Read more!

English | Telugu

సినిమా పేరు:నేను మీకు తెలుసా
బ్యానర్: శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్
Rating:2.50
విడుదలయిన తేది:Oct 10, 2008
ఒక వ్యక్తి హీరో (మనోజ్‌కుమార్‌)కి నిద్రపోగానే గతాన్ని మర్చిపోయే జబ్బు వుంటుంది. అది తెలిసి ప్రతి రోజూ అతను నిద్ర లేవగానే టేప్‌రికార్డర్‌ ఆన్‌ చేయమని ఆ గదిలో అతనికి కనపడేటట్టు వ్రాసి ఉంటుంది. ఆ టేప్‌రికార్డర్‌లో అతని దినచర్చ ఆ వ్యక్తి గొంతులోనే రికార్డ్‌ చేసి వుంటుంది. ఇలా ఉండగా అతని ఆఫీస్‌లో ఉండే ఆ కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ మధుమతి (రియాసేన్‌) అతనితో చాలా క్లోజ్‌గా మూవ్‌ అవుతుంటుంది. అతను ఆమెతో బయటకి వెళ్ళిన ప్రతిసారీ కొందరు దుండగులు అతనిపైన దాడి చేస్తూ ఉంటారు. ఒక కార్పొరేటర్‌ తమ్ముడు ఒక కానిస్టేబుల్‌ కూతురు మీద మోజుపడి ఆమెను బలవంతంగా పెళ్ళిచేసుకోవటానికి ఆమెను రేప్‌ చేయబోయి, పోలీస్‌ స్టేషన్లో హీరో కేసు పెట్టటం వల్ల అతని వెంట గూండాలను పంపి ఆ కేసు ఎత్తేయమని చెపుతుంటాడు. కానీ నిన్న జరిగిందంతా నిద్రపోగానే మరచిపోయే జబ్బు ఉండటం వల్ల హీరోకి ఇవేవీ గుర్తుండవు. ఇలా ఉండగా అతని కంపెనీ యమ్‌.డి.ని హీరో చంపాడని అభియోగం మోపబడుతుంది. కానీ కోర్టులో అతను తనకేమీ గుర్తులేదని చెప్పటంతో, అతన్ని గవర్నమెంట్‌ డాక్టర్‌తో పరీక్షచేయించి, ట్రీట్‌మెంట్‌ ఇప్పిస్తారు. ఈ కేసుని అంజలి (స్నేహ ఉల్లాల్‌) అనే ఐ.పి.యస్‌. ఆఫీసర్‌ డీల్‌ చేస్తుంది. ఒక సందర్భంలో అంజలి, మధుమతి అతని ముందు రివాల్వర్లు పట్టుకుని నిలబడితే హీరో మధుమతిని కాల్చి చంపుతాడు. ఆ తర్వాతేం జరిగిందనేది మిగగిలిన కథ.
ఎనాలసిస్ :
ఈ చిత్రానికి దర్శకుడు అజయ్‌శాస్త్రి తనని తాను ఏ హాలీవుడ్‌ దర్శకుడితోనే పోల్చుకుంటూ చాలా భ్రమల్లో వుండి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ఒక్క టైలర్‌ తప్ప, మొదటి నుండీ చివరి వరకూ ఏ విధంగానూ ప్రేక్షకులను ఆకట్టుకోదు. మొమెంటో అనే అంగ్ల చిత్రాన్ని దర్శకుడు మురుగు దాసన్‌ "గజని''గా చాలా చక్కగా తీశాడు. అది సూపర్‌హిట్టయ్యింది. అదే కథని ఎలాగో చేద్దామనుకుని, ఎలాగో చేయబోయి, ఇంకెలాగో తయారు చేశాడు ఈ చిత్ర దర్శకుడు. ఈ చిత్రంలో "సూపర్‌" కామెడీని పేరడీ చేశాడు. క్రియేటివిటీ ఉన్నవాడికి అలా కాపీ కొట్టే ఖర్మేందుకో అర్థం కాదు. ఈ చిత్రం ఫ్లాపయితే దానికి పూర్తి బాధ్యత ఈ చిత్ర దర్శకుడిదేననటంలో సందేహం అక్కర్లేదు..నటన:- మనోజ్‌కుమార్‌ ఈ చిత్రం కోసం ఎంత కష్టపడ్డాడో అతని శరీరం చూస్తేనే అర్థమవుతుంది. జిమ్‌కెళ్ళి బాడీకి ఒక చక్కని షేప్‌నిచ్చాడు. అలాగే ఈ చిత్రంలో అతని నటనలో కూడా చక్కని మెచ్చూరిటీ కనిపించింది. తన తండ్రి డైలాగ్‌ని అదే మాడ్యులేషన్‌తో అలాగే చెప్పగలగటం చూస్తే మనోజ్‌ భవిష్యత్తులో తనేంటో కచ్చితంగా నిరూపించుకుంటాడు. కానీ ఈ చిత్రంలో అతని శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరయ్యింది. ఇక స్నేహ ఉల్లాల్‌, రియాసేన్‌, నాజర్‌ ఉన్నంతలో చక్కగా నటించారు. సునీల్‌, బ్రహ్మానందం, ఆలీల కామెడీ పెద్దగా పండలేదు.సంగీతం:- అచ్చు సంగీతం చచ్చుగా వుంది. శబ్దకాలుష్యంలా మన చెవుల తుప్పు వదలగొడుతుంది. రీ-రికార్డింగ్‌ భయంకరంగా వుంది.సినిమాటోగ్రఫీ :- లైటింగ్‌ సెన్స్‌ బాగున్నా, పాటల్లో, ఫైట్స్‌లో జిగ్‌ జాగ్‌ షాట్స్‌ వల్ల మన కళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని కొన్ని షాట్లు బాగున్నాయి. ఎడిటింగ్‌:- పూర్‌ ఎడిటింగ్‌. నాట్‌ అప్‌ టు ద మార్క్‌.మాటలు:- చాలా పేలవంగా ఉన్నాయి. ఒక్క డైలాగ్‌ కూడా ఆకట్టుకునే విధంగా లేదు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఈ కథను మనోజ్‌కి ఏం చెప్పి వొప్పించాడో ఈ చిత్ర దర్శకుడు తెలీదు కానీ, ఇది చూడతగ్గ చిత్రమేం కాదు.