింహా"సక్సస్ ని ఆయన క్యాష్ చేసుకునే ప్రయత్నంగా ఈ చిత్రముంటుంది.మీకేం తోచకపోతే సరదాగా బాలయ్య నటన చూడటం కోసం ఈ సినిమా ఒకసారి చూడొచ్చు.