Read more!

English | Telugu

సినిమా పేరు:కొత్త బంగారు లోకం
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
Rating:3.00
విడుదలయిన తేది:Oct 9, 2008
ఇది అటు టీనేజ్‌నీ, ఇటు తల్లిదండ్రులనూ ఆకట్టుకునే చిత్రం. కథ కొత్తది కాకపోయినా చెప్పిన విధానం చాలా కొత్తగా వుంది. బాలు (వరుణ్‌ సందేశ్‌) కొత్తగా కాలేజీలో చేరి, తనతో పాటే అదే కాలేజీలో చేరిన స్వప్న (శ్వేత బసు ప్రసాద్‌) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ప్రేమకూ, ఆకర్షణకూ మధ్య వున్న తేడా గురించి లెక్చరర్‌ (రావు రమేష్) చెప్పిన థియరీ వరుణ్‌ని, స్వప్ననీ ఆకట్టుకుంది. దాంతో తమ మధ్య వుంది ప్రేమేననీ, ఆకర్షణ కాదనీ ఆ ఇద్దరూ తెలుసుకుంటారు. ఒక శెలవు రోజున ఆ ఇద్దరు ప్రేమికులూ కలిసి కాలేజీ బయట తిరగటానికి వెళ్ళి అక్కడ ముద్దు పెట్టుకుంటూ మీడియాకి దొరికి, తద్వారా ప్రిన్సిపల్‌ (బ్రహ్మానందం)కి దొరికిపోతారు."మీ పేరెంట్స్‌ని తీసుకొస్తే కానీ మిమ్మల్ని కాలేజీలోకి అడుగు పెట్టనివ్వను" అంటాడు ప్రిన్నిపాల్‌. బాలు అసలు ఆ కాలేజీయే మానేసి ఇట్లోనే వుండి చదువుకుంటానంటాడు. కానీ స్వప్న తండ్రి (ఆహుత ప్రసాద్‌) 'చెట్టునిబట్టే ఆయ నిన్ను బట్టే నీ స్టూడెంట్స్‌" అంటే దానికి వళ్ళుమండిన ప్రిన్సిపల్‌ 'నా కాలేజీలో ఇన్ని వేల మంది చదువుతున్నారు. ఒక నీ కూతురే ఇలా చేసిందంటే.. దీన్ని బట్టి చెట్టెవరో నువ్వే ఊహించు" అంటాడు. దాంతో స్వప్న తండ్రి ఆమెను చదువు మాన్పిస్తాడు. ఆ విధంగా విడిపోయిన ప్రేమికులిద్దరూ కలవటానికి నానా ప్రయత్నాలు చేసి, కలుసుకుంటారు. బాలు ఇక భయపడి లాభం లేదని స్వప్న తండ్రి దగ్గరకు వెళ్ళి తానే స్వప్నను ప్రేమిస్తున్నాననీ, స్వప్న కూడా తనను ప్రేమిస్తుందనీ, చదువయిపోగానే తామిద్దరం పెళ్ళి చేసుకుంటామనీ అంటారు. అందుకు సరేనన్న స్వప్న తండ్రి, ఆ తర్వా స్వప్నకు వేరే సంబంధం చూస్తాడు. ఈ విషయం స్వప్న ద్వారా తెలుసుకున్న బాలు... ఆమెతో లేచిపోటానికి నిర్ణయించుకుని, రైల్వే స్టేషన్‌కి రమ్మంటాడు. కానీ ఆ సమయానికే అతని తండ్రి ట్రైయిన్‌ యాక్సిడెంట్‌లో మరణించటంతో బాలు అనుకున్న సమయానికి అక్కడికి చేరుకోలేకపోతాడు.ఆ తర్వాత తను చెప్పినట్టు చదువుకుని ప్రయోజకుడవుతాడు. స్వప్న తండ్రి బాలుని కలసి స్వప్నని బాగా చూసుకుంటాన్నావా..? అని తడుగుతాడు. మరి స్వప్న ఏమయింది..? చెత్తగా వున్న ఈ లోకం 'కొత్తబంగారులోకం" ఎలా అవుతుంది..? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ చిత్రం తప్పక చూడాల్సిందే.
ఎనాలసిస్ :
ఈ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల రచయిత కూడా కావటం వల్ల, చిత్రంలో మాటలు చాలా బాగున్నాయి. టేకింగ్‌ పరంగా బాగుంది అనటం మామూలు విషయం. ఒక్కోసారి మనం మణిరత్నం సినిమా చూస్తున్నామా అన్న ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని ఫ్రేములు ఆ విధంగా వున్నాయి. స్ర్కీన్‌ప్లే చాలా బాగుంది. కథనం అద్భుతంగా వుంది. కథ ఏమీ లేని చిత్రాన్ని అంతగా ఆకట్టుకునేలా తీయడం గొప్ప విషయం. చిన్న చిన్న మైన్యూట్‌ డీటైల్స్‌ కూడా ప్రేక్షకుల మనస్సుల్లో రిజిస్టరయ్యేలా దర్శకుడు చాలా జాగ్రతలు తీసుకున్నారు. ఈ సినిమా లెక్చరర్‌ ప్రేమకీ, ఆకర్ణణకీ మధ్య తేడా తెలుసుకోవటం ఎలా అనే విషయం చెప్పిన విధానం, అలాగే టీనేజ్‌ నుండి 20, 20 నుండి 30, 30 నుండి మిగిలిన వయసులో మనుషుల ఆలోచనలోని మార్పులేవిదంగా వుంటాయో చెప్పిన విధానం చాలా బాగుంది.కన్న కొడుకు తన మాట వినకపోతే ఆ తల్లి పడే బాధ ఎలా వుంటుందో జయసుధ మాటల్లో మనం తెలుసుకోవచ్చు. అలాగే ఒక తండ్రిగా ప్రకాష్రాజ్‌ నటన ఈ చిత్రానికే హైలైట్‌. నేటి యువతకు టీనేజ్‌లో వుండే కన్‌ఫ్యూజన్‌ని దర్శకుడు చక్కగా చూపించాడు. ఇక హీరో వరుణ్‌ సందేశ్‌ నటనలో కొంతమెరుగైనా, అతని డిక్షన్‌లో మన నేటివిటి కొరవడింది. ఆమెరికన్‌ యాస కొట్టొచ్చినట్టు తెలుస్తోంది. ఇక హీరోయిన్‌ శ్వేత ఆ పాత్రకు యాప్ట్‌ అని చెప్పొచ్చు. ఆమె ఈ చిత్రంలో ఫ్రెష్‌గా పరిచయం అయ్యింది. కాబట్టి ఆమెకు తగ్గ పాత్ర లభించింది. కానీ లేకపోతే ఆమె చెల్లెలి పాత్రలు వేసుకోవాల్సి వచ్చేది. ఆమె పర్సనల్జీ, గ్లామర్‌ అలా వున్నాయి. ఆమె నటన అత్యద్భుతం. ఇలాంటి ఒక మంచి మాస్టర్‌ మనందరికీ జీవితంలో ఎక్కడో ఒకచోట తగిలే వుంటాడనిపించేంత సజీవంగా ఆ పాత్రలో అతను జీవించాడు. సినిమా హాల్లోంచి బయటకొచ్చినా ఆ పాత్ర ఏ మాత్రం పోలిక లేకుండా నటించాడతను. ఆహుతి ప్రసాద్‌ని ఇన్నేళ్ళకయినా మన సినీ పరిశ్రమ మంచి నటుడిగా గుర్తించినందుకు, ముందుగా కృష్ణవంశీకి, తర్వాత ఈ చిత్ర నిర్మాత, దర్శకులకు థ్యాంక్స్‌. బ్రహ్మానందం రొటీన్‌కి భిన్నంగా సిరియస్‌ పాత్రలో నటించడం విశేషం. మిగిలిన వారంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. నిర్మాణపు విలువలు బాగున్నాయి. కథను, నటీనటులను, సాంకేతిక నిపులను ఎన్నుకొన్న తీరు, దిల్‌ రాజులోని చాలా తెలివైన నిర్మాతను చూపిస్తాయి.గీతం -మిక్కీ.జె.మేయర్‌ ఖాతాలో మరో సూపర్‌హిట్‌ చిత్రం జమయింది. పాటలన్నీ బాగున్నాయి. ముఖ్యంగా రీ-రికార్డింగ్‌ చాలా బాగుంది.సినిమాటోగ్రఫీ - బాగుంది. రాజమండ్రి, వైజాగ్‌లను అంతందంగా చూపించటం చోటా.కె.నాయుడు వల్లే సాధ్యమయ్యింది. పాటల్లో ఫొటోగ్రఫీ ఇంకా బాగుంది.పాటలు - పాటల్లో చక్కని అర్థవంతమైన సాహిత్యం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ఎడిటింగ్ -చాలా బాగుంది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
తేజ దర్శకత్వంలో వచ్చిన "చిత్రం", భాస్కర్‌ దర్శకత్వంలో వచ్చిన "బొమ్మరిల్లు" చిత్రాలను కలపి, శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చన 'హ్యాపీడేస్‌" చిత్రంలా తీస్తే ఎలా వుంటుందో ఈ చిత్రం అలా వుంది. ఇది పిల్లలూ, పెద్దలూ తప్పకుండా చూడాల్సిన చిత్రం.