Read more!

English | Telugu

సినిమా పేరు:కాస్కో
బ్యానర్:కె.ఫిలిమ్స్
Rating:2.00
విడుదలయిన తేది:Dec 25, 2009
వంశీ ఉరఫ్‌ పవన్‌కళ్యాణ్‌ (వైభవ్‌) కొత్తగా హైదరాబాద్‌ వస్తాడు. అక్కడ మహేష్‌బాబు (బ్రహ్మానందం)తో పవన్‌గా పరిచయం పెంచుకుంటాడు. హైదరాబాదులోని గూండాయిజాన్ని అంతమొందించాలన్నది మహేష్‌బాబు లక్ష్యం. దాంతో మహేష్‌బాబు శిష్యుడిగా పవన్‌ కూడా అందుకు సహకరిస్తుంటాడు. వీరిద్దరూ మరో గూండా జె.పి. (జయప్రకాష్‌)కి అడ్డుగా వస్తుంటారు. జె.పి. అనుచరుడయిన సలీమ్‌ని పవన్‌ అంతమొందిస్తాడు. ఇంతకీ ఈ గూండాలకి పవన్‌కి సంబంధమేమిటంటే.‌.పవన్‌ హైదరాబాద్‌కి రాకముందు అక్కడ రేడియో జాకీగా పనిచేస్తున్న కృష్ణవేణి (శ్వేతాబసుప్రసాద్‌)ని ప్రేమిస్తాడు. ఆమె కూడా పవన్‌ని ప్రేమిస్తుంది. తన ప్రేమవిశయం తెలిపేందుకు వచ్చిన కృష్ణవేణిని సలీమ్‌ మరో గూండా ఇద్దరూ కిడ్నాప్‌ చేస్తారు. ఇంతకీ ఆమెని వారు ఎందుకు కిడ్నాప్‌ చేసారు. ఆమెని వెతుక్కుంటూ హైదరాబాద్‌ వచ్చిన పవన్‌ కృష్ణవేణిని ఎలా కాపాడుకున్నాడన్నది మిగతా కథ..
ఎనాలసిస్ :
ప్రేయసిని వెతుక్కుంటూ హీరో రావడం, ఎన్నో సాహసాలు చేసి ప్రేయసిని దక్కించుకోవడం అన్న పాయింటుతో ఇప్పటికే ఎన్నో చిత్రాలు వచ్చాయి. ఇదే పాయింటుతో వచ్చిన ఈ కాస్కో చిత్రం జస్ట్‌ యావరేజ్‌గా నిలుస్తుంది. ఎందుకంటే స్క్రీన్‌ప్లేలో అక్కడక్కడా కొన్ని లోపాలు, ఇంట్రవెల్‌ వరకూ మెయిన్‌ కథలోకి రాకుండా సాగదీయడం వంటివి ఈ సినిమాకి మైనస్‌.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన : వైభవ్‌ నటన బాగా చేసాడు. ముఖ్యంగా మాస్‌ ప్రేక్షకులని ఆకట్టుకోవడానికి ఈ చిత్రంలో ఆయన చాలా కష్టపడ్డాడు. ఫైట్స్‌, డాన్స్‌ విషయంలో ఆయనలో ఇంప్రూవ్‌ కనిపిస్తుంది. సరయిన కథలని ఎంచుకుంటే తప్పకుండా మంచి హీరోగా ఎదుగుతాడు. హీరోయిన్‌ శ్వేతాబసుప్రసాద్‌ చాలా గ్లామర్‌గా కనిపించింది. అయితే ఆమె కాస్త లావు తగ్గించుకుంటే బావుటుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో మహేష్‌బాబుగా నటించిన బ్రహ్మానందం పాత్ర ఆకట్టుకుంటుంది. మహేష్‌బాబు అనే పేరు వినగానే మహేష్‌బాబుని ఇమిటేట్‌ చేసే సీన్లు ఉంటాయని అనుకున్నా అలాంటివేవీ పెట్టలేదు. మిగతా నటులు కూడా బాగానే చేసారు. ఫైట్స్‌ : సెల్వ గణేషన్‌ రూపొందించిన ఫైట్స్‌ మాస్‌ ప్రేక్షకులని అలరిస్తాయి. సంగీతం : ప్రేమ్‌జీ అందించిన సంగీతం యావరేజ్‌గా ఉంది. "అమ్మాయి పేరు కృష్ణవేణి' సాంగ్‌ బావుంది. కెమెరా : నీట్‌గా ఉంది. పాటల చిత్రీకరణలో కెమెరా పనితనం కనిపిస్తుంది. దర్శకత్వం : బావుంది.