Read more!

English | Telugu

సినిమా పేరు:నేనే అంబానీ
బ్యానర్:యస్.వి.ఆర్ .మీడియా
Rating:---
విడుదలయిన తేది:Dec 17, 2010
కథ - భాస్కరన్ కు "బాస్" అని పిలిపించుకోవటం బాగా ఇష్టం.అలాగే జీవితాన్ని ఎంజాయ్ చేయాలనేది అతని కోరిక.ఆ కారణంగా ఏ విషయాలూ పట్టించుకోకుండాహాయిగా తిరుతూంటాడు.డిగ్రీ పొందటానికి నానా పాట్లూ పడుతుంటాడు భాస్కరన్.సప్లిమెంటరీలు రాసుకుంటూ, తన అన్న శంకరం (సుబ్బు)తో పాటు ఉంటాడు భాస్కర్.సుబ్బు వెటర్నరీ డాక్టర్.భాస్కర్ కి ఓ సోదరి, విధవరాలైన తల్లీ కూడా ఉంటారు.అల్లరి చిల్లరగా తిరిగే భాస్కర్ లెక్చరర్ చంద్రిక (నయనతార)తో ప్రేమలో పడతాడు.చంద్రిక కూడా అతన్ని పెళ్ళి చేసుకోటానికి ఇష్టపడుతుంది.భాస్కర్ అన్న శంకరం కు నందినితో పెళ్ళి కుదురుతుంది.భాస్కర్ ప్రియురాలు చంద్రిక సాక్షాత్తూ నందినికి చెల్లెలే. తన వదినతో చంద్రికను పెళ్ళిచేసుకోవాలనుకుంటున్నానని చెపుతాడు భాస్కరన్.కానీ అతని నిర్లక్ష్యపు ధోరణి,నిరుద్యోగం కారణంగా ప్రేమలో ఆటంకం ఎదురవుతుంది.దాంతో ఆరు నెలల్లో అంబానీ అయ్యి తీరతానని కుటుంబ సభ్యుల దగ్గర శపథం చేసఇ ఇంటి నుంచి బయటకొస్తాడు భాస్కర్ ఉరఫ్ బాస్.తన బాల్య మిత్రుడు పవర్ టైగర్ (సంతానం)సహాయంతో ఒక ట్యుటోరియల్ కాలేజ్ ఆరమభించి...బాగా లాభాలు గడిస్తాడు.ఆ తర్వాత చంద్రికను పెళ్ళికి ఒప్పిస్ద్తాడు.కానీ ఈ సారి ఆమె తండ్రి ఈ పెళ్ళికి ఒప్పుకోడు.అతను ఎందుకు ఒప్పుకోడు...?బాస్ ఈ సమస్యను ఎలా ఈ సమస్యను పరిష్కరించాడు...?అనే అంశంతో ఈ చిత్రం ముగుస్తుంది.
ఎనాలసిస్ :
ఎలాంటి మలుపులు లేకుండాకథ చాలా సింపుల్‍ గా సాగుతుంది.తమిళంలో ఈ కథ వర్కవుటయ్యుమటుంది.కానీ తెలుగుకి మాత్రం ఇది మన నేటివిటీకి అంతగా నప్పలేదనే చెప్పాలి.డిగ్రీయే పూర్తిచేయలేని హీరో ట్యుటోరియల్ పెట్టి డబ్బు సమపాదించటం హాస్యాస్పదంగా ఉంటుంది.రొమాంటిక్ సన్నివేశాలు, నయనతార అందచందాలు ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్. ఈ చిత్రంలో సంతానం కామెడీ పండలేదు.పవన్ కళ్యాణ్, యన్ టి ఆర్ లబిరుదులను దృష్టిలో ఉంచుకుని అతనికి పవర్ టైగర్ అని పేరు పెట్టి ఉంటారు.ఇతర హీరోల బిరుదులను ఇలా నవ్వుల పాలు చేయటం సబబు కాదనిపిస్తుంది. మాటలు - శశాంక్ వెన్నెలకంటి అందించిన మాటలు చాలా పేలవంగా ఉన్నాయి. కెమెరా - ఈ చిత్రంలో శక్తి అశరవణన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం - యువన్ శంకర్ రాజా సంగీతమందించిన పాటల్లో రెండు మాత్రం బాగున్నాయి. వాసన్ విజువల్స్ నిర్మాణపు విలువలు బాగున్నాయి. నటన - బాస్ గా ఆర్య నటన బాగుంది.చాలా స్టైలిష్ గా, ఈజ్‍ తో ఆర్య నటించాడు.ఇక నయనతార తన అందాలతో కనువిందు చేసింది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఈ చిత్రం తెలుగు ప్రజలకు డైజెస్ట్ కాదు.పనీ పాటా లేని వారి టైం పాస్ కి పనికొచ్చే సినిమా ఇది.