Read more!

English | Telugu

సినిమా పేరు:మన్మధబాణం
బ్యానర్:రెడ్ జెయింట్ మూవీస్
Rating:2.00
విడుదలయిన తేది:Dec 23, 2010
కోటీశ్వరుడైన మదన్ గోపాల్ (మాధవన్)ప్రముఖ సినీ నటి అంబు(త్రిష)ని ప్రేమిస్త్రాడు.కానీ ఆ ప్రేమలో అనుమానం ఎక్కువగా ఉంటుంది.ఒకసారి కొడైకెనాల్లో ఆమె షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి తల్లీ,తండ్రీతో కలసి మదన్ వెళతాడు.అక్కడ కార్వాన్ లో హీరోతో కలసి అంబు కుడా ఒకేసారి వెళ్ళి డ్రస్ మార్చుకు రావటం వంటివి అతని మనసులోని అనుమానాన్నిమరింత పెంచగా, అక్కణ్ణించి అంబుతో కలసి తిరిగి వస్తూండగా వీళ్ళిద్దరి మధ్య ఈ విషయం గురించి వాదన రేగి అది ఒక యాక్సిడెంట్ కి దారి తీస్తుంది.ఆ తర్వాత అంబు యురప్ లో ఉన్న తన స్నేహితురాలు దీప(సంగీత)దగ్గరికి వెళుతుంది.ఆమెను గమనించమని మిలటరీలో పనిచేసిన ఒక ఆర్.భూషణం అనే మేజర్ (కమల్ హాసన్)ని అక్కడికి పంపిస్తాడు.మేజర్ స్నేహితుడు(రమేష్ అరవింద్)క్యాన్సర్ వ్యాధితో భాధపడుతూంటాడు.అతని వ్యాధి నయం చేయటానికి అవసరమైన డబ్బుకోసమే మేజర్ ఈ పనికి అంగీకరిస్తాడు.మదన్ గోపాల్ తో మేజర్ నిజం చెపితే అతన్ని తిరిగి ఇండియా వచ్చేయమని,అతనికివ్వ వలసిన డబ్బుని ఎగవేయటానికి మదన్ ప్రయత్నిస్తాడు.దాంతో అంబు తో ఎవరో ఉన్నారని మదన్ గోపాల్ కి మేజర్ అబద్ధం చెపుతాడు.తన స్నేహితుడి వ్యాధికి అవసరమైన డబ్బుకోసమే మేజర్ అలా అబద్ధం చెపుతాడు.నిజానికి అంబు,మదన్ కలసి కోడైకెనాల్లో చేసిన యాక్సిడెంట్ వల్లే మేజర్ భార్యను పోగొట్టుకుంటాడు.మేజర్ స్నేహితుడి ఆరోగ్యం బాగయిందా...?అంబుని మదన్ పెళ్ళి చేసుకున్నాడా..?వంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి.
ఎనాలసిస్ :
విశ్లేషణ - గతంలో పంచతంత్రం,దశావతారం వంటి సినిమాలు దర్శకుడు కె.యస్.రవికుమార్,నటుడు కమల్ హాసన్ కలయికలో వచ్చాయి.కానీ ఈ చిత్రం ఏ దశలోనూ వాటితో పోల్చతగినది కాదు.కాకపోతే యూరప్,వెనిస్,ప్రదేశాలను చూడాలనుకుంటే ఈ చిత్రం చూడవచ్చు.ఇక నటన పరంగా కమల్ గురించి ఈ రోజు కొత్తగా ఏం చెప్పక్కరలేదు.త్రిష ముఖంలో కళ తప్పుతోంది.అది ఈ చిత్రంలో బాగా కనపడుతుంది.ఇక సంగీత నిజంగా ఇద్దరు పిల్లల తల్లిలాగానే ఈఅ సినిమాలో కనిపిస్తుంది.మాధవన్ ఈ సినిమాలో ఎక్కువగా తాగుతూనే కనిపిస్తాడు.అతనికి పెద్దగా నటించే అవకాశమేం లేదు.ఇక కేరళ నిర్మాత,అతని భార్య,మాధవన్ తల్లిగా ప్రముఖ గాయని ఉషా ఊతప్ పాత్రలు లేకపోయినా ఈ సినిమాకేం నష్టం లేదు.ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ కాస్త బెటరనిపిస్తుంది. సంగీతం - సగటు స్థాయిలోనే ఉంది.రి-రికార్డింగ్ ఫరవాలేదు.కెమెరా- ఈ చిత్రంలో కెమెరా వర్క్ బాగుంది .యూరప్ అందాలు ఈ చిత్రంలో బాగా చూపించారు.మాటలు - సగటు స్థాయిలో ఉన్నాయి.పాటలు - నీలాకాశం పాట బాగుంది.ఎడిటింగ్ - నీలాకాశం అన్నపాటలో ఎడిటింగ్ సుపర్బ్.మొత్తం పాటంతా రివర్స్ లో చూపించటం చాలా కొత్తగా బాగుంది. కొరియోగ్రఫీ - యావరేజ్ స్థాయిలో ఉంది.యాక్షన్ - ఒ.కె.అనిపిస్తుంది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఇది కమల్ హాసన్ సినిమా కదా అనుకుని వెళ్తే దెబ్బయిపోతారు.కాకపోతే యురప్ అందాలను చూడటానికి వెళ్తే వెళ్ళండి మీ ఇష్టం.