Read more!

English | Telugu

సినిమా పేరు:నిప్పు
బ్యానర్:బొమ్మరిల్లు
Rating:2.50
విడుదలయిన తేది:Feb 17, 2012

కథ - రియాద్ లో పనిచేస్తున్న శ్రీ (శ్రీరామ్), సూర్య (రవితేజ) మంచి స్నేహితులు. శ్రీ తండ్రి, తల్లి, చెల్లెలు, బాబాయ్, పిన్ని (రాజేంద్రప్రసాద్, ప్రగతి, దీక్షా సేథ్, బ్రహ్మానందం, సురేఖావాణి) కుటుంబానికి అండగా ఉంటాడు సూర్య. హైదరాబాద్ లో ఉన్న ఒక రియల్ ఎస్టేట్ కంపెనీని బెదిరించిన రౌడీలకు బుద్ధి చెపుతాడు సూర్య. ఆ రౌడీలంతా గౌడ్ (ప్రదీప్ రావత్) మనుషులు. రియాద్ లో ఉన్న వైష్ణవి అనే అమ్మాయిని శ్రీ ప్రేమిస్తాడు. అనుకోకుండా ప్రమాదవశాత్తూ ఆమె 20 వ అంతస్తులోనుండి కిందపడుతుంది. ఆమె చావుకి శ్రీ కారణమంటూ పోలీసులు శ్రీని అరెస్ట్ చేస్తారు. శ్రీని చూట్టానికి రియాద్ వచ్చిన సూర్య విషయం తెలుసుకుని తన స్నేహితుణ్ణి కాపాడతానని మాటిస్తాడు. సూర్య తన మాట నిలబెట్టుకున్నాడా...? కఠినమైన రియాద్ చట్టాల నుండి తన మిత్రుణ్ణి కాపాడుకోగలడా...? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ (నిప్పు) సినిమా చూడండి.

 


ఎనాలసిస్ :

విశ్లేషణ - గుణశేఖర్ తనలో ఉన్న క్రియెటివిటి కన్నా కమర్షియల్ ఫార్ములానే ఈ సినిమాలో ఎక్కువగా నమ్మినట్టున్నాడు. అందుకు తగ్గట్టే ఈ సినిమా కథను, కథనాన్ని వ్రాసినట్టున్నాడు. ఒక కమర్షియల్ ఫార్ములా ప్రకారం ఈ సినిమా తీసినట్టు మనకు అర్థమవుతుంది. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే బాగుంది. గుణశేఖర్ టేకింగ్ బాగుంది. బొమ్మరిల్లు బ్యానర్ నిర్మాణపు విలువలు బాగున్నాయి.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

నటన - మాస్ మహరాజా రవితేజ నటన గురించి ఈ రోజు కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. అతని ఎనర్జీ లెవల్స్ అందరికీ తెలిసినవే. ఈ చిత్రంలో కూడా రవితేజ నటన ఆ విధంగానే ఉంది. ఎక్కడా తగ్గలేదు. పాటల్లో, యాక్షన్ సీన్లలో రవితేజ అదే స్పీడ్ కొనసాగించాడు. ఇక దీక్షా సేథ్ ఈ సినిమాలో మాత్రం బాగానే నటించింది. ఆమె నటించిన గత చిత్రాల కంటే ఈ చిత్రంలో మెరుగైన నటన కనబరిచింది. రాజేంద్రప్రసాద్, ప్రగతి, బ్రహ్మానందం, ప్రదీప్ రావత్, ముకుల్ దేవ్ వంటి మిగిలిన వారంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సంగీతం - ఈ చిత్రం ఆడియోని ఇప్పటికే ప్రేక్షకులు బాగా ఆదరించారు. పాటలన్నీ బాగున్నాయి .అందుకు తగ్గట్టే స్క్రీన్ మీద చూసినప్పుడు పాటలన్నీ ఇంకా బాగున్నాయి. రీ-రికార్డింగ్ బాగుంది.

సినిమాటోగ్రఫీ - సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. యాక్షన్ సీన్లలో సినిమాటోగ్రఫీ అదిరింది. క్లైమాక్స్ ఫైట్ లో అయితే ఇంకా బాగుంది. అలాగే పాటల్లో కూడా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.

మాటలు - "నువ్వు పబ్లిసిటీ కోసం కొడతావు. నేను కొడితే పబ్లిసిటీ", "నాకు ఆయుధాలు అవసరం లేదురా...నేనే ఒక ఆయుధం" "ఈ సిటీలో నాకెవడి మీద కోపం వచ్చినా నిన్నే కొడతా"వంటి డైలాగులు మాస్ ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. ఈ సినిమాలోని డైలాగులు బాగున్నాయి.

పాటలు - ఈ సినిమా పాటల్లోని సాహిత్యం బాగుంది. ఎందుకంటే ఒక్కో పాట ఒక్కో రాచయిత వ్రాయటం వల్లనో ఏమో పాటలన్నీ సాహిత్యపరంగా పోటీపడ్డాయి.

ఎడిటింగ్ - గౌతంరాజు ఎడిటింగ్ చాలా బాగుంది. ఆర్ట్ - ఆనందసాయి కళాదర్శకత్వం చూడ ముచ్చటగా ఉంది.

కొరియోగ్రఫీ - ఫర్లేదు...బాగానే ఉంది. రవితేజ స్టైల్ టిపికల్ మూవ్ మెంట్స్ ఈ చిత్రంలోని పాటల్లో ఉన్నాయి.

యాక్షన్ - ఈ డిపార్ట్ మెంట్ మాత్రం పంబరేగ్గొట్టాడు కణల్ కణ్ణన్. ఈ సినిమాలోని యాక్షన్ సీన్లన్నీ సూపర్ గా ఉన్నాయి.


ఇది రవితేజ స్టైల్ ఆఫ్ మూవీ. సో రవితేజ సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ ఎంత ఉండాలో అంతా ఈ సినిమాలో ఉంది. అలాగే చక్కని సెంటిమేంటు కూడా ఈ సినిమాలో ఉంది. సరదాగా ఓ రెండుగంటల పాటు సకుటుంబంగా ఈ సినిమా చూడవచ్చు.