English | Telugu

సినిమా పేరు:నింగీ..నేలా...నాదే
బ్యానర్:సుజన్ మీడియా వర్క్స్
Rating:---
విడుదలయిన తేది:Jul 3, 2009
బ్యానర్:సుజన్ మీడియా వర్క్స్
Rating:---
విడుదలయిన తేది:Jul 3, 2009
ఇదొక చైనా చిత్రం. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ లో "ఇన్విజబుల్ వింగ్స్" పేరుతో అనువదించగా, ఆ చిత్రాన్ని తెలుగులో "నింగీ..నేలా..నాదే"గా అనువదించారు. ఈ చిత్రంలోని కథ విషయానికొస్తే జిహ్వ అనే అమ్మాయి చాలా చక్కని పిల్ల. ఆమె తల్లిదండ్రులు పేదవారైనా ఆమెను ఎంతగానో ప్రేమిస్తుంటారు. జిహ్వ స్కూల్ చదువయిపోగానే కాలేజీకి వెళ్ళాల్సిన సమయంలో కరెంట్ షాక్ తగలటం వల్ల డాక్టర్లు ఆమె రెండు చేతులూ తీసివేస్తారు. ఆ తర్వాత జిహ్వ చదువుకోటానికే కాకుండా తన పనులు తాను చేసుకోటానికి కూడా చాలా ఇబ్బందులు పడుతుంటుంది.ఆ డిప్రెషన్‌లో జిహ్వ ఆత్మహత్యకు కూడా ప్రయత్నిస్తుంది.కానీ ఆమె తండ్రి ఆమెను కాపాడి ప్రోత్సాహించటం వల్ల ఆత్మస్థైర్యంతో తన అంగవైకల్యాన్ని అధిగమించటానికి ప్రయత్నిస్తుంటుంది. తనకు చేతుల్లేని కారణంగా తన పనులన్నీ కాళ్ళతోనే చేయటానికి ప్రయత్నిస్తూ, ఆ ప్రయత్నంలో విజయం సాధిస్తుంది. భోజనం చేయటం, ముఖం కడుక్కోవటం, చిరిగిన బట్టలు సూదితో కుట్టటం, అందుకు సూదిలోకి దారం ఎక్కించటం, వంటచేయటం, సైకిల్ తొక్కటం వంటి అనేక పనులను జిహ్వ తన కాళ్ళతోనే చేస్తుంది. చివరికి కాళ్ళతో వ్రాయటం ప్రాక్టీస్ చేసి, కాలేజీలో సీటు సంపాదిస్తుంది. కష్టపడి చదువుతుంటూంది.ఆమెకు యూనివర్సిటీలో సీటు సంపాదించాలని కోరిక. దానికామె కృషిలో లోపం లేకుండా కష్టపడుతుంది. కానీ సీటు రాదు. కారణం ఏమిటంటే రెండు చేతులు లేని జిహ్వ దాక్టర్ కోర్సుకి అప్లై చేయటం వల్లే ఆమెకు సీటు రాదు. ఈ విషయం తెలిసిన జిహ్వ స్పోర్ట్స్ కోటాలో సీటు సంపాదించటానికి ఈత పోటీలకు వెళ్ళాని కోచింగ్ తీసుకుంటుంది. కానీ ఆమె తల్లి చనిపోతుంది. అయినా ఎంతో పట్టుదలతో ఈత పోటీలకు వెళ్ళి ప్రథమ స్థానం సంపాదించి చివరికి మెడిసన్‌లో సీటు సంపాదిస్తుంది. క్లుప్తంగా ఇదీ కథ.