Read more!

English | Telugu

సినిమా పేరు:ఓం శాంతి
బ్యానర్:త్రీ ఎంజెల్స్ మూవీస్
Rating:2.25
విడుదలయిన తేది:Jan 13, 2010
హైదరాబాద్ పట్టణంలో నాలుగుచోట్ల బాంబ్ బ్లాస్ట్ లు చేయడానికి ఓ ఉగ్రవాద సంస్థ ప్రయత్నాలు చేస్తుంది. దానికోసం నూరి(బిందుమాధవి) అన్నయ్య భాషాతో ఆ బాంబులను తయారుచేయిస్తారు. అనుకున్నట్టుగానే హైదరాబాద్ నగరంలో నాలుగు చోట్ల ఫిక్స్ చేస్తారు. ఈ బాంబుల ఉనికిని కనుగొనడంకోసం మహమ్మద్ ఖాన్ అనే పోలీసాఫీసర్ తీవ్రంగా ప్రయత్నిస్తుంటాడు. ఇలా ఉండగా, నర్సిరెడ్డి(మురళీమోహన్) ఓ పల్లెటూర్లో పది ఎకరాల పొలం కలిగిన ఓ రైతు. ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ మాటవిన్న అతని కొడుకు పొలం అమ్మేయాలని బలవంతం చేయడంతో నర్సిరెడ్డి ఆత్మహత్య చేసుకుంటాడు. అయినా కనికరించని అతని కొడుకు ఆ పొలం అమ్మేసి హైదరాబాద్ బయలుదేరతాడు. ఆనంద్(నవదీప్) ఓ సాఫ్ట్ వర్ ఇంజనీర్. పెళ్ళిచేసుకుని జీవితంలో సెటిలవ్వాలనుకునే యువకుడు. అతను అంజలి(అదితీ శర్మ)ని ప్రేమిస్తాడు. మేఘన(కాజల్ అగర్వాల్) కాలేజీ స్టూడెంట్. ఆమెకి రొటీన్ లైఫ్ అంటే చిరాకు. థ్రిల్ కోసం ఎంతకైనా తెగించే క్యారెక్టర్. రేడియోలో ఒక ప్రోగ్రామ్ కి ఆర్.జె గా పనిచేస్తున్న మ్యాడీ (మాధవన్) అంటే మేఘనకి చాలా ఇష్టం. రవితేజ (నిఖిల్) హీరో కావాలనే లక్ష్యంతో ఫిలిమ్ నగర్ చేరుకున్న యువకుడు. రవితేజ అంతటి హీరో కావాలన్నది అతని లక్ష్యం. వీరందరి జీవితాలకి ఉగ్రవాదులు పెట్టిన బాంబ్ లకి లింక్ ఏమిటన్నదే మిగిలిన కథ
ఎనాలసిస్ :
నేడు సమాజంలో ఉగ్రవాదుల దుశ్చర్యలకు సామాన్య మనుషుల జీవితాలు ఎలా బలైపోతున్నాయో చాటిచెప్పిన చిత్రం. నిర్మాత తలసాని అశ్వనీదత్ కూతురు ప్రియాంక దత్ ఒక చక్కని సబ్జెక్ట్ తో ఫీల్ గుడ్ సినిమాను ప్ేక్షకులకు అందించారు. అయితే, కథాకథనంలో మరికొంత శ్రద్ధ తీసుకుని ఉంటే బావుండేది. హైదరాబాద్ లో ఉగ్రవాదులు నాలుగు చోట్ల బాంబులు పెట్టారని చూపిస్తారు. కానీ, చివరికి క్లైమాక్స్ లో ఒకే చోట ఉన్న బాంబు పైనే దర్శకుడు దృష్టి సారించాడు. మరి మిగిలిన మూడు బాంబుల గురించి సినిమాలో చూపించకపోవడం మైనస్ పాయింట్.హీరో మాధవన్ ఈ చిత్రంలో రేడీయో జాకీ గా కనిపించి, అందరినీ ఆశ్చర్యపరిచాడు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన-: మాధవన్ గురించి చెప్పాల్సిందేమీ లేదు. నవదీప్ ఉన్న క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. కాజల్ అగర్వాల్ చాలా క్యూట్ గా ఉంది. నిఖిల్ రవితేజా అంత హీరో కావాలనే యువకుడు క్యారెక్టర్ లో చాలా చక్కగా నటించాడు. మిగిలిన నటీనటులంతా తమ పాత్రలకి తగ్గట్టుగా నటించారు. సంగీతం-: మాస్ట్రో ఇళయరాజా అందించిన సంగీతంలో రెండు పాటలు బాగున్నాయి.