English | Telugu

సినిమా పేరు:మంచు కురిసే వేళ‌లో
బ్యానర్:లలిత శ్రీ కంబైన్స్
Rating:2.75
విడుదలయిన తేది:Dec 28, 2018

న‌టీన‌టులుః రామ్ కార్తిక్, ప్ర‌నాలి, య‌శ్వంత్, చ‌మ్మ‌క్ చంద్ర‌,వి జ‌య్ సాయి,  క‌త్తి మ‌హేష్‌,
 సాంకేతిక నిపుణులు
 సంగీతం: శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్
 సినిమాటోగ్ర‌ఫీ: తిరుజ్ఞాన‌, ప్ర‌వీణ్ కుమార్ పంగులూరి
 ఎడిటింగ్: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
 క‌థ‌-స్క్రీన్ ప్లే- నిర్మాత‌-ద‌ర్శ‌క‌త్వం: బాల బోడెపూడి
 రిలీజ్ డేట్:28-12-2018
 
 `మంచు కురిసే వేళ‌లో...పాట ఎంత పెద్ద హిట్ట‌యిందో అంద‌రికీ తెలిసిందే. అలాంటి ఒక పొయిటిక్ టైటిల్ తో తెర‌కెక్కిన స్వ‌చ్ఛ‌మైన ప్రేమ క‌థా చిత్రం `మంచుకురిసే వేళ‌లో`. బాల బోడెపూడి స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం పాట‌లు, ట్రైల‌ర్ తో అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది. మ‌రి ఈ రోజు విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకునే ప్ర‌యత్నం చేసిందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం...

 క‌థ‌లోకి వెళితే...

ఆనంద్ కృష్ణ ( హీరో రామ్ కార్తిక్)  వైజాగ్ లోని రేడియో సిటీ లో ఆర్ జే గా చేస్తుంటాడు.  క్రేజీ ల‌వ్ కాన్సెప్ట్ మీద కాల‌ర్స్ తో మాట్లాడుతుంటాడు. ఈ క్ర‌మంలో విజ‌య్ త‌న ల‌వ్ ఫెయిల్ అయిందంటూ ...నేను సూసైడ్ చేసుకోబోతున్నా అంటూ క్రిష్ కి కాల్ చేస్తుంటాడు. అప్పుడు ల‌వ్ లో ఫెయిల్ అయితే చచ్చిపోతారా ? అంటూ హీరోగా క్లాస్ పీకి త‌న‌ని ఆ ప్ర‌య‌త్నం విర‌మించే ప్ర‌యత్నం చేస్తాడు. నువు ల‌వ్ చేస్తే నీకు తెలిసేది అన‌గా...నేను ల‌వ్ చేయేట్లేద‌ని ఎవ‌రు అన్నారు నేను ల‌వ్ లో ఉన్నా అంటూ ఒక ఫేక్ ల‌వ్ స్టోరి స్టార్ట్ చేస్తాడు. త‌ను ఏదైతే ల‌వ్ స్టోరీ చెప్పాడో అలాంటి అమ్మాయి గీత  ( హీరోయిన్  ప్ర‌నాలి) బీచ్ లో క‌న‌ప‌డుతుంది.  ఆనంద్ చ‌దివే కాలేజ్ లోనే జాయిన్ అవుతుంది. అలా స్టార్ట్ అయిన స్టోరి ...ఇద్ద‌రు క‌లుసుకోవ‌డం, స‌న్నిహితంగా మెలుగ‌డం జ‌రుగుతుంటుంది, ఆ   స‌మ‌యంలో ఆ అమ్మాయికి ప్ర‌పోజ్ చేస్తాడు ఆనంద్. కానీ అమ్మాయి సీరియ‌స్ గా వెళ్లిపోతుంది. అస‌లు అమ్మాయి ఎందుకు అలా వెళ్లింది. త‌న ఫ్లాష్ బ్యాక్  ఏంటి? ఎందుకు వైజాగ్ వ‌చ్చింది. చివ‌రికి వీరి ల‌వ్ స‌క్సెస్ అయిందా అన్న‌ది మిగ‌తా స్టోరి.


ఎనాలసిస్ :

పొయిటిక్ టైటిల్ తో పెట్ట‌డంతో పాటు వైజాగ్, ఊటీ లాంటి బ్యాక్ డ్రాప్ ల‌లో ఒక స్వ‌చ్ఛ‌మైన ల‌వ్ స్టోరీ చేయాల‌న్న ద‌ర్శ‌కుడి ప్ర‌య‌త్నం ఫ‌లించింద‌నే చెప్పాలి. టైటిల్ ప‌డ్డ ద‌గ్గ‌ర నుంచి ఎండింగ్ టైటిల్ వ‌ర‌కు ప్ర‌తి ఫ్రేమ్ ఎంతో క‌ల‌ర్ ఫుల్ గా ఉంటుంది. న‌టీన‌టులు కూడా డైర‌క్ట‌ర్ డిజైన్ చేసుకున్న పాత్ర ల‌కు న్యాయం చేశార‌నే చెప్పాలి. కాకుంటే ద‌ర్శ‌కుడు రెగ్యుల‌ర్ క‌థ ను తీసుకోవం తో పాటు ఆడియ‌న్స్ కు క‌నెక్ట్  చేయ‌లేక‌పోయాడు. ఫ‌స్టాఫ్ లో నే హీరోయిన్ కు ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంద‌ని ముందే ఆడియ‌న్స్ ఊహించేస్తారు. సీన్స్ లో కొత్త ద‌నం కొర‌వ‌డింది.  ద‌ర్శ‌కుడి మీద పుస్త‌కా ల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంద‌ని చాలా సంభాష‌ణ‌ల్లో తెలుస్తుంది. తొలిభాగం అంతా సాదా సీదా గా సాగి సెకండాఫ్ లో ఏదో ఉంటుంద‌ని ఊహించుకున్న ఆడియ‌న్ కు అక్క‌డ కూడా ల్యాగ్ సీన్స్ ద‌ర్శ‌కుడు కొంచెం బోర్ కొట్టించాడు.  కానీ ఎక్క‌డ ఒక కొత్త ద‌ర్శ‌కుడు చేసిన సినిమా అన్న భావన మాత్రం క‌నిపించ‌లేదు. ద‌ర్శ‌క నిర్మాత ఒక‌రే కావ‌డంతో త‌ను ఎలా ఊహించుకున్నాడో అలా సినిమా తీసాడు త‌ప్ప ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు. అలాగే న‌టీన‌టుల దగ్గ‌ర నుంచి మంచి న‌ట‌న రాబట్టుకున్నాడు.  బోల్డ్ సినిమాలతో ఏదో విధంగా జ‌నాల్ని ఆక‌ట్టుకోవాల‌ని సినిమాలు చేస్తోన్న‌ త‌రుణంలో ఎక్క‌డా ఒక బూతు డైలాగ్ లేకుండా, వ‌ల్గారిటీకి తావు లేకుండా త‌ను ఒక  జెన్యూన్ ల‌వ్ స్టోరి ని తెర‌కెక్కించినందుకు  క‌చ్చింతంగా ద‌ర్శ‌కుడిని అభినందించి తీరాలి.

ప్ల‌స్ పాయింట్స్ః

సినిమాటోగ్ర‌ఫీ
సంగీతం
సంభాష‌ణ‌లు
హీరో హీరోయిన్స్
అంద‌మైన లొకేష‌న్స్
అద్భుత‌మైన విజువ‌ల్స్
 
మైన‌స్ పాయింట్స్ః

రెగ్యుల‌ర్ స్టోరి
సెకండాఫ్ లో  ల్యాగ్
హీరో ఫ్రెండ్స్
కామెడీ లోపించ‌డం
ఆక‌ట్టుకునే అంశాలు లేక‌పోవ‌డం

 న‌టీనటుల ప‌నితీరుః
 ఆర్ జే గా రామ్ కార్తిక్ చాలా నేచ‌ర‌న‌ల్ గా న‌టించాడు. న‌టుడుగా ఒక మంచి క్యార‌క్ట‌ర్ వ‌స్తే మంచి అవుట్ పుట్ ఇవ్వ‌గ‌ల‌డ‌ని ఫ్రూవ్ చేసుకున్నాడు. ఫ‌స్టాఫ్ లో ఒక స్టూడెంట్ గా ఎంత ఎన‌ర్జిటిక్ గా న‌టించాడో సెకండాఫ్ లో ల‌వ‌ర్ గా , త‌న ల‌వ్ ని ఎలా నిల‌బెట్టుకోవాలో  తెలియ‌ని ఎమోష‌న‌ల్ సీన్స్ కూడా బాగా నే చేశాడు. హీరోయిన్ తొలి భాగం అంతా సింగిల్ ఎక్స్ ప్రేష‌న్ తో కానించేసినా...సెకండాఫ్ లో మాత్రం చాలా ఈజ్ క‌న‌బ‌రిచింది. మ‌రో హీరో య‌శ్వంత్ త‌న పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా న‌టించాడు. చ‌మ్మ‌క్ చంద్ర పాత్ర ఓకే అనిపించేలా ఉంది. మిగ‌తా పాత్ర‌ల‌న్నీ వారి వారి  పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టుగా ఉన్నాయి.

 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

మంచు కురిసే వేళ‌లో చిన్న న‌టీనటులే అయినా...కొత్త ద‌ర్శ‌క నిర్మాత అయినా ఒక మంచి ప్ర‌య‌త్నంగా చెప్ప‌వ‌చ్చు. వీనుల విందైన  పాట‌లు, క‌నువిందైన విజువ‌ల్స్ తో  పాటు ఆక‌ట్ట‌కునే సంభాష‌ణ‌ల‌తో సాగే ఈ చిత్రం ఒక‌సారి  కుటుంబమంతా క‌లిసి  హాయిగా  చూడ‌వ‌చ్చు.  వైజాగ్ బీచ్ లో , ఊటీ  మంచు లో క‌రిగినంత‌ రిలాక్స్ అవ్వొచ్చు.  

తెలుగు వన్ రేటింగ్ : 2.50

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25