English | Telugu

సినిమా పేరు:నా స్టైలే వేరు
బ్యానర్:దిషిర ప్రొడక్షన్స్
Rating:---
విడుదలయిన తేది:Jun 12, 2009
బ్యానర్:దిషిర ప్రొడక్షన్స్
Rating:---
విడుదలయిన తేది:Jun 12, 2009
శివరాం(డాక్టర్ రాజశేఖర్)ఒక లాయర్.అతని తండ్రి ఒక మేజిస్ట్రేట్ (చలపతిరావు),అన్న(బెనర్జీ)ఎసిపి.కానీ శివరాం 'లా'ప్రాక్టీస్ మానేసి జానీ (ఆలీ)తో కలసి పచ్చి తాగుబోతుగా మారతాడు.దానికి కారణం అతను చేసుకోవాలనుకున్న అమ్మాయి చనిపోవటమే.దానికి తన కుటుంబం కూడా కారణమని నమ్ముతాడు శివరాం.పార్వతి (భూమిక)విశ్వనాథ్(విజయకుమార్) అనే ఒక కోటీశ్వరుడి కూతురు.శివరామ్ గుండె ఆపరేషన్ కోసం అమెరికా వెళ్తాడు.అప్పుడు పార్వతిని ఎవరో చంపబోతున్నారని ఆమె దగ్గర పనిచేసే ప్రవీణ్ అనే వ్యక్తి చెప్పటంతో,ఆమె అక్కడ నుండి పారిపోటానికి ప్రయత్నిస్తుండగా ఆమెను కిడ్నాప్ చేస్తారు.అప్పుడామె తనను బంధించిన రూం నుండి ఎవరికో ఫోన్ చేస్తే ,ఆ ఫోన్ కాల్ శివరాంకి వస్త్రుంది.అక్కడి నుంచి శివరామ్ ఆమెను తప్పించి తన ఇంటికి తీసుకువస్తాడు.కానీ ఆమెను తీసుకువెళటానికి ఆమె ఇంటి నుంచి మనుషులు వస్తే,'నేను శివరాంని పెళ్ళిచేసుకున్నానని"పార్వతి చెపుతుంది.పార్వతి తండ్రి అమెరికా నుండి వస్తున్నాడని ప్రవీణ్ ఫోన్ చేయటంతో పార్వతిని ప్రవీణ్ కి అప్పగించటానికి శివరాం తెస్తూండగా,అక్కడ ప్రవీణ్ బలవంతంగా పార్వతిని తీసుకెళతాడు.ఆ తర్వాత పార్వతి తండ్రి వచ్చి శివరాంతో నా కూతురిని పంపించమంటే, ఆమె నీ కూతురు కాదు నా భార్య అని చెప్పటంతో కోపం వచ్చిన పార్వతి తండ్రి వెళ్ళిపోతాడు.పార్వతిని కిడ్నాప్ చేసిన ప్రవీణ్ ఫోన్ చేసి శివరాంని పార్వతి తండ్రి నుండి 5కోట్లు తీసుకు రమ్మని లేకుంటే ఆమెను చంపేస్తాననీ చెపుతాడు.ఆ తర్వాతేం జరిగింది...అనేది మిగిలిన కథ.