Read more!

English | Telugu

సినిమా పేరు:కర్మ
బ్యానర్:థౌజండ్ లైట్స్ ఇండియా/అమెరికా
Rating:---
విడుదలయిన తేది:Nov 26, 2010
అమెరికాలో ఒక తెలుగు వ్యక్తి,ఒక దేవాలయ అభివృద్ధికి తానిచ్చిన మూడు లక్షల డాలర్లు గంజాయి సాగుకోసం వాడుతున్నారన్న అనుమానం వ్యక్తం చేసినందుకు అతన్ని ఆ గుడి ముందే చంపేస్తారు.అలా చిన్నప్పుడు అయిదేళ్ళ వయసులో తన తండ్రిని ఒక పూజారి చంపటం చూసిన ఒక భారతీయ పద్మ అనే పాపకు దేవుడు మంచి వాడైన తన తండ్రిని కాపాడలేకపోయాడన్న కోపంతో దేవుడంటే నమ్మకం పోతుంది.ఆమె తన అమ్మతో కలసి ఉంటూ మెడిసన్ చదువుతూంటుంది.తన తల్లి కూడా మరణించటంతో ఒంటరిని అన్న భావనతో జీవితం గడుపుతున్న పద్మకు ఇండియా నుండి తన కోసం ఎవరో వచ్చారని తెలుస్తుంది.ఒక తల్లీ,కొడుకు ఇండియానుండి ఆమె కోసం వస్తారు.ఆ తల్లి తన తల్లికి స్నేహితురాలు.ఆమె కొడుకు దేవ్.నా తల్లి చనిపోయిందని మీకెలా తెలుసని ఆమెనడిగితే,తన కొడుకు ద్వారా తెలిసిందని ఆం సమాధానం చెపుతుంది.ఆమె తన కొడుక్కి భవిష్యత్తు ఒక్కోసారి ముందే తెలుస్తుంది.ఈ కబురు కూడా తనకు అలాగే తెలిసిందని ఆమె చెపుతుంది.కానీ ఇదెలా సాధ్యం అంటే ఆ శక్తి అతనికి భక్తి నుండి వచ్చిందంటాడు.అమెరికాలో కలి పురుషుణ్ణి ఆరాధించే ముఠా ఒకటుంటుంది.ఈ లోకంలో పాపం,అన్యాయం,అధర్మ బాగా పెరగాలన్నదే వారి థ్యేయం.వారు నరమాంస భక్షకులు.ఒకసారి అనుకోకుండా దేవ్ ఆత్మహత్య చేసుకున్న పద్మ స్నేహితురాలిని తిరిగి బ్రతికిస్తాడు.మరోసారి ఆ ముఠాలో ఒక సభ్యుణ్ణి చంపి,పద్మ స్నేహితుడి కొడుకుని కాపాడతాడు.ఒక సందర్భంలో తనకు తెలియకుండానే దేవ్ ని ప్రేమిస్తున్న పద్మ అతనిలోని శక్తులు పోవాలని కోరుకుంటుంది.తన సభ్యుణ్ణి దేవ్ చంపాడని తెలిసి ఆ ముఠా నాయకుడు రాజ్ అనే వ్యక్తి దేవ్ ని చంపాలనుకుంటాడు.ఆ దిశలో భాగంగా అతను పద్మను కలి పురుషుడికి బలివ్వటానికి కిడ్నాప్ చేస్తాడు.పద్మ గతానికి రాజ్ కీ ఉన్న సంబంధం ఏమిటి...? మరి దేవ్ పద్మని కాపాడగలిగాడా...?చివరికి ఏం జరిగిందనేది మిగిలిన కథ.
ఎనాలసిస్ :
విశ్లేషణ - రొటీన్ కి భిన్నంగా ఉండే ఇదొక కొత్త కథ.మరింత కొత్త కథనంతో తీశారు.ఒక విధంగా చెప్పాలంటే హీరో,హీరోయిన్ స్టెప్పులు,డ్యూయెట్లు,అర్థం పర్థం లేని ద్వందర్థాల కామెడీ ఇవన్నీ ఈ చిత్రంలో ఎక్కడా కనపడవు.సినిమా కాస్త నిదానంగా ఉన్నాఇది కచ్చితంగా రొటీన్ కి వ్యతిరేకంగా ఉండే విభిన్నమైన చిత్రమని చెప్పవచ్చు.అసలు ఈ చిత్రం కాన్సప్టే వెరైటిగా ఉంటుంది.భగవద్గీతలో శ్రీ కృష్ణుడు "నీ పని నీవు నిజాయితీగా చేయి.ఫలితం నాకొదిలి పెట్టు.పనిచేయటం మీదే నీకు అధికారం ఉంటుంది కానీ దాని ఫలం మీద కాదు"అన్న మాటకూ,"యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతః "అన్నమాటలకు ఈ చిత్రం దృశ్య రూపంగా కనిపిస్తుంది.కాకపోతే దర్శకుడి ఆలోచనా విధానం చాలా హైస్టాండర్డ్స్ తో ఉండటం,అలాగే ఈ చిత్రాన్ని తీయటం వల్ల ఈ చిత్రం సామాన్య ప్రేక్షకులకు ఎంతవరకూ అర్థమవుతుందనేది ఆలోచించాల్సిన విషయం.దర్శకుడిగా,హీరోగా శేషు అడవి ఈ చిత్రం కోసం ద్విపాత్రాభినయం చేశాడు.హీరోగా తెరమీద చాలా గ్లామరస్ గా కనిపించాడతను.అలాగే హీరోయిన్ జేడ్ కూడాఅందంగా కనిపిస్తుంది.లొకేషన్లు కూడా చాలా ఫ్రెష్ గా కన్నుల విందుగా కనిపిస్తాయి.స్క్రీన్ ప్లే కూడా చాలా భిన్నంగా ఉండేలా జాగ్రత్తపడ్డాడు శేషు.అతని నటన కూడా చాలా వెరైటీగా ఉంటుంది.ఈ సినిమాలో ఎక్కడా అరవటాలూ,గర్జించటాలూ,గాండ్రించటాలు,తొడలు కొట్టుకోవటాలూ,జబ్బలు చరిచి ఛాలెంజ్ చేసుకోవటాలు గట్రాల వంటివి ఏవీ ఉండవు.కూల్ గా స్టైలిష్ గా ఈ సినిమా ఉంటుంది.ఇక ఈ చిత్రంలోని గ్రాఫిక్స్ చాలా నీట్ గా ఎంతవరకూ వాడాలో అంతవరకే వాడటం చాలా బాగుంది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
సంగీతం-రొటీన్ కి భిన్నంగా కాస్త వినసొంపుగా ఉండే సంగీతం ఈ చిత్రంలో ఉంది.ఈ చిత్రంలోని అన్ని పాటలూ బాగున్నా ముఖ్యంగా టైటిల్‍ సాంగ్ "కర్మ"శ్రోతలనే కాదు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుంది.రీ-రికార్డింగ్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ - ఎక్స్ లెంట్‍ గా ఉంది.కొన్ని ఏరియల్‍ షాట్స్ అద్భుతంగా ఉన్నాయి.అలాగే లైటింగ్ కూడా అలానే ఉంది. మాటలు - అవసరమైనంతమేరకే,అర్థవంతంగా ఈ చిత్రం లోని మాటలున్నాయి. పాటలు - తోలి పాటలోని సాహిత్యం యువతకు ఉత్తేజాన్ని కలిగించే సందేశంతో ఉంది.మిగిలిన పాటల్లో కుడా సాహిత్యం బాగుంది. ఎడిటింగ్ - బాగుంది. ఆర్ట్ - చాచా చాలా బాగుంది. కొరియోగ్రఫీ - సహజంగా, సింపుల్ గా ఉంది. యాక్షన్ - సహజంగా ఉండటం వల్లనేమో అద్భుతంగా లేకపోయినా ఫరవాలేదనిపించే స్థాయిలోనే ఉంది. రొటీన్ కు భిన్నంగా ఉండేలా,ఒక వెరైటీ చిత్రం చూడాలనుకుంటే,ఈ చిత్రం కాన్సెప్ట్ ని అర్థం చేసుకోగలిగితే ఈ సినిమా మీరు చూడొచ్చు.