English | Telugu

లూసిఫర్ 2
సినిమా పేరు:లూసిఫర్ 2
బ్యానర్:లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్
Rating:2.50
విడుదలయిన తేది:Mar 27, 2025

సినిమాపేరు:L 2 ఎంపురాన్  
నటీనటులు:మోహన్ లాల్,పృథ్వీ రాజ్ సుకుమారన్,మంజువారియర్,టోవినో థామస్, అభిమన్యు సింగ్,ఆండ్రియా తివాదర్, జెరోమ్ ప్లిన్, బోరిస్ ఆలివర్, కిషోర్,ఎరిక్ ఎబోని తదితరులు  
రచన:మురళి గోపి 
సినిమాటోగ్రఫి: సుజిత్ వాసుదేవ్ 
ఎడిటర్: అఖిలేష్ మోహన్ 
సంగీతం: దీపక్ దేవ్ 
బ్యానర్స్: లైకా ప్రొడక్షన్స్,ఆశీర్వాద్ సినిమాస్, గోకులం మూవీస్ 
నిర్మాతలు:సుభాస్కరాన్ ,ఆంథోనీ పెరంబవుర్, గోకులం గోపాలన్
దర్శకత్వం :పృథ్వీ రాజ్ సుకుమారన్
విడుదల తేదీ:27 -03 -2025 

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన మూవీ లూసిఫర్.2019 లో వచ్చిన ఈ మూవీ తెలుగు నాట కూడా డబ్ అయ్యి తెలుగు ప్రేక్షకులని కూడా ఆకట్టుకుంది.దీంతో ఈ రోజు లూసిఫర్ కి కొనసాగింపుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎల్ 2 ఎంపురాన్ ఎలా ఉందో చూద్దాం.

కథ

విదేశాల్లో ఉండే ఖురేషి అబ్రహం(మోహన్ లాల్) ప్రపంచ దేశాలకి చెందిన పోలీసులతో పాటు ప్రపంచ దేశాల్ని తన కనుసైగతో శాసించే స్మగ్లర్ కబుగా(ఎరిక్ ఎబోని) కి టార్గెట్ అవుతాడు.తన పెంపుడు తండ్రి పీకే రామదాస్ స్థాపించిన ఐయుఎఫ్ పార్టీ తరుపున రామదాస్ కుమారుడు జతిన్(టోవినో థామస్) కేరళ ముఖ్యమంత్రిగా కొనసాగుతుంటాడు.ఎలక్షన్స్ దగ్గర పడటంతో ఉత్తరాది రాష్ట్రానికి చెందిన మతోన్మాది,ఏఎస్ఎమ్ పార్టీ అధినేత భజరంగ్(అభిమన్యు సింగ్ )తో పొత్తు పెట్టుకుంటాడు.పైగా పార్టీ పేరుని ఐయుఎఫ్ రామదాస్ పార్టీగా మార్చుతున్నానని ప్రకటన కూడా చేస్తాడు.దీంతో రామ్ దాస్ కూతురు ప్రియదర్శిని(మంజువారియర్) తో పాటు పార్టీలోని ప్రధాన నాయకులు,కార్యకర్తలకి జతిన్ నిర్ణయం నచ్చదు.తన తండ్రి పార్టీని,ఆశయాన్నినిలబెట్టడానికి జతిన్ కి వ్యతిరేకంగా ప్రియదర్శని ఒక నిర్ణయం తీసుకుంటుంది.దీంతో ప్రియదర్శిని ని భజరంగ్ చంపాలనుకుంటాడు.కానీ తన అనుచరుడైన జాయేద్ మసూద్(పృథ్వీ రాజ్ సుకుమారన్) చేత భజరంగ్ చంపేలా ఖురేషి ప్లాన్ చేస్తాడు.భజరంగ్ కేరళ కే ఎందుకు వచ్చి ఐయుఎఫ్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు? ఆ పొత్తు వెనుక ఉన్న రహస్యం ఏంటి? జతిన్ పార్టీ పేరు ఎందుకు మార్చాడు? ఖురేషి ఎందుకు ప్రపంచదేశాలకి టార్గెట్ అయ్యాడు.జాయేద్ మసూద్ చేత భజరంగ్ ని ఎందుకు చంపించాడు?జాయేద్ మసూద్ గతం ఏంటి? ప్రియదర్శిని తన తండ్రి ఆశయం నెరవేర్చడానికి స్టీఫెన్ గా వచ్చిన ఖురేషి ఏం చేసాడు? అసలు ఖురేషి కథ ఏంటి అనేదే ఈ చిత్ర కథ 


ఎనాలసిస్ :

మొదటి పార్ట్ లో ఖురేషి అబ్రహం గురించి లేని పూర్తి కథని పార్ట్ 2 లో వివరంగా చెప్పారు.కాకపోతే కథనాల ద్వారా చెప్పకుండా ఎలివేషన్స్ ద్వారా చెప్పారు. ఖురేషి గా మోహన్ లాల్ క్యారక్టర్ కూడా దాదాపుగా 40 నిమిషాల దాకా ఎంటర్ అవ్వదు. అంత లాగ్ అవసరం లేదని మూవీ చూస్తే అర్ధమవుతుంది.మేకర్స్ తాము అనుకున్న కథ ప్రకారం అలా అనుకోని ఉండొచ్చేమో,కానీ సగటు ప్రేక్షకుడు మోహన్ లాల్ కోసం వస్తారనే విషయాన్ని మర్చిపోకూడదు కదా!ఖురేషి ని ఫస్ట్ ఆఫ్ లో ప్రపంచాన్నే గడగడలాడించే డాన్ గా చూపించారు.కాబట్టి దీనికి పారలాల్ గా నడుస్తున్న కేరళ రాజకీయాల్లోని సమస్యని ఖురేషి చాలా ఈజీ గా సాల్వ్ చేస్తాడనే అభిప్రాయంలోకి ప్రేక్షకులు వచ్చేస్తారు.కాకపోతే ఏ సీన్ కా సీన్ కి సంబంధించిన ఎలివేషన్ మాత్రం చాలా బాగుంది.ఈ విషయమే ప్రేక్షకులకి మూవీ బోర్ కొట్టకుండా చేసింది.సెకండ్ ఆఫ్ లో ఆయినా ఖురేషి ని కేరళ రాజకీయాలకి పరిమితం చేసి ఎండింగ్ ని విదేశాల్లో ప్లాన్ చేసుండాల్సిందేమో. కథనాల్ని వదిలేసి స్టైల్ ఆఫ్ మేకింగ్ కోసం మూవీ తెరకెక్కించినట్టుగా ఉండటం మైనస్ గా పరిగణించవచ్చేమో.కొన్ని కొన్ని సీన్స్ లో అయితే విదేశీ సినిమా చూసినా ఫీలింగ్ కూడా కలిగింది.ముస్లిమ్ కుటుంబాన్ని చంపే సీన్ అయితే ప్రేక్షకుల కళ్ళల్లో కన్నీళ్లు  తెప్పించింది.

నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు
ఖురేషి అబ్రహంగా మోహన్ లాల్(MohanLal)నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.కేవలం ఖురేషి క్యారక్టర్ మాత్రమే కనపడేలా చెయ్యడంలో మోహన్ లాల్  నూటికి నూరుపాళ్లు విజయం సాధించాడు.కాకపోతే స్టీఫెన్ నడుంపల్లి క్యారక్టర్ లో కొంత సేపు కనపడినా కూడా ప్రేక్షకులు ఖురేషి గురించే చెప్పుకుంటారు.పృథ్వీ రాజ్ సుకుమారన్ క్యారక్టర్ ఉన్నా కూడా నటన విషయంలో అంతగా చెప్పుకోవాల్సిన పనిలేదు.యాక్షన్ సీక్వెన్స్ కే పరిమితమయ్యింది.మిగతా క్యారెక్టర్స్ లో చేసిన మంజు వారియర్, టోవినో థామస్, విదేశీ నటులు జెరోమ్ ప్లిన్, బోరిస్ ఆలివర్,ఎరిక్ ఎబోని కూడా బాగా చేసారు.భజరంగ్ క్యారక్టర్ లో విలన్ గా చేసిన అభిమన్యు సింగ్ మరో సారి తన సత్తా చాటాడు. పృథ్వీరాజ్ సుకుమారన్(pruthi Rajsukumaran)డైరెక్షన్ కి  అయితే మంచి మార్కులే పడతాయి.ప్రతి ఫ్రేమ్ ని విభిన్నమైన టేకింగ్ తో ప్రేక్షకులకి నచ్చేలా చేసాడు.కొన్ని షాట్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఫొటోగ్రఫీ మూవీని ఇంకో లెవల్ కి తీసుకెళ్లాయి.నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉండి మూవీ బోర్ కొట్టకుండా చేసాయి.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

కథనానికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా స్టైల్ ఆఫ్ మేకింగ్ కోసం ఎల్ 2  ఎంపురాన్(L2 Empuraan)ని తెరకెక్కించినట్టుగా అనిపిస్తుంది.కాకపోతే రెగ్యులర్ సినిమాలు చూసి విసుగుచెందే వాళ్ళకి నచ్చుతుందేమో.