English | Telugu
బ్యానర్:సోనీ పిక్చర్స్
Rating:2.50
విడుదలయిన తేది:Mar 1, 2024
సినిమా పేరు:ఆపరేషన్ వాలెంటైన్
తారాగణం: వరుణ్ తేజ్,మానుషి చిల్లర్,నవదీప్,రుహానీ శర్మ తదితరులు
రచన, దర్శకత్వం :శక్తి ప్రతాప్ సింగ్
కెమెరా:హరి కే వేదాంతం
సంగీతం: మిక్కీ జె మేయర్
మాటలు : సాయి మాధవ్ బుర్ర
నిర్మాతలు: సందీప్ ముద్దా
బ్యానర్: సోనీ పిక్చర్స్ ,
విడుదల తేదీ: మార్చి 1 2024
ప్రయోగాల హీరోగా ప్రేక్షకులలో ముద్ర పడిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ రోజు ఆపరేషన్ వాలెంటైన్ అంటు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గత కొంత కాలంగా ఆయనకీ సరైన హిట్ లేదు. వరుసగా గని, గాండీవదారి అర్జున్ లు డిజాస్టర్స్ గా నిలిచాయి. మరి ఇప్పుడొచ్చిన ఆపరేషన్ వాలెంటైన్ ఎలా ఉందో చూద్దాం.
కథ
అర్జున్ దేవ్ (వరుణ్ తేజ్) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వింగ్ కమాండర్ గా చేస్తుంటాడు. దేశభక్తి మెండుగా ఉండటంతో పాటు ఆవేశాన్ని కూడా కలిగి ఉంటాడు. తన వైఫ్ ఆహ్నా గిల్ (మానుషి చిల్లర్) కూడా అర్జున్ తో పాటే ఎయిర్ ఫోర్స్ లోనే ఒక కీలకమైన పోస్ట్ లో వర్క్ చేస్తుంటుంది. శత్రువులని ఎదుర్కోవడానికి ఆవేశం పనికి రాదని ఎప్పటికపుడు అర్జున్ కి సజిషన్ ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే వజ్ర అనే ఒక మిషన్ ని అర్జున్ వాడకుండా అడ్డుపడుతుంటుంది. ఒకసారి పాకిస్థాన్ తీవ్రవాదులు ఆ దేశ ఆర్మీ సహకారంతో ఇండియన్ ఆర్మీకి చెందిన సైనిక స్థావరం మీద మానవ బాంబు దాడి జరుపుతారు. దీంతో చాలా మంది సైనికులు చనిపోతారు. ప్రతీకారకంగా అర్జున్ నేతృత్వంలో పాకిస్తాన్‌లో సర్జికల్ స్ట్రైక్ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇండియాలో ఉన్న ఒక కీలకమైన వ్యక్తిని చంపడానికి పాకిస్థాన్ ఆర్మీ ప్లాన్ చేస్తుందని తెలుస్తుంది. పాకిస్థాన్ చంపాలనుకుంటున్న ఆ కీలక వ్యక్తి ఎవరు? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆ విషయాన్ని ఎలా కనిపెట్టింది? సర్జికల్స్ స్ట్రైక్ తర్వాత పాకిస్థాన్ అసలు ఏం చేసింది? తమ మూలంగా దేశానికి రాబోతున్న ప్రాబ్లంని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలా ఆపగలిగింది? అసలు వజ్ర మిషన్ ఏంటి ? వజ్ర మిషన్ కి ఇప్పుడున్న ప్రాబ్లం కి ఏమైనా సంబంధం ఉందా? అలాగే ఆపరేషన్ వాలెంటైన్ అంటే ఏంటి ? తదితర ప్రశ్నల సమూహారమే ఈ చిత్ర కథ.
ఎనాలసిస్ :
పాకిస్థాన్ లోకి ప్రవేశించి సర్జికల్ స్ట్రైక్ తో మనమంటే ఏంటో నిరూపించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సెల్యూట్ చేస్తున్నాం. అలాగే పుల్వామా దాడిలో మరణించిన మన వీర సైనికులకి జోహార్లు అర్పిస్తున్నాం. ఈ చిత్ర కథ ప్రతి ఒక్క భారతీయుడికి తెలిసిన కథే. అలాంటప్పుడు దర్శకుడు చాలా నింపాదిగా కథని చెప్పవచ్చు.కానీ విచిత్రంగా సినిమా స్టార్ట్ అయిన అరగంటకి కూడా ప్రేక్షకుడికి కథ అర్ధం కాదు.అందుకు కారణం దర్శకుడు రివర్స్ స్క్రీన్ ప్లే లో డోస్ పెంచడమే. పుల్వామాలో పాకిస్థాన్ జరిపిన దాడిలో మన సైనికులు చనిపోయిన సంఘటన దేశం మొత్తాన్ని ఒక కుదుపు కుదిపేసింది. అంతటి ఎమోషన్ ఉన్న పాయింట్‌ని కథా వస్తువుగా ఎంచుకున్నప్పుడు అది జనాలకు ఎంతగానో కనెక్ట్ కావాలి. అలాగే చూసేవాళ్ళకి ఎమోషనల్‌గా అనిపించాలి. అది ఈ మూవీలో మిస్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ చూసిన ప్రేక్షకులు ఇదేంటి ఇలా తీశారు అని షాక్ అవుతారు. ఇక సెకండ్ ఆఫ్ లో అయిన మెరుపులు ఉంటాయని అనుకుంటే అలాంటివేమీ ఉండవు. పాకిస్థాన్ మీద దాడి తప్పితే ఏమి లేదు. ఆ దాడి కూడా ఎవరకి అర్ధం కాదు. నేల మీద నాలుగు డైలాగ్ లు మాట్లాడుకోవడం ఆకాశంలో విమానంలో కూర్చుని దాడులు చేసుకోవడం తప్ప ఏమి లేదు. అందుకే అంటారు ఎంత పెద్ద సినిమా అయినా స్క్రీన్ ప్లే లేక పోతే ఎవరు కాపాడలేరని. అలాగే దేశభక్తి సినిమాలో జనరల్ గా డైలాగ్స్ ఒక రేంజ్ లో ఉండి ఉత్తేజాన్ని ఇస్తాయి. అలాంటిది ఒక్క డైలాగ్ కూడా అర్ధం కాదు. కేవలం నటీనటుల వల్లే ప్రేక్షకుడు థియేటర్ లో చివరిదాకా ఉంటాడు .
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు
ఇక నటీనటుల విషయానికి వస్తే వరుణ్ ఆ పాత్రకి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. నటన విషయంలో ఆయన నుంచి ఎలాంటి రిమార్క్ లేదు.చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ లో కూడా అధ్బుతంగా చేసాడు. కాకపోతే సినిమా మొత్తం ఒకే టైప్ ఆఫ్ యాక్టింగ్ చేసినట్టుగా ఉంది.ఇక హీరోయిన్ మానుషీ చిల్లర్ విషయానికి వస్తే రాడార్ సజిషన్స్ ఇచ్చే ఆఫీసర్ గా, వరుణ్ వైఫ్ గా సూపర్ గా చేసింది. అలాగే ఎయిర్ ఫోర్స్ చీఫ్ గా చేసిన శతఫ్ ఫిగర్ తో పాటు మిగతా పాత్రల్లో కనిపించిన రుహళీ శర్మ, సంపత్ లు కూడా చాలా బాగా చేసారు. నవదీప్ ప్రత్యేకంగా చెయ్యడానికి ఏమి లేదు. ఇక దర్శకుడు గురించి ఎక్కువగా చెప్పుకోవాల్సిన పని లేదు. వచ్చిన క్రెడిట్ కాస్తా సిజి వర్క్ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇక డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా మెరువులు కూడా ఏమి లేవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సో సో గానే ఉంది. ఫొటోగ్రఫీ అండ్ నిర్మాణ విలువలు మాత్రం చాలా బాగున్నాయి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఈ సినిమా దర్శకుడు అందులో నటించిన నటులతో పాటు ప్రేక్షకులని కూడా మోసం చేసాడు. కాకపోతే దైవ భక్తి సినిమా అయినా దేశ భక్తి సినిమా అయినా కథ కథనాలు ఉండాలనే నిజాన్ని మరో సారి చాటి చెప్పాడు. ప్రేక్షకుడిని మోసం చెయ్యని నటుల సినిమా ఈ ఆపరేషన్ వాలెంటైన్.