Read more!

English | Telugu

సినిమా పేరు:కత్తి కాంతారావ్
బ్యానర్:బిగ్ బి ప్రొడక్షన్స్
Rating:2.75
విడుదలయిన తేది:Dec 10, 2010
ఇద్దరు అక్కలు, ఇద్దరు చెల్లెళ్ళు, తల్లి, తండ్రి ఇది కత్తి కాంతారావు(నరేష్)కుటుంబం.ఈ కుటుంబం మొత్తాన్ని అతని ఒక్కడి సంపాదన మీదే నడపాలి.పెళ్ళిళ్ళయిన అక్కలు ఇంట్లోనే ఉంటారు.కారణం బావల గొంతెమ్మ కోరికలు తీర్చకపోవటం.వాటిని తీర్చి ఇద్ద్రరు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి.ఇవన్నీ తన కానిస్టేబుల్ ఉద్యోగం మీద వచ్చే ఆదాయంతోనే చేయాలి.ఇవన్నీ చేస్తే కానీ అతను పెళ్ళిచేసుకోవటం కుదరకుండా వాళ్ళ నాన్న ఒక ఎగ్రిమెంట్ వ్రాయించుకుంటాడు కాంతారావు చేత.అందుకే తను కోరిన అమ్మాయిని పెళ్ళిచేసుకున్నా ఆ విషయాన్ని బయటపెట్టకుండా మేనేజ్ చేస్తుంటాడు కత్తి కాంతారావు.ఒక చెల్లికి ఐ.జి.కొడుకుతో,మరొక చెల్లిని తన తోటి కానిస్టేబుల్ తో కత్తి కాంతారావు ఎలా పెళ్ళిచేశాడన్నది మిగిలిన కథ.
ఎనాలసిస్ :
హాస్యప్రథాన చిత్రాలను తీయటంలో ఇ.వి.వి.సత్యనారాయణకున్న అనుభవం అపారం.కథలో దమ్ములేకపోయినా తన దర్శకత్వం ప్రతిభ చేత గతంలో ఎన్నో సినిమాలను ఆయన హిట్ చేశాడు.తనకెదురైన ప్రతి ప్రతికూల పరిస్థితినీ తనకనుకూలంగా మార్చుకునే కాంతారావు క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.తన చెల్లెళ్ళకు పెళ్ళి చేయటంలో అతను చూపించే తెలివితేటలుప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.సినిమా ఫస్ట్ హాఫంతా సిటీ వాతావరణంలో జరిగితే సెకండ్ హాఫ్ గ్రామీణ నేపథ్యంలో ఎన్నికలు,పెళ్ళిసాంప్రదాయాల నేపథ్యంలో జరుగుతుంది.ఎన్నికల్లో గెలవటానికి కోట పాత్ర పడే పాట్లు నవ్వుతెప్పిస్తుంది.అలాగే ధర్మవరపు సుబ్రహ్మణ్యం కూడా జగ్గయ్యని ఇమిటేట్ చేస్తూ చెప్పే డైలాగులు కూడా మనల్ని నవ్విస్తాయి.ఐ.జి.గా చలపతిరావు,చికెన్ తినే పంతులుగా రఘుబాబు,కాంతారావు బావలుగా కృష్ణ భగవాన్,శ్రీనివాసరెడ్డి,వేణు మాధవ్,యస్.ఐ.గా జీవా తదితరులు వాళ్ల వాళ్ళ పాత్రల పరిథి మేరకు నవ్వించే ప్రయత్నం చేశారు.హీరో నరేష్ తన పాత్రను యధాశక్తి బాగా పోషించాడు.ఇలాంటి పాత్రలు అతనికి కొట్టిన పిండి.ఇలాంటి పాత్రల్లో అతను గతంలో చాలా సినిమాల్లో నటించాడు.ఇక కామ్నా జెఠ్మలానీ తన పాత్రకు బాగానే న్యాయం చేసింది.ఈచిత్రం నిర్మాణపు విలువలు బాగున్నాయి. సంగీతం- గాయకుడు మల్లికార్జున్ కిది సంగీత దర్శకుడిగా తొలి చిత్రం.ఈ చిత్రంలోని పాటలు అద్భుతంగా లేకపోయినా చండాలంగా మాత్రం లేవు.కానీ కొన్ని ట్యూన్లు ఎక్కడో విన్నట్టుగా ఉంటాయి.ముఖ్యంగా "చందమామ"చిత్రంలోని "సక్కుబాయినే" అనే పాట మోడల్లో ఈ చిత్రంలోని ఒక పాట ఉండటం విశేషం.ఇక రీ-రికార్డింగ్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ - ఈ చిత్రంలోని కేమెరా వర్క్ బాగుంది.కళ్ళకు ఏమాత్రం శ్రమ లేకుండా ఈ చిత్రంలోని ఫొటోగ్రఫీ ఉంది. మాటలు - ప్రసాద వర్మ మాటలు యావరేజ్ గా ఉన్నా అక్కడక్కడా కొన్ని పంచ్ లు పేలాయి. పాటలు - వనమాలి, రామజోగయ్య శాస్త్రి వ్రాసిన పాటల్లో సాహిత్యం ఫరవాలేదు.అర్థమవుతోంది. ఎడిటింగ్ - బాగుంది. ఆర్ట్ - ఒ.కె. కొరియోగ్రఫీ - ఫరవాలేదు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఇది గొప్ప హాస్యరసచిత్రమైతే కాదు.కానీ ఈ సినిమాలో నవ్వించే సందర్భాలు చాలానే ఉన్నాయి.ఇ.వి.వి.మార్కు కామెడీ ఈ చిత్రంలోకొద్దో గొప్పో ఉంటుంది.అలాగే అసభ్యకర,అభ్యంతరకర దృశ్యాలు పెద్దగా లేకపోవటం వల్ల ఈ సినిమాని సకుటుంబంగా చూడవచ్చు.