English | Telugu

సినిమా పేరు:మజ్ను
బ్యానర్:ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌
Rating:2.25
విడుదలయిన తేది:Sep 23, 2016

 

వ‌రుస విజ‌యాల‌తో సూప‌ర్ ఫామ్ లో ఉన్నాడు నాని. హిట్లు కొట్ట‌డం వేరు - ప్రేక్ష‌కుల న‌మ్మాకాన్ని నిల‌బెట్టుకోవడం వేరు. ఆ విష‌యంలోనూ నానికి ఫుల్లుగా మార్కులు ప‌డ‌తాయి. నాని మంచి క‌థ‌లే ఎంచుకొంటాడ‌న్న‌ది ప్రేక్ష‌కుల న‌మ్మ‌కం. నాని సినిమాకెళ్తే పైసా వ‌సూల్ అనే భ‌రోసా. దాన్ని సినిమా సినిమాకీ పెంచుకొంటూ వెళ్తున్నాడు కూడా. నాని నుంచి వ‌చ్చిన మ‌జ్ను కూడా అంద‌రి దృష్టినీ ఆక‌ట్టుకొంది. దానికి కార‌ణం .. ఈ చిత్రానికి విరించి వ‌ర్మ ద‌ర్శ‌కుడు. ఉయ్యాల జంపాల‌తో క్లాస్ ట‌చ్ ఉన్న ఓ క‌థ‌ని మాసీగా చూపించి ఆక‌ట్టుకొన్నాడు. నాని - విరించి వ‌ర్మ‌లు క‌లిస్తే ఇంకెంత బాగుంటుందో అనిపించింది. అందుకే మ‌జ్నుపై అంచ‌నాల భారం ఎక్కువైంది. మ‌రి ఈ మ‌జ్ను ఎలా ఉన్నాడు?  త‌న గోల్ సాధించాడా లేదా?  నాని న‌మ్మ‌కం నిజ‌మైందా, లేదా?  తెలుసుకొందాం రండి.  

* క‌థ‌

భీమ‌వ‌రంలో బీటెక్ చేసిన ఆదిత్య (నాని) బెంగ‌ళూరు వెళ్లి అక్క‌డ ఏదో ఓ ఉద్యోగంలో సెటిల్ అవుదామ‌నుకొంటాడు. కానీ అదే ఉర్లో ఉన్న  కిర‌ణ్మ‌యి (అను ఇమ్మానియేల్‌)ని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు. త‌న కోసం కాలేజీలో లెక్చ‌ల‌ర్‌గా మారి పాఠాలు కూడా చేబుతాడు. మెల్ల‌గా కిర‌ణ్ ఆదిత్య‌ని ప్రేమించ‌డం మొద‌లెడుతుంది. ఇంత‌లోనే ఇద్దరి మ‌ధ్యా కొన్ని అభిప్రాయ బేధాలు వ‌స్తాయి. ఆదిత్య‌ని అపార్థం చేసుకొన్న కిర‌ణ్‌.... త‌న‌కు దూరం అవుతుంది. ఆ బాధ భ‌రించ‌లేక ఆదిత్య హైద‌రాబాద్ వ‌చ్చి ఇక్క‌డ ఓ ద‌ర్శ‌కుడు (రాజ‌మౌళి) ద‌గ్గ‌ర స‌హాయ ద‌ర్శ‌కుడిగా మార‌తాడు. ఇక్క‌డ  సుమ (ప్రియ‌శ్రీ ) ప‌రిచ‌యం అవుతుంది. ఆదిత్య ప్రేమ‌క‌థ తెలుసుకొని కూడా ఆదిత్య‌ని ఇష్ట‌ప‌డుతుంది. `నా మ‌న‌సులో ఇంకా ఆ కిర‌ణ్మ‌యినే ఉంది` అని చెప్పేలోగా ఓ షాకింగ్ విష‌యం బ‌య‌ట‌ప‌డుతుంది. అదేంటి?  ఈ ఇద్ద‌రిలో ఆదిత్య ఎవ‌రికి ద‌గ్గ‌ర‌య్యాడు?  అస‌లు భీమ‌వ‌రంలో ఉన్న కిర‌ణ్మ‌యి ఏమైంది? అనేదే చిత్ర క‌థ‌.


ఎనాలసిస్ :

విరించి వ‌ర్మ తొలి సినిమా..  ఉయ్యాల జంపాల‌లో పెద్ద క‌థేం ఉండ‌దు. కానీ దాన్ని న‌డిపిన విధానం, వినోదం మేళ‌వించిన తీరు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చాయి. మజ్నులోనూ అదే న‌మ్ముకొన్నాడు. క‌థ‌గా చూస్తే.. మజ్నులో విష‌యం ఉండ‌దు. కానీ ద‌ర్శ‌కుడి టేకింగ్‌, సంభాష‌ణ‌లు, నాని, క‌థానాయిక‌ల‌తో కెమిస్ట్రీ ఇవ‌న్నీ ఈ సినిమాని న‌డిపించేశాయి. ప్ర‌తీ స‌న్నివేశం రొటీన్ గానే ఉంటుంది. కానీ.. దాన్ని న‌డిపిన తీరు.. విరించి వ‌ర్మ ఛ‌మ‌క్కులతో ఆయా స‌న్నివేశాల్ని బోర్ కొట్టించ‌కుండా తీయ‌గ‌లిగాడు. భీమ‌వ‌రంలో నాని న‌డిపిన ప్రేమ‌క‌థ‌... ఆ ఎపిసోడ్ మొత్తం బాగా ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. నాని - అను  క‌లిపించిన ప్ర‌తీ స‌న్నివేశం పండింది.   సినిమా మొద‌లై గంట గ‌డిచిందో లేదో నాలుగు పాట‌లు వ‌చ్చి ప‌డిపోతాయి. అయితే ఆ పాట‌ల ప్లేస్ మెంట్ క‌రెక్ట్‌గా కుద‌ర‌డం, క‌థ‌లో భాగంగా పాట‌లు రావ‌డం.. ఇవ‌న్నీ కాపాడాయి. ఆదిత్య - కిర‌ణ్‌ల మ‌ధ్య క్లాష్ రావ‌డానికి పెద్దగా కార‌ణాలేం క‌నిపించ‌వు. ఫ‌స్టాఫ్ ఎమోష‌న్ , కొన్ని సెన్సిటీవ్ సీన్స్‌, ఫీల్ గుడ్ స‌న్నివేశాల్ని న‌మ్ముకొని సాగిన ఈ ప్ర‌యాణం.. ద్వితీయార్థంలో వినోదాన్ని న‌మ్ముకొంది. అయితే ఫ‌స్టాఫ్‌లో ఫీల్ గుడ్ సెకండాఫ్‌లో కామెడీ పండింది అంతంత మాత్ర‌మే. నాని కాకుండా మ‌రో హీరో ఉండుంటే గ‌నుక‌.. ఈ సినిమాని భ‌రించ‌డం క‌ష్ట‌మ‌య్యేది. నాని త‌న అనుభ‌వాన్ని, త‌న ఈజ్‌ని రంగ‌రించి.. సినిమాని ఎక్క‌డ‌క‌క్క‌డ కాపాడే ప్ర‌య‌త్నాలు చేశాడు. ద్వితీయార్థం మ‌హా రొటీన్‌గా సాగి ప్రేక్ష‌కుల స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తుంది. కామెడీ వ‌ర్క‌వుట్ అయినా అంతంత మాత్రంగానే. క్లైమాక్స్‌లో మ‌ళ్లీ విరించి ట్రాక్‌లోకి వ‌చ్చాడు. కానీ అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది.


* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

మ‌జ్ను క‌చ్చితంగా నాని వ‌న్ మేన్ షోనే.  త‌న వ‌ల్లే ఈ సినిమాని భ‌రించామేమో అనిపిస్తుంది. త‌న‌ ఈజ్‌, టాలెంట్‌తో సినిమాని కాపాడే ప్ర‌య‌త్నంచేశాడు. త‌న లుక్ కూడా బాగుంది.  ఈ సినిమా నానికి ప్ల‌స్ కాదు గానీ... ఈ సినిమాకే నాని ప్ల‌స్ పాయింట్‌గా మారాడు.  ఈ సినిమాతో ఇద్ద‌రు మంచి హీరోయిన్లు తెలుగు తెర‌కు దొరికారు అనుకోవాల్సిందే. అను, ప్రియా ఇద్ద‌రూ త‌మ పాత్ర ప‌రిధికి లోబ‌డి న‌టించారు. ఇద్ద‌రిలో అనుకే ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. ప్రియాశ్రీ మోడ్ర‌న్ డ్ర‌స్సుల్లోనూ హుందాగా, ప‌ద్ద‌తిగా క‌నిపించింది. డైలాగ్ మాడ్యులేష‌న్ విష‌యం కాస్త శ్ర‌ద్ద తీసుకోవాల‌నిపించింది. ఈ సినిమాలో నాని త‌ర‌వాత అంత‌గా ఎంట‌ర్‌టైన్ చేసింది వెన్నెల కిషోరే. త‌న‌దైన కామెడీ టైమింగ్ తో న‌వ్వించాడు. ఫ‌స్టాఫ్‌లో పోసాని డైలాగులూ బాగానే పేలాయి. రాజ‌మౌళి ఓ స‌న్నివేశంలో క‌నిపిస్తాడు. అత‌ని కేమియో ఆక‌ట్టుకొంటుంది. చివ‌ర్లో క‌నిపించిన రాజ్ త‌రుణ్ కూడా.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

గోపీ సుంద‌ర్ సంగీతం ఈ సినిమాకి ప్ల‌స్ పాయింట్. పాట‌లు ఇప్ప‌టికే న‌చ్చేశాయి. వాటిని క‌థ‌లో లింక‌ప్ చేస్తూ తీర్చిదిద్దిన విధానం కూడా బాగుంది.  ఓయ్ మేఘ‌మాల బాణీ ఆక‌ట్టుకొంటుంది.  నేప‌థ్య సంగీతం కొన్ని చోట్ల శ్రుతిమించిన‌ట్టు అనిపించింది.  సినిమా మొత్తాన్ని క‌ల‌ర్‌ఫుల్‌గా చూపించింది జ్ఞాన‌శేఖ‌ర్ కెమెరా. విజువ‌ల్ బ్యూటీ ఈ సినిమాలో క‌నిపించింది. సాదా సీదా స‌న్నివేశం అయినా చూడ‌గ‌లిగామంటే దానికి కార‌ణం విజువ‌ల్ బ్యూటీ కూడా. సినిమా రిచ్‌గా ఉంది.  ద‌ర్శ‌క‌త్వం ప‌రంగా విచించి.. తొలి సినిమా స్థాయిలో మెప్పించ‌లేదు. బ‌హుశా అత‌నిపై విప‌రీత‌మైన ఒత్తిడి పెరిగిపోయి ఉండొచ్చు.  రొటీన్‌గా కాకుండా ఓ కొత్త క‌థ ట్రై చేసి ఉంటే బాగుండేది. సినిమాలో చాలా చోట్ల లాగ్ ఉంది.  కొన్ని స‌న్నివేశాలు ఎంత‌కీ త‌ర‌గ‌లేదు.  ఓ ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇవ్వాల‌న్న ప్ర‌య‌త్నం ఇది. నాని గ‌త సినిమాల‌తో పోలిస్తే.. ఉయ్యాల జంపాలాతో లెక్క‌లు వేస్తే త‌ప్ప‌కుండా నిరాశ ప‌డ‌తారు.

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25