English | Telugu

సినిమా పేరు:జాతిర‌త్నాలు
బ్యానర్:స‌్వ‌ప్న సినిమా
Rating:3.00
విడుదలయిన తేది:Mar 11, 2021

సినిమా పేరు: జాతిర‌త్నాలు
తారాగ‌ణం: న‌వీన్ పోలిశెట్టి, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి, ఫ‌రియా అబ్దుల్లా, ముర‌ళీ శ‌ర్మ‌, న‌రేష్ వి.కె., బ్ర‌హ్మాజీ, త‌నికెళ్ల భ‌ర‌ణి, వెన్నెల కిశోర్‌, బ్ర‌హ్మానందం.
మ్యూజిక్‌: ర‌ధ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ:  సిద్దం మ‌నోహ‌ర్‌
ఎడిటింగ్‌: అభిన‌వ్ రెడ్డి దండా
నిర్మాత‌:  నాగ్ అశ్విన్‌
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: అనుదీప్ కె.వి.
బ్యాన‌ర్‌: స‌్వ‌ప్న సినిమా
విడుద‌ల తేదీ: 11 మార్చి 2021

ఔట్ అండ్ ఔట్ హిలేరియ‌స్ మూవీ జూసి శానా దినాలైందని అనుకొనేటోళ్ల‌కు మేమున్నామ‌ని వ‌చ్చేశార‌బ్బా 'జాతిర‌త్నాలు'. నాకైతే ఈ సిన్మా చూస్తున్నంత‌సేపూ న‌వ్వాపుకొనుడు చేత‌కాలేదు. అట్టా న‌వ్వేశాను. నేనేంది.. నాతో పాటు జూసినోళ్లంతా అదే మాదిరి న‌వ్వుతానే ఉన్న‌రు.

క‌థ‌
'జాతిర‌త్నాలు' ట్రైల‌ర్ జూసిన‌ప్పుడే మంచిగ‌ న‌వ్వుకున్నాం. రెండు నిమిషాల ట్రైల‌రే గ‌ట్ల న‌వ్వించింది క‌దా, ఇగ సిన్మా మొత్తం ఎట్ల న‌వ్విస్త‌దో అనుకున్నం. మ‌న ఎక్స్‌పెక్టేష‌న్‌కి త‌గ్గ‌కుండ ముగ్గురు 'జాతిర‌త్నాలు' న‌వ్విస్త‌నే ఉన్న‌రు. అవును మ‌ల్ల‌. ఇది ముగ్గురు పోర‌గాళ్ల క‌త‌. 

ఆ క‌తేందంటే.. జోగిపేట‌లో ఆవారాగా తిర్గుకుంటా, మందు తాగుకుంటా, మందితో గొడ‌వ‌లు ప‌డ్తా, మ‌స్తు క‌త‌లు ప‌డ్తుండే శ్రీ‌కాంత్‌, శేఖ‌ర్‌, ర‌వి అనే ఆ ముగ్గురు పోర‌గాళ్లు.. హైద‌రాబాద్‌కొస్తే జింద‌గీ మారిపోత‌ద‌ని అనుకొని ఒక డొక్కు కారు తీసుకొని వ‌స్త‌రు. అక్క‌డ ఆళ్లు జేసే చేష్ట‌లుంట‌య్య‌బ్బా.. న‌వ్వ‌లేక పొట్ట చేత్తే ప‌ట్టుకోవాల్సిందే. కానీ ఆళ్లు ఒక‌టి అనుకుంటే, ఇంకోటి అయిత‌ది. ఒక అటెంప్ట్ మ‌ర్డ‌ర్ కేసుల ఇరుక్కుంట‌రు. దాన్నుంచి బ‌య‌ట‌ప‌డ‌నీకి ఆళ్లేం జేసిన్రు అనేది క్లైమాక్స్‌లో తేల్త‌ది. 

 


ఎనాలసిస్ :

శ్రీ‌కాంత్‌, శేఖ‌ర్‌, ర‌వి క్యారెక్ట‌ర్ల‌ను జూస్తే, మన ఊర్ల‌ల్ల తిరిగే శానామంది పోర‌గాళ్లు గుర్తుకొస్త‌రు. నిజానికి ఆ క్యారెక్ట‌ర్ల‌లో త‌మ‌ని తాము జూసుకొనేటేళ్లు ఎక్కువ మందే ఉంట‌రు. అందుకే జోగిపేట‌లో ఆ ముగ్గురు చేసేప‌న్ల‌కు శానామంది క‌నెక్ట‌వుత‌రు. మ‌స్తు నవ్వుకుంట‌రు. ఈ ముగ్గురి దోస్తానా ఎట్లుంట‌దంటే.. ఏదైనా తేడా వొస్తే ఒకర్నొక‌రు ఇరికించాల‌ని జూస్త‌రు. కానీ అంత‌లోనే ఒక్క‌టైపోత‌రు. ఆ సీన్ల‌ని ఓ రేంజ్‌లో ఎంజాయ్ జేస్తం మ‌నం. నాకైతే జోగిపేట సీన్ల‌ని డైరెక్ట‌ర్ అనుదీప్‌ భ‌లే మంచిగ తీసిండనిపిచ్చింది. 

హైద‌రాబాద్‌కు వ‌చ్చినంక చిట్టి అనే పోరి.. ఆమె అస‌లు పేరు షామిలి అన్న‌మాట‌.. ఆమె ప‌రిచ‌యం అయినంక‌, మ‌న హీరో శ్రీ‌కాంత్ ఆమెని ప‌టాయించ‌నీకి ప‌డే పాట్లు కూడా హిలేరియ‌స్‌గా అనిపిస్త‌యి. ఆమె కూడా శ్రీ‌కాంత్‌ని ఎక్కువ స‌తాయించ‌కుండా, అత‌నికి ప‌డిపోత‌ది. ఆళ్లిద్ద‌రి మీద తీసిన సీన్ల‌ల్ల కూడా కామెడీని వ‌ద‌ల్లేదబ్బా.. డైరెక్ట‌ర్‌లోని రైట‌రు. 

ఫ‌స్టాఫ్ అంతా స‌ర‌దాగా ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో గ‌డిచిపోతే, సెకండాఫ్‌లో ముగ్గురు ఫ్రెండ్స్ క‌త‌లోకి క్రైమ్ ఎలిమెంట్ తీసుకొచ్చిండు డైరెక్ట‌ర్‌. జ‌న‌బ‌లం పార్టీ ఎమ్మెల్యే, కాబోయే స్పోర్ట్స్ మినిస్ట‌ర్ చాణ‌క్య మీద మ‌ర్డ‌ర్ అటెంప్ట్ జేసిన్ర‌ని ముగ్గుర్నీ తీసుకెళ్లి జైల్లో పెడ‌త‌రు. ఆళ్ల‌ని విడిపించ‌నీకి శ్రీ‌కాంత్ ల‌వ‌ర్ చిట్టి.. లాయ‌ర్ అవ‌తార‌మెత్తుత‌ది. ఆమెకి గిదే ఫ‌స్ట్ కేస్‌. ఆ కోర్టు సీన్ల‌లో ఆమె గ‌డ‌బిడ ప‌డ్తా.. పాత సినిమాల‌ డైలాగ్స్ చెప్తుంటే.. మ‌న‌కి న‌వ్వు ఆగ‌దంటే ఒట్ట‌బ్బా.. ఆ జ‌డ్జి ఎవ‌ర‌నుకొనేరు కామెడీ కింగ్ బ్ర‌హ్మానందం.. ఇంక ఆయ‌న ఫేస్ ఎక్స్‌ప్రెష‌న్స్ చూస్తా, ఆయ‌న మాట‌లు వింటంటే న‌వ్వు రాకుండా ఏడికి పోద్ది!

టెక్నిక‌ల్ విష‌యాల‌కొస్తే.. ర‌ధ‌న్ మ్యూజిక్ మంచిగ కొడ్తే‌, సిద్దం మ‌నోహ‌ర్ సినిమాటోగ్ర‌ఫీతో ఆక‌ట్టుకున్న‌డు. సెకండాఫ్‌ల కొంచెం క‌త్తెర‌కు ప‌నిపెడ్తే ఎడిట‌ర్ అభిన‌వ్ రెడ్డి ప‌నిత‌నం కూడా ఇంకా మంచిగ అన్పిచ్చేది.

న‌టీన‌టుల అభిన‌యం
ఇదివ‌ర‌కు 'ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ' సినిమాతోని మ‌న‌ల్ని న‌వ్వించిన న‌వీన్ పోలిశెట్టి.. ఈ సిన్మాల శ్రీ‌కాంత్ క్యారెక్ట‌ర్‌తోని వేరే లెవ‌ల్లో న‌వ్విచ్చిండు. బీటెక్ చ‌దివిన‌ప్ప‌టికీ, ఆళ్ల‌ నాయిన లేడీస్ ఎంపోరియ‌మ్‌ను చూసుకోడానికి సిగ్గుప‌డ్తా ఉండే క్యారెక్ట‌ర్ల నాచుర‌ల్ యాక్టింగ్ చేసిండన్నా.. 'జాతిర‌త్నాలు' సిన్మాతోని హీరోగా న‌వీన్ ఇంకో స్టెప్ ఎక్కిండ‌ని జెప్పాలె. గ‌త‌ని ఫ్రెండ్స్‌లో శేఖ‌ర్‌గా ప్రియ‌ద‌ర్శి, ర‌విగా రాహుల్ రామక్రిష్ణ‌ ప‌ర్‌ఫెక్టుగా స‌రిపోయిండ్రు. నేనైతే రాహుల్ రామ‌క్రిష్ణ యాక్టింగ్‌ను మ‌స్తు ఎంజాయ్ జేసిన‌. 

చిట్టి అలియాస్ షామిలి రోల్‌లో ఫ‌రియా అబ్దాల్లా చ‌క్క‌గ చేసింది. కోర్టు సీన్ల‌ల్ల‌ భ‌లేగా న‌వ్విచ్చింద‌నుకోండి.  శ్రీ‌కాంత్‌, చిట్టి ద‌గ్గ‌ర‌గా ఉం‌టం జూసి ఫ్ర‌స్ట్రేట్ అవుతుండే చిట్టి ఫాద‌ర్ క్యారెక్ట‌ర్‌లో సీనియ‌ర్ న‌రేశ్ స‌రిగ్గా స‌రిపోయిండు. జ‌న బ‌లం ఎమ్మెల్యే చాణ‌క్య పాత్ర‌లో ముర‌ళీశ‌ర్మ యాక్టింగ్ గురించి కొత్త‌గా చెప్పేదేముంటది! ప‌ర్‌ఫెక్ట్ అంతే!! గాయ‌న బామ్మ‌ర్దిగా జేసిన మిర్చి కిర‌ణ్‌కుమార్ కూడా ఇంప్రెస్ జేసిండు. 

ఇక మ‌న బ్ర‌హ్మానందం, వెన్నెల కిశోర్ క‌నిపించిన సీన్ల‌ల్ల మ‌న ముఖాల‌పై ఆటోమేటిగ్గా న‌వ్వు వ‌చ్చేస్త‌ది. హీరో ఫాద‌ర్‌గా త‌నికెళ్ల భ‌ర‌ణి, ఎమ్మెల్యే రామ‌చంద్ర‌య్య‌గా బ్ర‌హ్మ‌జీ న‌టించిన్రు. సీనియ‌ర్ మోస్ట్ యాక్ట‌ర్ గిరిబాబు శానా కాలం త‌ర్వాత జ‌న‌బలం పార్టీ పెద్ద‌గా క‌నిపిచ్చ‌డం నాకైతే మంచిగ అన్పిచ్చిందన్నా.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

'జాతిర‌త్నాలు' సిన్మాకి మెయిన్ స్ట్రెంగ్త్‌.. డైరెక్ట‌ర్ రాసిన సీన్లు, డైలాగ్స్‌, ఆర్టిస్టుల ప‌ర్ఫార్మెన్స్ అని చెప్పాలె. సినిమా అంతా న‌వ్వించ‌డంతో లాజిక్కుల్ని మ‌నం పట్టించుకోం. సెకండాఫ్‌ల అక్క‌డ‌క్క‌డ కొన్ని సీన్లు లాగింగ్ అన్పిచ్చాయి. వాటిని క్రిస్ప్ జేసుకున్న‌ట్ల‌యితే సిన్మా ఇంకా మ‌స్తుగ వ‌చ్చుండేదనేది నా ఫీలింగ్‌. ఈ సిన్మాని మాత్రం మిస్ కాకుండ్రి.

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25