Read more!

English | Telugu

సినిమా పేరు:మిరపకాయ
బ్యానర్:యెల్లో ఫ్లవర్స్
Rating:3.00
విడుదలయిన తేది:Jan 13, 2011
రిషి(రవితేజ)అనే అనాథని ఒక పోలీస్ ఆఫీసర్ పెంచి అతన్ని కూడా పోలీస్ ని చేస్తాడు.డిపార్ట్ మెంట్లో అతనికున్న పేరు మిరపకాయ్. అతన్ని ఒక స్పెషల్ కేస్ నిమిత్తం ఢిల్లీ నుండి హైదరాబాద్ పంపిస్తారు.ఆ కేసేమిటంటే కిట్టూ భాయ్ (ప్రకాష్ రాజ్)అనే డాన్ ని ప్రాణాలతో పట్టుకోవటం.కిట్టూ భాయ్ కి వైశాలి(దీక్ష సేథ్)అనే కూతురుంటుంది.కానీ ఆమె తన తండ్రిని ద్వేషిస్తుంటుంది.ఆమెను హైదరాబాద్ లో పెట్టి శంకరన్న(కోట)సంరక్షణలో ఉంచి,శంకరన్న చైర్మన్ గా ఉన్న కాలేజీలో చదిస్తుంటాడు కిట్టుభాయ్.ఆ కాలేజీకే రిషిని హిందీ లెక్చరర్ గా పమపిస్తుంది రిషి డిపార్ట్ మెంట్.వైశాలీని రిషి ట్రాప్ చేసి ఆమె ద్వారా కిట్టూ భాయ్ ని పట్టుకోవటం రిషి మిషన్.అయితే కాలేజీలో చదివే వినమ్ర(రిచా గంగోపాథ్యాయ)అనే అమ్మాయిని ప్రేమిస్తాడు రిషి.ఈ ఇద్దరు భామల మధ్య నలుగుతూ,శంకరన్నను ఫూల్ ని చేస్తూ రిషి తన మిషన్ ఎలా పుర్తిచేశాడన్నది మిగిలిన కథ.
ఎనాలసిస్ :
దర్శకుడిగా హరీష్ శంకర్ టేకింగ్ బాగుంది.అలాగే ఈ చిత్రానికి చక్కని స్క్రీన్ ప్లే తోడయ్యింది.ఈ చిత్రానికి మాటలు కూడా దర్శకుడే వ్రాయటంతో,డైలాగులన్నీ క్లుప్తంగా ఉండి డైలాగులలో పంచ్ కూడా బాగుంది.సినిమాకి ఇంకాస్త మంచి కథ కూడా ఉండుంటే ఈ సినిమా ఇంకా బాగుండేది. నటన - ఈ చిత్రంలో రవితేజ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.టిపికల్ రవితేజ క్యారెక్టర్ ని ఇందులో చూడవచ్చు.ఈ చిత్రం పేరుకి తగ్గట్టుగానే ఈ చిత్రంలో రవితేజ పాత్ర ఉంటుంది.రవితేజ స్పీడ్,జోష్,డ్యాన్సుల్లో,ఫైట్స్ లో పుష్కలంగా మనకు కనపడుతుంది. నిజానికి రవితేజ స్పీడ్ చూస్తుంటే ఈ చిత్రం ఆడియో విడుదల సభలో నాగబాబు అన్నట్టు రవితేజ యన్ టి ఆర్,బన్నీ,రామ్ చరణ్లతో పోటీపడుతున్నాడనిపిస్తుంది.ఇక డైలాగ్ డెలివరీలో,డైలాగ్ మాడ్యులేషన్ లో మాస్ ని అలరించే ఆయన స్టైల్ ఆయనకెలాగూ ఉంది.ఈ చిత్రంలోని ఇద్దరు హీరోయిన్లు అంటే రీచా గంగోపాథ్యాయ,పాత్రలో దీక్షా సేథ్ బాగానే నటించారు.మధ్య తరగతి సాంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయిగా రిచా బాగానే నటించగా,యారెగెంట్ అమ్మాయిగా నటించిన దీక్షాసేథ్ నటనలో ఇంకా పరిణితి కనిపించాల్సి ఉంది.మిగిలిన వాళ్లంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి. సంగీతం -పాటలన్నీ బాగున్నాయి.అయినా పాటల్లో ముఖ్యంగా "అడుగడుగో చూడు ఆకతాయిరో,ధినక్ ధిన్ జియా మైనె ప్యార్ కియా,అంత లేదూ అంత లెదూ,సిలకా ఓ సిలకా"అనే ఈ నాలుగు పాటలు వినటానికి మరీ బాగున్నాయి.అలాగే రీ-రికార్డింగ్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ -ఈ చిత్రంలో కేమెరా పనితనం బాగుంది.రామ్ ప్రసాద్ ఫొటోగ్రఫీ చాలా బాగుంది.ముఖ్యంగా పాటల్లో ఇంకా బాగుంది. మాటలు - ఈ చిత్రం మాటల్లో పంచస్ చాలా ఉన్నాయి.సీనుకు రెండు మూడు పంచ్ లున్నాయి చిత్రం మాటల్లో.సినిమా నిండా పంచ్ డైలాగులు పుష్కలంగా ఉన్నాయి. పాటలు - పాటల్లో సాహిత్యం ...వెల్ బాగుంది.నేటి యువతరానికి నచ్చే విధంగా ఈ చిత్రం పాటల్లోని సాహిత్యం ఉంది. ఎడిటింగ్ - ఎడిటింగ్ బాగుంది. ఆర్ట్ - ఒ.కె. కొరియోగ్రఫీ - ఈ చిత్రంలోని అన్ని పాటల్లో కొరియోగ్రఫీ బాగుంది.రవితేజకు ఎలాంటి స్టెప్పులైతే యాప్ట్ గా ఉంటాయో అలాంటి వాటినే ఉపయోగించి అతనికి ఇబ్బంది లేకుండా చేశారు.అందువల్ల పాటల్లో స్పీడ్ బాగా పెరిగి ప్రేక్షకులనలరించేలా ఉన్నాయి. యాక్షన్ - బాగుంది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
రవితేజ గత చిత్రం "డాన్ శీను"లానే ఇది కూడా యూత్ కీ,మాస్ కీ నచ్చే పూర్తి ఎంటర్ టైన్ మెంట్ చిత్రం.మీకు ఎంటర్ టైన్ మెంట్కావాలనుకుంటే టైమ్ పాస్ కోసం ఏ అంచనాలూ లేకుండా వెళ్ళి ఈ చిత్రం చూడండి.