English | Telugu
బ్యానర్:మహాసెన్ విజువల్స్
Rating:2.00
విడుదలయిన తేది:Nov 7, 2025
సినిమా పేరు: కృష్ణలీల
తారాగణం: దేవన్, ధన్య బాలకృష్ణ, తులసి, బబ్లూ పృథ్వీ,వినోద్ కుమార్,గగన్ విహారి తదితరులు
మ్యూజిక్: భీమ్స్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
రచన: అనిల్ కిరణ్
దర్శకత్వం: దేవన్
సినిమాటోగ్రాఫర్: సతీష్ ముత్యాల
బ్యానర్ : మహాసెన్ విజువల్స్
నిర్మాత: జ్యోత్స
విడుదల తేదీ: నవంబర్ 7 2025
నూతన కథానాయకుడు 'దేవన్'(Devan)స్వీయ దర్శకత్వంలో 'ధన్య బాలకృష్ణ'(Danya Balakrishna)హీరోయిన్ గా తెరకెక్కిన మూవీ 'కృష్ణలీల'(Krishna leela). ఫాంటసీ, రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కడంతో పాటు ప్రచార చిత్రాలు కూడా ఆసక్తికరంగా ఉండటంతో ప్రేక్షకుల్లో కృష్ణలీల రిజల్ట్ పట్ల ఆసక్తి ఏర్పడింది. మరి మేకర్స్ మూవీని ఎలా తెరకెక్కించారో చూద్దాం.
కథ
విహారి(దేవన్) యోగా ప్రక్రియకి సంబంధించిన ప్రక్రియలో గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదిస్తాడు. ఎంతో మంచి వ్యక్తి తో పాటు ఆడవాళ్ళని, పెద్ద వాళ్ళని గౌరవించే మెంటాలిటీ విహారి సొంతం. బృంద(ధన్య బాలకృష్ణ) రాజకీయంగా పెద్ద పలుకుబడి కలిగిన హోమ్ మినిస్టర్(వినోద్ కుమార్) కూతురు. మగవాళ్లంటే చాలా కోపం.అణువణువున అహంకారాన్ని తన ఆభరణంగా మలుచుకున్న యువతి. చిన్నసైజు రౌడీ కూడా. బృంద ని తొలిచూపులోనే విహారి ప్రేమిస్తాడు. పైగా తనకి బృందకి గత జన్మలోనే అనుబంధం ఉందని బలంగా నమ్ముతాడు. కానీ బృంద మాత్రం విహారి ప్రేమ ని యాక్సెప్ట్ చెయ్యదు. ఈ విషయంలో విహారి చావుల దాకా కూడా వెళ్లి వస్తాడు. విహారి ఒక రోజు పోలీస్ స్టేషన్ కి వచ్చి దాక్షాయణి అనే ఒక అమ్మాయిని హత్య చేసానని చెప్తాడు. విహారి హత్య చేసిన దాక్షాయణి ఎవరు? ఎందుకు చంపాడు? ఒక వేళ చేస్తే అందుకు ఏమైనా కారణం ఉందా? దాక్షాయణి ఎవరు? బృంద కి దాక్షాయణి కి సంబంధం ఏంటి? బృంద తో ప్రేమ ఏమైంది? విహారి ని తన లైఫ్ లోకి ఆహ్వానించిందా? విహారి చెప్తున్న గత జన్మ ఎంతవరకు నిజం? అసలు కృష్ణలీల అంటే ఏంటి అనేదే చిత్ర కథ.
ఎనాలసిస్ :
కృష్ణలీల కి ఎంచుకున్న సబ్జెట్ మంచిదే. కర్మ సిద్ధాంతం ప్రకారం ఒక మనిషికి, ఇంకో మనిషికి మధ్య ఏర్పడిన అనుబంధం వెనక గత జన్మ ప్రభావం ఉంటుందని చెప్పడం బాగుంది. కానీ గత జన్మలో జరిగింది తెలుసుకున్న విహారి, బృంద ప్రేమ కోసం పరితపించడాన్ని సీన్స్ గా ఎందుకు ఎస్టాబ్లిష్ చెయ్యలేదో అర్ధం కాదు. సినిమా ఉద్దేశ్యం అదే కదా! అలాంటిది మేకర్స్ ఈ విషయాన్నీ చాలా తేలిగ్గా తీసుకున్నారు. కథకి ఆయువు పాటు గా నిలిచే పాయింట్స్ కి ఎలివేషన్స్ ఇవ్వకుండా చిన్న చిన్న విషయాలని ఎలివేషన్ ఇచ్చారు. సినిమా మొత్తం ఇదే సూత్రాన్ని ఫాలో అవుతు కథనాలకి అన్యాయం చేసారు.
అలా కాకుండా స్క్రిప్ట్ ని పకడ్బందీగా తెరకెక్కించి ఉంటే మంచి చిత్రంగా మిగిలేది. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే సినిమా ప్రారంభం నుంచి మొదటి పదిహేను నిముషాలు ఎంతో ఇంట్రెస్ట్ కలిగింది. కానీ ఆ తర్వాత నుంచి సినిమా నిదానంగా గాడి తప్పుతు వచ్చింది. కొన్ని కొన్ని సీన్స్ అయితే ఎందుకు వస్తున్నాయో అర్ధం కాదు. సన్నివేశాల్లో బలం ఉన్నా కూడా డైలాగ్స్ బాగోకపోవడంతో మెప్పించలేకపోయాయి. టోటల్ గా చెప్పాలంటే విహారి, ఫ్యామిలీ మధ్య వచ్చే సన్నివేశాలు మాత్రమే బాగున్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగానే ఉంది.
సెకండ్ హాఫ్ లో వచ్చిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రం చాలా బాగుంది. ప్రతి సన్నివేశం ఇంట్రెస్ట్ గా ఉండటంతో పాటు సినిమా మొత్తానికి కూడా ఫ్లాష్ బ్యాక్ ప్రాణంగా నిలిచింది. మినిస్టర్ ని ట్రాప్ చేసే సన్నివేశం ప్లేస్ మెంట్ కుదరలేదు. ప్రేమ కోసం కోర్టుకి వెళ్లే ఎపిసోడ్ ఎంతో కొత్తగా ఉంది. కానీ సన్నివేశాలుగా తీర్చిదిద్దడంలో విఫలమయ్యారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కి సంబంధించిన సన్నివేశాల్లో కూడా ఇదే పరిస్థితి. సీన్ యొక్క ఉద్దేశ్యంలో బలం ఉన్నా పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేయలేకపోయారు.
నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు
విహారిగా, శివస్వామి గా దేవన్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా శివ స్వామిగా సూపర్ గా చేసాడు. కాకపోతే డైలాగ్స్ చెప్పే విషయంలో తడపడ్డాడు. టోటల్ గా పర్లేదనే స్థాయిలో దేవన్ పెర్ ఫార్మెన్స్ ఉంది. దర్శకుడు కూడా తనే కాబట్టి ఆ శాఖలో మెరుపులు లేకపోయినా పర్వాలేదని అనిపించాడు. ధన్య బాలకృష్ణ మాత్రం బృంద, దాక్షాయణి గా రెండు విభిన్నమైన క్యారక్టర్ లలో ఒక రేంజ్ పెర్ ఫార్మెన్సు ని ప్రదర్శించింది. ముఖ్యంగా దాక్షాయణి గా ఎక్సలెంట్. ఆమె ఎన్ని సినిమాలు చేసినా, ఈ క్యారక్టర్ ఆమె సినీ చాట్ లో మెమొరీబుల్ గా మిగిలిపోతుంది. సీనియర్ ఆర్టిస్ట్స్ వినోద్ కుమార్, బబ్లూపృథ్వీ, తులసి లు తమకి నటనలో తిరుగులేదని మరోసారి నిరూపించారు. మిగతా క్యారెక్టర్స్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. హైదరాబాద్ లోని హై కోర్ట్ న్యాయవాది అయిన అనిల్ కిరణ్ కథ విషయంలో సక్సెస్ అయ్యారు. కానీ మాటలు సింక్ అవ్వలేదు. స్క్రీన్ పై పరంగా కూడా తడపడ్డారు. భీమ్స్ (Bheems)నుంచి సాంగ్స్ ఒక మోస్తరుగా పర్వాలేదని అనిపించాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం నామమాత్రం. నిర్మాణ విలువలు, ఫొటోగ్రఫీ ప్రధాన హైలెట్ గా నిలిచాయి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఫైనల్ గా చెప్పాలంటే కథ ముమ్మట్టికి మంచిదే. కానీ కథనం, డైలాగ్స్ విషయంలో మరింత శ్రద్ద వహించాల్సింది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బెటర్