Read more!

English | Telugu

సినిమా పేరు:మహేష్ ఖలేజా
బ్యానర్:శ్రీ కనక రత్నా మూవీస్
Rating:3.00
విడుదలయిన తేది:Oct 7, 2010
హీరో సీతారామరాజు (మహేష్ బాబు) పద్ధతి గల ఒక మధ్య తరగతి స్కూల్ మాస్టర్ మనవడు.అతను టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు.సుభాషిణి (అనుష్క) అనే బాగా డబ్బున్న అమ్మాయి సీతారామ రాజుని కలుస్తుంది.అప్పటి నుంచీ సీతారామరాజుకి కష్టాలు మొదలవుతాయి. కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల అతను రాజస్థాన్ వెళ్ళాల్సి వస్తుంది.అక్కడ కూడా సుభాషిణి అతన్ని కలుస్తుంది.అక్కడ సీతారామ రాజు మీద సుభాషిణికి కాబోయే మామ జి.కె.(ప్రకాష్ రాజ్) దాడి చేయిస్తాడు.సీతారామరాజుని అక్కడ పొడుస్తారు.అతను వెంట్రుక వాసిలో చావుని తప్పించుకుంటాడు.అతను కళ్ళు తెరచి సూసే సమయానికి ఒక గ్రామంలో ఉంటాడు.ఆ గ్రామస్తులు అతన్ని కాపాడతారు.ఆ గ్రామస్తులంతా సీరామరాజుని ఒక దేవుడిలా చూస్తారు.ఆ గ్రామస్తులకు ఒక బాధ ఉంటుంది.ఆ బాధను తీర్చమని హీరోని వారు అడుగుతారు.హీరో వారి బాధను తీర్చాడా...?లేక...నాకెందుకులే అని వెళ్ళిపోయాడా...అన్నది మిగిలిన కథ....
ఎనాలసిస్ :
దర్శకత్వం - ఈ చిత్రానికి దర్శకుడు, రచయిత అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనా ప్రతిభ గురించి కానీ,దర్శకత్వ ప్రతిభను కానీ మనం శంకించాల్సిన పనిలేదు.అదీ కాక గతంలో మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన "అతడు" చిత్రం ఎలా ఉందో ప్రేక్షకులకు తెలిసిందే.ఆ చిత్రం బాగుండబట్టి ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.దర్శకత్వం నిజంగా బాగుంది.ముఖ్యంగా స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది.అలాగే త్రివిక్రమ్ ని మించిన సినీ మాటల రచయిత ప్రస్తుత కాలంలో లేరంటే అతిశయోక్తి కాదు.అతనే మాటల రచయిత, దర్శకుడూ కావటం అతనికి బాగా ప్లస్సయింది.ఇది సినిమా చూస్తే కానీ అర్థం కాదు.సినిమా ఫస్ట్ హాఫంతా కామెడీగా సాగి, ఆ కామెడీ సెకండ్ హాఫ్ లో కూడా కంటిన్యూ అవుతూ కథలోకి తీసుకెళ్తాడు దర్శకుడు.గతంలో దేవానంద్ హీరోగా నటించిన "గైడ్" చిత్రం ఫ్లేవర్ కాస్త ఈ చిత్రంలో కనిపించినా,దానికి కమర్షియల్ హంగులద్ది దానికీ, దీనికీ సంబంధం లేదనిపించేలా ఈ చిత్రాన్ని తిసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కి హేట్సాఫ్ చెప్పాల్సిందే.ఇరేడియం అనే మెటల్ గురించి అది బంగారం కన్నా ఖరీదనే విషయాన్ని, దాని కోసమే విలన్ తాపత్రయపడతాడనే సంగతి ఈ కథ క్లైమాక్స్ కి చక్కగా వాడుకున్నాడు త్రివిక్రమ్. నటన - మహేష్ బాబు ఈ చిత్రంలో చాలా కొత్తగా కనిపిస్తాడు.ఈ చిత్రంలో అతని నటన కొత్త పుంతలు తొక్కింది.అది ఎలా అనేది చెప్తే మజా రాదు.చూడాల్సిందే."పోకిరి" సినిమాలో మహేష్ బాబు కొత్తగా కనిపించాడనుకుంటే దీన్లో అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్ లో అదరగొట్టాడు.నిజం చెప్పాలంటే ఈ సినిమా మహేష్ బాబు ఒక్కడే తన భుజాల మీద మోశాడని చేప్పాలి.ఇక అనుష్క తన బంగారం పాత్రకు తాను న్యాయం చేసింది.కానీ మహేష్ బాబు కంటే అనుష్క కాస్త పెద్దదానిలా కనిపించింది.అందుకు మహేష్ బాబు గ్లామర్ కారణమని చెప్పొచ్చు.విలన్ గా ప్రకాష్ రాజ్,రాజస్థాన్‍ లో శివ భక్తుడిగా రావు రమేష్ రావు,జెమిని రిపోర్టర్ గా సునీల్,మిరియంగా బ్రహ్మానందం,ఆలీ,యమ్ యస్ నారాయణ,ధర్మవరపు సుబ్రహ్మణ్యం,తనికెళ్ళ భరణి,కోట శ్రీనివాసరావు, అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సంగీతం - మామూలుగానే మహేష్ బాబు సినిమాలకు మణిశర్మ ఇచ్చే సంగీతం సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది.ఈ సినిమాలో అది కొట్టొచ్చినట్టు మనకు కనపడుతుంది....వినపడుతుంది రీ-రికార్డింగ్ అదిరింది. సినిమాటోగ్రఫీ - ఎక్స్ లెంట్...చాలా బాగుంది. ఎడిటింగ్ - చూడముచ్చటగా ఉంది. మాటలు - చాలా తక్కువగా ఉండి అర్థవంతంగా ఉన్నాయి.రిపీటెడ్ ఆడియన్స్ ని రప్పించేలా ఉన్నాయి.రాసింది త్రివిక్రమ్ కదా. పాటలు - గురుశిష్యులు ఈ సినిమాకి పాటలు వ్రాశారు.సితారామశాస్త్రి గురువు అయితే రామ జోగయ్య శాస్త్రి శిష్యుడు.అన్ని పాటలూ సాహిత్యపరంగా బాగున్నాయి. ఆర్ట్ - చక్కగా ఉంది. కొరియో గ్రఫీ - రాజు సుందరం,అహ్మద్ ఖాన్ ‍, ప్రేమ్ రక్షిత్ ల కొరియోగ్రఫీ చాలా బాగుంది.రొటీన్ కి భిన్నంగా ఈ చిత్రంలో కొరియోగ్రఫీ ఉంది. యాక్షన్ - చాలా బాగుంది.పీటర్ హెయిన్, రామ్-లక్ష్మణ్‍ ఇద్దరూ పోటీపడి యాక్షన్ కంపోజ్‍ చేశారు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఈ సినిమా హ్యాపీగా, ధైర్యంగా, సకుటుంబంగా, సరదాగా,నవ్వుకుంటూ చూడొచ్చు....