Read more!

English | Telugu

సినిమా పేరు:కేడి
బ్యానర్:కామాక్షీ మూవీస్
Rating:2.25
విడుదలయిన తేది:Feb 12, 2010
రమేష్ అలియాస్ రమ్మి (నాగార్జున), అర్షద్ (హర్షవర్థన్) ఇద్దరూ కలిసి మోసాలకు పాల్పడుతూ జల్సాగా తిరుగుతూ ఉంటారు. వారిని పట్టుకోవడం కోసం ఎసిపి శేఖర్ (షాయాజీ షిండే) తీవ్రంగా ప్రయత్నిస్తుంటాడు. ఆయన కన్నుగప్పి రమ్మి గోవా చేరుకుంటాడు. అక్కడ ఓ క్లబ్ ని రన్ చేస్తూ స్మగ్లింగ్ కూడా చేసే చంద్ర (అంకుర్ వికల్)తో రమ్మికి పరిచయమవుతుంది. చంద్ర చెప్పిన స్మగ్లింగ్ పనులని చేస్తూ ఉంటాడు రమ్మి. ఇలా ఉండగా అనుకోకుండా జానకి (మమతా మోహన్ దాస్) రమ్మీకి భార్యగా నటించాల్సి వస్తుంది. జానకి రమ్మీ చిన్నతనంలో ప్రాణప్రదంగా ప్రేమించిన అమ్మాయి. తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయే జానకి అని తెలుసుకునే సమయంలో రమ్మీకి చంద్రకి మధ్య విరోధం ఏర్పడుతుంది.. ఆ తర్వాతేం జరిగిందన్నదే మిగతా కథ.
ఎనాలసిస్ :
మహాశివరాత్రి పర్వదినాన విడుదలయిన ఈ చిత్రం నాగార్జున అభిమానులకి కాస్త నిరాశపరచవచ్చు. స్టార్ హీరో నాగార్జున, స్టార్ ప్రొడ్యూసర్ డి. శివప్రసాదరెడ్డిల భారీ కాంభినేషన్ లభించినా దాన్ని సద్వినియోగ పరుచుకోవడంలో దర్శకుడు విఫలమయ్యాడని అనిపిస్తుంది. సినిమా ఎంతో రిచ్ గా కనిపించినా, నాగ్ చూడ్డానికి ఎంతో యంగ్ లుక్ తో కనిపించి ఆయన పెర్ఫార్మెన్స్ ఎంతో బాగున్నప్పటికీ దర్శకుడు కథ, కథనాలలో మరింత శ్రద్ధ కనబర్చి ఉంటే బావుండేది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన-: నాగార్జున నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు.. ఆయన ఏ పాత్రలోనయినా ఇట్టే ఒదిగిపోతారు. ముఖ్యంగా ఈ చిత్రంలో నాగ్ మరింత గ్లామర్ గా కనిపించాడు. ఫైట్స్ లోనూ, సాంగ్స్ లోనూ, నటనలోనూ క్లాస్, మాస్ నుఆకట్టుకునే విధంగా ఆయన నటన ఉంటుంది.మమతా-: జానకి పాత్రలో ఫర్వాలేదనిపించుకుంది.హర్షవర్థన్-: నాగార్జున ఫ్రెండుగా ఈ చిత్రంలో హర్షవర్థన్ ది కీలక పాత్రే. అయితే ఈ పాత్రలో హర్షవర్థన్ చాలా చక్కగా నటించాడు.షాయాజీ షిండే-: పోలీసాఫీసర్ పాత్ర షాయాజీషిండేకి కొత్త కాకపోయినా ఈ చిత్రంలో నాగార్జున, షాయాజీ షిండేల మధ్యలో వచ్చే సీన్లు బావున్నాయి.బ్రహ్మానందం-: కామెడీని పండించడంలో ఆయనకి ఆయనే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు. ముఖ్యంగా కోయదొరగా కనిపించే ఓ సీన్ లో బ్రహ్మానందం ఆద్యంతం హాస్యాన్ని కురిపించారు.అంకుర్ వికల్-: చంద్ర పాత్రలో డిఫరెంట్ గా నటించాడు అంకుర్. చిరునవ్వు చిందిస్తూనే కసాయి పనులని చేస్తూ కనిపించే చంద్ర నటన బాగుంది.ఓ స్పెషల్ సాంగ్ లో అనుష్క కనిపించి మెరిపించింది.ఎడిటింగ్-: ఫర్వాలేదుసాంగ్స్-: పాటలు బాగున్నాయి. ముఖ్యంగా రిమిక్స్ సాంగ్ "ము.. ము.. ముద్దంటే చేదా...." సాంగ్ యుత్ ని ఆకట్టుకుంటుంది.డాన్స్-: డాన్స్ బావున్నాయి.యాక్షన్-: నాగ్ కి తగ్గట్టుగా యాక్షన్ ఎపిసోడ్స్ ని రూపొందించారు. ఓ క్లబ్ లో తీసిన ఫైట్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. సంగీతం-: ఫర్వాలేదునాగార్జున నటన కోసం ఈ చిత్రం చూడొచ్చు.