Read more!

English | Telugu

సినిమా పేరు:కీడా కోలా
బ్యానర్:వి.జి .సైన్మా
Rating:2.50
విడుదలయిన తేది:Nov 3, 2023

సినిమా పేరు: కీడా కోలా 
తారాగణం: తరుణ్ భాస్కర్, చైతన్య రావు, బ్రహ్మానందం, రాగ్ మయూర్, రఘురామ్‌, రవీంద్ర విజయ్‌, జీవన్‌కుమార్‌, విష్ణు, హరికాంత్ తదితరులు
సంగీతం: వివేక్ సాగర్
రచన, దర్శకత్వం:తరుణ్ భాస్కర్
బ్యానర్: వి.జి .సైన్మా  
నిర్మాతలు:కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్
సినిమాటోగ్రఫీ: ఏజే ఆరోన్‌
విడుదల తేదీ:నవంబర్ 3 

పెళ్లి చూపులు సినిమాతో  తన నుంచి వచ్చే సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూసేలా చేసుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. ఈ నగరానికి ఏమైంది అనే సినిమాతో తరుణ్ భాస్కర్  కి ఏమైంది తనలో ఇంత టాలెంట్ పెట్టుకొని వరుసగా సినిమాలు చేయడంలేదని ప్రేక్షకులు భావిస్తూ వచ్చారు.అంతలా తరుణ్  భాస్కర్ దర్శకత్వ ప్రతిభకి యువతరంలో క్రేజ్ ఉంది. ఇప్పుడు రీసెంట్ గా తరుణ్ భాస్కర్ నుంచి కీడా కోలా అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులని ఆకట్టుకుందో చూద్దాం.

కథ

చిన్న వయసులోనే తల్లి తండ్రుల్ని కోల్పోయిన  వాసు (చైతన్య రావు )  తన తాత (బ్రహ్మానందం తో కలిసి మిడిల్ క్లాస్ లైఫ్ ని గడుపుతు ఉంటాడు. వాసుకి ఎలాగైనా పెళ్ళిచెయ్యాలని బ్రహ్మానందం  భావిస్తాడు. కానీ వాసుకి ఉన్న నత్తి వల్ల పెళ్లి అవ్వదు. అలాగే వాసు ఒక కేసు విషయంలో కోర్ట్ కి కొంత డబ్బులు కట్టవలసి వస్తుంది. ఈ క్రమంలో వాసు అతని ఫ్రెండ్ అయిన లాయర్ కౌశిక్ (మయూర్ రాగ్) లు ఒక షాప్ కి వెళ్లి కోకా కోలా,పెప్సీ లాంటి బ్రాండ్ అయిన కీడా కోలా అనే ఒక కూల్ డ్రింక్ ని కొంటారు. అందులో ఒక బొద్దింక ఉంటుంది. దాంతో కౌశిక్ కి ఒక ఐడియా వచ్చి కూల్ డ్రింక్ లో పురుగు ఉందని    కీడా కోలా కంపెనీ నుంచి కోటి రూపాయలు వసూలు చేయవచ్చని వాసు కి చెప్తాడు.

ఇక్కడ అసలు విషయం ఏంటంటే కీడా కోలా లో బొద్దింక వేసింది నాయుడు(తరుణ్ భాస్కర్ ) రౌడీ గా బతికిన నాయుడు 20 సంవత్సరాల తర్వాత జైలు నుంచి విడుదలయ్యి మంచి వాడిగా బతుకుతు తన తమ్ముడు జీవన్ ని కార్పొరేటర్ ని చెయ్యడానికి  చివరి మోసం అని చెప్పి కీడా కోలా లో పురుగు ని వేస్తాడు. ఆ కీడా కోలా వాసు దగ్గర ఉంటుంది. దీంతో నాయుడు వాసు ఫ్రెండ్  కౌశిక్ ని కిడ్నాప్  చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే మిగతా కథ.


ఎనాలసిస్ :

కీడా కోలా  కామెడీ గా సాగే క్రైమ్ థ్రిల్లర్ కథ.  ఇలాంటి కథలకి పకడ్బందీ స్క్రీన్ ప్లే తో పాటు అదిరిపోయే డైలాగ్స్ ఉంటే సినిమా  ఒక రేంజ్ కి వెళ్తుంది. అలాగే సినిమా రన్  అయ్యే కొద్దీ నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ  ని కూడా ప్రేక్షకులకి కలిగించాలి. కానీ కీడా కోలా కథ ప్రారంభం అయిన పావు గంటకే సినిమా ఎలా ఉండబోతుందో ముందుగానే ప్రేక్షకులకి అర్ధం అవుతుంది. అలాగే  క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో పాత్రల యొక్క స్వభావం కూడా  ప్రేక్షకులకి అర్ధం కాకూడదు. కానీ ఈ మూవీలో పాత్రల స్వభావం ప్రేక్షకులకి ముందుగానే తెలుస్తుంది. 

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు

ఈ కీడా కోలా లో చేసిన అందరు నటీనటులు కూడా సూపర్ గా చేసారు. నాయుడు క్యారక్టర్ లో తరుణ్ భాస్కర్ సూపర్ గా చేసాడు. తను సీరియస్ గా ఉంటూనే తన మాటలు,బాడీ లాంగ్వేజ్  ద్వారా కామెడీ ని సూపర్ గా పండించాడు. చైతన్య రావు , జీవన్, రాగ్ మయూర్, బ్రహ్మానందం  గెటప్ శ్రీను (జబర్దస్ ఫేమ్) లు కూడా తమ క్యారక్టర్ లో లీనమయ్యి సూపర్ గా నటించారు. ముఖ్యంగా నాయుడు,జీవన్ ,అతని అసిస్టెంట్ ల మధ్య వచ్చే ఇంగ్లీష్ కామెడీ సూపర్ గా ఉంది. మరి ముఖ్యంగా  క్రైమ్ థ్రిల్లర్ కథలకి ప్రాణమైన ఫోటోగ్రఫీ సూపర్ గా ఉంది ఏజే ఆరోన్‌ అందించిన ఫొటోగ్రఫీ ప్రేక్షకులని చివరివరకు  థియేటర్లో కూర్చోబెడుతుంది. వివేక్ సాగర్ నేపధ్య సంగీతం సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచింది.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

పెళ్లి చూపులు,ఈ నగరానికి ఏమైంది లాంటి విభిన్న చిత్రాలని పర్ఫెక్ట్ లాజిక్ తో అద్భుతమైన స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి విజయం సాధించిన తరుణ్ భాస్కర్ ఈ కీడా కోలా మూవీ విషయం లో కూడా పర్ఫెక్ట్  స్క్రీన్ ప్లేతో పర్ఫెక్ట్ లాజిక్స్ తో తెరకెక్కించి ఉంటే ఖచ్చితంగా కీడా కోలా ప్రేక్షకులని మరింతగా ఆకట్టుకొనేదేమో. ఒక బొద్దింకని లేదా ఒక పురుగు ని హిందీ లో కీడా అని అంటారు. హీరోయిన్ లేని సినిమా ఈ కీడా కోలా మూవీ 

                                                                                                      - అరుణాచలం