English | Telugu

సినిమా పేరు:జంక్షన్
బ్యానర్:లియో ఎంటర్ టైన్ మెంట్స్
Rating:---
విడుదలయిన తేది:Jun 26, 2009
బ్యానర్:లియో ఎంటర్ టైన్ మెంట్స్
Rating:---
విడుదలయిన తేది:Jun 26, 2009
ఇదీ ఒక జంక్షన్ కథ. అక్కడుండే అనాథల కథ. ఆ అనాథలకు, ఆ జంక్షన్‌కీ రాజన్న (పరుచూరి రవీంద్రనాథ్) అండగా ఉంటాడు. రాజన్న ఆ జంక్షన్ లో కలెక్ట్ చేసిన రౌడీ మామూళ్ళన్నీ, శంకర్‌కు అందజేస్తుంటాడు. ఒక్క రాజన్నే కాదు హైద్రాబాద్‌లోని ప్రతీ జంక్షన్ నుంచీ అతనికి మామూళ్ళు వెళుతుంటాయి. నిజానికి ఈ శంకర్ అనే వాడు ఆలీభాయ్ (కోట శ్రీనివారావు) మనిషి. ఉన్ననాడు తింటూ లేనినాడు పస్తులుంటూ ఆ జంక్షన్‌ని నమ్ముకుని చాలామంది రాజన్న నీడలో బ్రతుకీడుస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం మెట్రో రైలు ప్రోజెక్టుని కట్టేందుకు పార్థసారథి (భానుచందర్) అనే ఒక స్పెషల్ ఆఫీసర్ ని నియమిస్తుంది. అతని ప్లాన్ ప్రకారం ఆ ప్రోజేక్టు కడితే తనకు వంద కోట్లు నష్టం వస్తుంది కాబట్టి దాన్ని దారి మళ్ళించమని ఆ ఆఫీసర్ మీద వత్తిడి తెస్తాడు అధికార పార్టీ యమ్.యల్.ఎ. (డాక్తర్ శివప్రాసాద్). అందుకతను ఒప్పుకోడు. తన ఆస్తి కాపాడుకోటానికి యమ్.యల్.ఎ.ఆలీభాయ్‌తో ఒక ఒప్పందం చేసుకుంటాడు. దాని వల్ల పార్థసారథిని చంపటానికి రాజన్నని ఒక పావులా ఉపయోగించుకుంటాడు ఆలీభాయ్. ఇది తెలుసుకున్న రాజన్న ఆలీభాయ్‌ని నిలదీస్తే, అతన్ని కొట్టిస్తాడు ఆలీభాయ్. దాంతో శంకర్‌నీ, ఆలీభాయ్‌ని, యమ్.యల్.ఎ.ని చంపేస్తాడు. దానివల్ల తిరిగి మళ్ళీ అనాథల జంక్షన్ వాళ్ళకి దక్కుతుంది. వారి జీవితాలు మళ్ళీ యధాప్రకారం కొనసాగుతుంటుంది. క్లుప్తంగా ఇదీ కథ