English | Telugu
బ్యానర్:యునైటెడ్ ఫిల్మ్స్
Rating:2.00
విడుదలయిన తేది:May 3, 2019
నటీనటులుః సుధాకర్ కొమాకుల, నిత్యశెట్టి, నిరోషా తదితరులు
సాంకేతిక నిపుణులుః
దర్శకత్వంః డి.హరినాథ్
నిర్మాతః శ్రీకాంత్ డి
సినిమాటోగ్రాఫర్ః వెంకట్ దిలీప్
ఎడిటింగ్ః ఉద్దవ్
విడుదలయిన తేది : May 03, 2019
`లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్` చిత్రంతో హీరోగా పరిశ్రమకు పరిచయమైన హీరో సుధాకర్ కొమాకుల. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ అవేమీ పెద్దగా ఆడలేదు. తాజాగా `నువ్వు తోపురా` అనే చిత్రంలో నటించాడు. హరనాథ్ అనే నూతన దర్శకుడు తో శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రం పాటలు, ట్రైలర్స్ తో ఆకట్టుకుంది. మరి ఈ రోజు విడుదలైన సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం...
స్టోరిః
హైదరాబాద్ లోని సరూర్ నగర్ కు చెందిన సూరి (సుధాకర్) అనే కుర్రాడు బీటెక్ మిడిల్ లో ఆపేసి పని పాట లేకుండా తిరుగుతుంటాడు. ఇలాంటి తరుణంలో రమ్య (నిత్యశెట్టి) తో లవ్ లో పడతాడు. కానీ సూరి పోరంబోకులా తిరగడం నచ్చని రమ్య అతనితో బ్రేకప్ చేసుకుని అమెరికా వెళ్లిపోతుంది.
ఎనాలసిస్ :
ఇక ఆ పెయిన్ లో ఉన్న సూరికి అమెరికా వెళ్లే ఆఫర్ వస్తుంది. అక్కడికి వెళ్లాక అమ్మ ఆరోగ్యం బాగాలేదని తెలుసుకున్న సూరి అక్కడే డబ్బు సంపాదించి పంపాలనుకుంటాడు. డబ్బు ఎలా సంపాదించాడు? నువ్వు తోపురా అని ఎలా అనిపించుకున్నాడు అన్నది సినిమా.
సినిమాకు ప్లస్ః
సూరి క్యారక్టర్
నిరోషా
నేపథ్య సంగీతం
సినిమాటోగ్రఫీ
సినిమాకు మైనస్ః
స్లో నేరేషన్
కథలో కొత్తదనం లేకపోవడం
బలహీన మైన సన్నివేశాలు
గాడీ తప్పిన సెకండాఫ్
క్లైమాక్స్ వీక్
విశ్లేషణః
సూరి పాత్రలో హీరో సుధాకర్ ఒదిగిపోయాడు. గల్లీ కుర్రాడుగా, తెలంగాణ స్లాంగ్ లో అద్భుతంగా మాట్లాడుతూ తన పాత్రకు న్యాయం చేస్తూ సినిమాను తన భుజాలపై మోసాడు అనడంలో సందేహం లేదు. ఇక హీరో వరుణ్ సందేశ్ లాంగ్ గ్యాప్ తర్వాత హీరో ఫ్రెండ్ గా నటించాడు. మరి తన పాత్ర పెద్దగా ఏమీలేదు. ఇక హీరో తల్లి పాత్రలో నిరోషా ఈ సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తూ మెప్పించింది. హీరోయిన్ గా నిత్యాశెట్టి ఓకే అనిపించుకుంది. ఇర సినిమాకు మెయిన్ మైనస్ అంటే సరైన స్టోరి లే కపోవడమే. కానీ ఫస్టాప్ లో అక్కడక్కడా నవ్విస్తూ కొంచెం ఆసక్తికరంగా తీసుకెళ్లిన దర్శకుడు పోనూ పోనూ సినిమాను నీరసమైన కథనంతో నీరుగార్చాడు. ఇక క్లైమాక్స్ కూడా ఇంట్రస్టింగ్ గా అనిపించదు. దర్శకుడు కథా, కథనాలపై ఇంకా స్త దృష్టి పెడితే బాగుండేది. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు కూడా బావున్నాయి. 75 పర్సెంట్ సినిమాను యుఎస్ లోనే తీయడం విశేషం.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
రెగ్యులర్ స్టోరి తో వచ్చిన సినిమా నువ్వుతోపురా. కథ , కథనాల్లో కొత్తదనం లేకపోయినా, హీరో సుధాకర్ సూరిగా తనదైన శైలిలో మెప్పించాడు. చక్కటి సినిమాటోగ్రఫీ, సంగీతం కుదిరాయి. అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేసారు. సమ్మర్ లో మరి ఏం తోచకపోతే ఈ సినిమాకు వెళ్లి కాసేపు అమెరికా అందాలు చూస్తూ గడిపిరావచ్చు. అంతే కానీ వాడు తోపని మాత్రం వెళ్లకండి.