Read more!

English | Telugu

సినిమా పేరు:నమో వెంకటేశా
బ్యానర్:14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్
Rating:2.75
విడుదలయిన తేది:Jan 14, 2010
వెంకటరమణ(వెంకటేష్) వెంట్రిలాక్విస్ట్, వయస్సు పైబడుతున్నా ఇంకా పెళ్ళికాదు. తన ఊహల్లో వచ్చే సుందరికోసం ఎదురు చూస్తుంటాడు. స్టేజ్ పర్ఫార్మెన్స్ పోగ్రామ్ కండెక్ట్ చేసే అవకాశం రావడంతో వెంకటరమణ అండ్ గ్యాంగ్ ఫ్రాన్స్ వెళతారు. అక్కడ ఫారిన్ ప్రసాద్ (బ్రహ్మానందం) మేనకోడలు పూజ(త్రిష) ప్రేమలో పడతాడు. ఇది తెలుసుకొన్న ఫారిన్ ప్రసాద్ పూజతో కలిసి వెంకటరమణని ఫూల్ చేయడానికి తాను కూడా ప్రేమిస్తున్నానని చెప్పమంటాడు. పూజ అలాగే చేస్తుంది. ఇవేమీ తెలియని వెంకటరమణ పూజని సిన్సియర్ గా ప్రేమిస్తుంటాడు. ఇలా ఉండగా రాయలసీమలో ఉండే పూజ పెద్దమామ ఫ్యాక్షనిస్టు ఆయన బెంగాల్ రెడ్డి (ముకేష్ రెడ్డి) పూజని ఇండియాకు పిలుస్తాడు. వందల కోట్ల రూపాయల ఆస్తికి వారసురాలైన పూజకి తన కొడుకును ఇచ్చి బలవంతంగా పెళ్ళి చేయాలని చూస్తాడు. ఈ విషయం తెలుసుకొన్న ఫారిన్ ప్రసాద్ ఇంకా పూజ ప్రేమిస్తోందన్న భ్రమలో ఉన్న వెంకటరమణ సహాయంతో పూజను వారి చెరనుండి విడిపించాలనుకుంటాడు. ఇవేమీ తెలియని వెంకటరమణ బెంగాల్ రెడ్డి ఇంట్లోకి ప్రణిత్ పేరుతో దిగుతాడు. చివరికి వెంకటరమణ ఆ ఫ్యాక్షనిస్టు బారినుండి ఎలా రక్షిస్తాడు....? పూజ తనను ప్రేమించడం లేదని తెలుసుకొన్న వెంకటరమణ చివరికి ఏం చేస్తాడు..? ఇంతకీ వెంకటరమణకి పెళ్ళయిందా.. లేదా.. అన్నది మిగతా కథ.
ఎనాలసిస్ :
ఈమధ్య వచ్చే సినిమాలలో కామెడీకి పెద్దపీట వేయడం ఆహ్వానించదగ్గ విషయం, ఈ చిత్రం కూడా దర్శకుడు శ్రీనువైట్ల మార్కు కామెడీ తో సాగిపోయింది. అయితే సెకెండాఫ్ లో అక్కడక్కడా "రెడీ" సినిమా ఛాయలు కనిపించడం యాదృచ్ఛికం. ఇక ఫ్యాక్షనిస్టు బ్యాక్‌డ్రాఫ్ట్ హీరోయిన్ ఉండటం... హీరో హీరోయిన్ ని రక్షించడం ఇలాంటి కథలతో ఎన్నో చిత్రాలు వచ్చాయి. ఇకనైనా ఈ ఫార్మెట్ ని దర్శకులు మారిస్తే బాగుంటుంది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన-:వెంకటరమణ పాత్రలో విక్టరీ వెంకటేష్ ఒదిగిపోయారు. ఈ చిత్రంలో వెంకటేష్ నటన హైలెట్ నిలుస్తుంది. హీరోయిన్ త్రిష తన పాత్రకు తగ్గస్థాయిలో బాగానే నటించింది. ఈ చిత్రంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఫారిన్ ప్రసాద్ క్యారెక్టర్ లో నటించిన బ్రహ్మానందం అదరగొట్టాడు. మిగతా నటీనటులంతా తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు.సంగీతం-: ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరొక ప్లస్ పాయింట్. దీనికి సంగీత దర్శకుడు చాలా చక్కని ట్యూన్స్ అందించారు. ముఖ్యంగా నమో వెంకటేశ టైటిల్ సాంగ్ చాలా బాగుంది. యాక్షన్-: యాక్షన్ ఎపిసోడ్స్ లో అలరిస్తాయి.దర్శకత్వం-: శ్రీను వైట్ల దర్శకత్వం బాగుంది. కథ కథనాలతో తన మార్కు ప్రజెంటేషన్ చేస్తూ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఈ చిత్రాన్ని హాయిగా నవ్వుకోవడానికి వెంకటేష్ యాక్టింగ్ చూడాలనుకునేవారు చూడొచ్చు.