Read more!

English | Telugu

సినిమా పేరు:ఆరెంజ్
బ్యానర్:అంజనా ప్రొడక్షన్స్
Rating:2.50
విడుదలయిన తేది:Nov 26, 2010
పునాది వంటి కథలో దమ్ములేకపోతే సినిమా నిలబడదనే ప్రాథమిక సూత్రాన్ని మరచిపోతే సినిమా నిలబడటం చాలా కష్టం. గతంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన "ఆర్య"పేట్రన్ లోని సినిమానే ఇది.కాకపోతే దాన్లో పాయింట్‍ కన్విన్సింగ్ గా ఉంటే దీన్లో అది మిస్సయింది.ఆస్ట్రేలియాలో ఉండే రామ్ (రామ్ చరణ్ తేజ)కి చిన్నప్పుడు 5 యేళ్ళ వయసునుంచే ప్రేమంటే తెలుసు.ఆ వయసులో అతను తన టీచర్ ని ప్రేమిస్తాడు.అప్పటి నుంచీ తొమ్మిదిమందిని ప్రేమిస్తాడు.దీనికి కారణంగా నిజమైన ప్రేమ కొంతకాలమే ఉంటుందనీ,ఆ తర్వాత ప్రేమిస్తున్నామని మోసం చేయటమేననీ అతని కచ్చితమైన అభిప్రాయం.అలాటి సమయంలో జానూ(జెనీలియా)ని చూసి మళ్ళీ ప్రేమలో పడతాడు రామ్.ఆమెకి కూడా ఇదే విషయాన్ని చెపుతాడు.కానీ ఆమె అతన్ని తన జీవితమంతా ప్రేమించమంటుంది.కానీ అది కుదరదంటాడు రామ్.ఆ తర్వాత ఏమయిందనేది మిగిలిన కథ.
ఎనాలసిస్ :
దర్శకత్వం-ఈ సినిమా టేకింగ్ బాగుంది.స్క్రీన్ ప్లే ఫరవాలేదు కానీ అసలు కథలోనే లోపముంది.అనుకున్న కథలో క్లారిటి ల్కపోవటం, కన్ ఫ్యుజింగ్ గా ఉండటం,అ ఈ చిత్రానికి మైనస్ పాయింట్లు.ఒక విధంగా దర్శకుడిగా భాస్కర్ కిది తొలి ఫెయిల్యూర్ అని చెప్పాలి.అతను "నిజమైన ప్రేమ కొంతకాలమే ఉంటుందనీ,ఆ తర్వాత ప్రేమిస్తున్నామని మోసం చేయటమేననే"పాయింట్ తప్పని చివర్లోహీరోని కన్విన్స్ చేయటానికి తొమ్మిదిమందిని హీరో ప్రేమించాడని చెప్పించాల్సిన అవసరం లేదు.దానికి "ట్రూత్ ఆర్ డేర్"అనే గేమ్ ని అడ్డం పెట్టుకుని మాటల జిమ్మిక్ చేయటానికి ప్రయత్నించినా,అది పెద్దగా ఫలించినట్లు కనిపించదు.మనకి తెలియని గ్రాఫిట్ అనే పెయింటింగ్ ని ఈ చిత్రంలో చూపించారు.ఇక హీరో స్కై డైవింగ్ చేసినా,ఆ డైవింగ్ లో యాక్షన్ జొప్పించినా కూడాపెద్దగా ఫలితం కనిపించదు.ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ మరి కాస్త సాగినట్టుగా అనిపిస్తుంది. నటన - రాజమౌళి సెమటిమెంట్ కి రామ్ చరణ్ మినహాయింపవుతాడనుకున్నాం కానీ,రాజమౌళి దగ్గర పనిచేసి బ్లాక్ బస్టర్ హిట్టిచ్చిన ఏ హీరో కూడా సుఖ సుఖాలతో లేడనేది మరోసారి రుజువయ్యింది.హీరోగా రామ్ తన వరకూ బాగానే నటించాడు.కానీ భాష స్పష్టత విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది.డైలాగ్ స్పీడ్ గా చెప్పే సమయంలో మాడ్యులేషన్ లో బ్యాలెన్సింగ్ అవసరం.ఇక డ్యాన్సులూ,ఫైటులూ అతను బాగా చేస్తాడని చెప్పటం హాస్యాస్పదమే అవుతుంది.అతని గత రెండు చిత్రాల్లో అతను వాటినెలా చేశాడో మనందరికి తెలుసు.జెనీలియా తన పాత్రకు న్యాయం చేసింది.బ్రహ్మానందం కామెడీ పెద్దగా పేల్లేదు.వెన్నెల కిశోర్ కామెడీ కూడా అంతే.కానీ డైలాగ్ పరంగా కొన్ని సందర్భాల్లో కామెడీ పేలింది.ప్రభు,మంజుల,స్వరూప్ లతో పాటు మిగిలిన వాళ్ళంతా వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. సంగీతం - ఈ చిత్రం ఆడియో ఇప్పటికే పెద్ద హిట్టయ్యింది.ఇప్పుడు దాని గురించి కొత్తగా చెప్పాల్సిందేం లేదు. రీ-రికార్డింగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ - చాలా బాగుంది.పాటల్లో ఇంకా బాగుంది.ఆస్ట్రేలియా అందాలు ఈ చిత్రంలో బాగానే చూపించారు. మాటలు - బాగున్నాయి.కానీ కాన్సెప్ట్ లోపం వల్ల మాటలు బాగున్నా వాటి ప్రభావం సినిమాపై అంతగా కనిపించదు. పాటలు - ముందే చెప్పినట్టు ఇప్పటికే హిట్టయ్యాయి కదా.సాహిత్యం నచ్చకపోతే అవి ఎలా హిట్టవుతాయి. ఎడిటింగ్ - బాగుంది. ఆర్ట్ - బాగుంది. కొరియోగ్రఫీ - ఈ చిత్రంలోని అన్ని పాటల్లో కొరియోగ్రఫీ గొప్పగా లేకున్నా చూడ తగినట్టుగానే ఉంది. యాక్షన్ - ఫరవాలేదు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
రామ్ చరణ్ కోసం,ప్రేమలో ఒక విభిన్నమైన కోణాన్ని చూడాలనుకుంటే ఈ చిత్రం ఓ సారి చూడవచ్చు.