Read more!

English | Telugu

సినిమా పేరు:కేక
బ్యానర్: చిత్రం మూవీస్
Rating:2.00
విడుదలయిన తేది:Oct 23, 2008
అర్జున్‌ గోదావరి సమీపంలో వున్న తన తాత గారింటికి వస్తాడు. అక్కడ తన స్నేహితులతో అతను ఎంజాయ్‌ చేస్తుంటే, అక్కడ సుజాత అనే అమ్మాయి అతనికి పరిచయం అవుతుంది. అది ప్రేమగా మారుతుంది. కానీ అ అమ్మాయి అతన్ని ప్రేమిస్తుందో లేదో అర్జున్‌కి తెలియదు. ఇలా వుంటే సుజాతని ఆమె వాళ్ళు హైదరాబాద్‌ పంపిస్తారు. అర్జున్‌ కూడా హైదరాబాద్‌కి వెళతాడు. అక్కడ అర్జున్‌ ఫ్రెండ్‌ కిరణ్‌ అతనికి కాబోయే భార్యగా సుజాతని పరిచయం చేస్తాడు అర్జున్‌కి. కానీ సుజాత అర్జున్‌నే ప్రేమిస్తుంటుంది. ఆమెకు ఇష్టం లేకుండా కిరణ్‌తో ఆమె పెళ్ళి నిర్ణయిస్తారు ఆమె తల్లిదండ్రులు. అర్జున్‌, సుజాతల ప్రేమ విషయం తెలుసుకున్న కిరణ్‌ వాళ్ళని కలపటానికి ప్రత్నం చేస్తుంటాడు. ఇది తెలిసి కిరణ్‌ తండ్రి అతన్ని బెల్టుతో కొడతాడు. దాంతో అర్జున్‌, సుజాతల ప్రేమకు అడ్డుగా వుండటం ఇష్టం లేక కిరణ్‌ ఉరేసుకుంటాడు. కానీ అతన్ని అర్జున్‌ కాపాడి, సుజాతకి, కిరణ్‌కి మధ్య తానుండకూడదని, తన ప్రేమని త్యాగం చేసి, ఎక్కడికో వెళ్ళిపోతారు. ఆ తర్వాతేమయిందనేది తెలుసుకోవాలంటే ఈ చిత్రం తప్పక చూడక్కరలేదు...
ఎనాలసిస్ :
ఈ చిత్ర దర్శకులు తేజకి తెలిసింది ఒకే కథ. దాన్నే మార్చి మార్చి ఇప్పటి వరకూ తీవాడు. కానీ ఈ చిత్రంలో ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ అనిపించేలా తీసేందుకు ప్రయత్నించాడు. కానీ కుదరలేదు. ముందు అలాగే చూపించినా, కిరణ్‌ పాత్రని విలన్ గా మార్చాడు. కన్నాంబ కటింగ్‌లా ఓ కుర్రాడు చేసే ఓవర్‌ యాక్షన్‌ మనకు బాగా చికాకు తెప్పిస్తుంది. హీరోయిన్‌కి ఎవరితో డబ్బింగ్‌ చెప్పించారో కానీ ఆ డైలాగ్‌ మాడ్యులేషన్ అపూర్వం. దానివల్ల ఆ క్యారెక్టర్‌ చచ్చిపోయింది. ఇషానీ నటన ఫర్వాలేదు. కిరణ్‌ పాత్రధారి కూడా ఓ మోస్తరుగా నటించేందుకు ప్రయత్నించాడు. ఇక హీరో పాత్రధారి నటన గురించి ఎంతచెప్పినా తక్కువే. అతను ప్రముఖ గేయరచయిత సీతారామశాస్త్రిగారి తనయుడని తెలిసింది. కుర్రాడు ఒడ్డూ పొడుగూ వున్నా, నటనలో అమెచ్యూరిటీ, కొత్తదనం బాగా కనపడుతుంది. హీరో తల్లి హీరోకన్నా యంగ్‌గా వుండటం బహుశా ఈ సినిమాలోనే చూస్తాం. ఒకమ్మాయి "నన్ను పట్టుకో.. గట్టిగా పట్టుకో... ఇంకా గట్టీగా'' అంటూ ఎంకరేజ్‌ చేయటం... బహుశా దర్శకుడు తేజకి నేటితరం అమ్మాయిల మీద ఉండే చులకన భావం కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు చాలా చాలా మైనస్‌ పాయింట్లున్నాయి ఈ చిత్రం గురించి చెప్పాల్సొస్తే. సంగీతం :- ఒకటి రెండు పాటలు బాగున్నాయి. రీ-రికార్డింగ్‌ ఫరవాలేదు. సినిమాటోగ్రఫీ :- ఎక్స్‌లెంట్‌ ఫొటోగ్రఫీ. ఈ విషయంలో పి.సి.శ్రీరామ్‌ని అభినందించాలి. ముఖ్యంగా మొదటి పాటలో ఫొటోగ్రఫీ చాలా చాలా బాగుంది. మాటలు :- ఏమాత్రం ఆకట్టుకోవు. సినిమా స్టాండర్డ్‌లో లేవు. పాటలు :- పాటల్లో సాహిత్యం ఫరవాలేదు. కొరియోగ్రఫీ:- యావరేజ్‌.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
మీకు జీవితం మీద విరక్తి కలిగి తనువు చాలించాలనుకున్నప్పుడే ఈ సినిమా చూడండి.అంతే కానీ బ్రతుకు మీకు ఆశ ఉన్న వారెవరైనా ఈ సినిమా తప్పక చూడక్కరలేదు.