Read more!

English | Telugu

సినిమా పేరు:ఇందుమతి
బ్యానర్:జియో మీడియా ఆర్ట్స్
Rating:---
విడుదలయిన తేది:Jan 1, 2009
ఇది హారర్‌తో కూడిన కథ. ఒక కంపెనీలో పనిచేసే ఒకమ్మాయి ఆ ఆఫీసు సొమ్ము రెండు కోట్ల రూపాయల ఎమౌంట్‌ తీసుకుని, తన ప్రియుడితో కలసి పారిపోతుంది. అలా పారిపోయిన వాళ్ళు జనావాసానికి దూరంగా ఉండే'' ఆనంద నిలయం" అనే ఒక ఇంటిని అద్దెకు తీసుకుంటారు. ఆ ఇంటికి వెళ్ళాక ఆమె స్నానికి వెళ్ళగానే ఆమె ప్రియుడు ఆ రెండు కోట్లు తీసుకుని పారిపోతాడు. కానీ ఇంటి ఓనరు చూసే సరికి బాత్‌రూమ్‌లో ఆమె, బయట ఆమె ప్రియుడు హత్యచేయబడి ఉంటారు. ఆ తర్వాత కొందరు కుర్రాళ్లు తాము వేసే అల్లరి వేషాల వల్ల రూమ్‌ పోగొట్టుకుని ఈ ఆనందనిలయానికే వస్తారు. గచ్చిబౌలి ప్రాంతంలో ఈ ఆనంద నిలయం ఉంటుంది. అక్కడే సీరియల్‌ హత్యలు చేస్తున్న ఒక సైకో కిల్లర్‌ తిరుతున్నాడని పోలీసులు జనాన్ని హెచ్చరిస్తారు. అదే సమయంలో ఆనంద నిలయానికి శివాజీ వస్తాడు. అతనే ఆ సైకో కిల్లర్‌ అనేలా అతని ప్రవర్తన ఉంటుంది. అతను వచ్చిన తర్వాత కూడా హత్యలు జరుగుతాయి. ఈ హత్యలన్నీ ఎవరు చేశారన్నది ఈ చిత్రంలో కూతూహలం కలిగించే ప్రథాన సస్పెన్స్‌ పాయింట్‌.
ఎనాలసిస్ :
యన్‌.ఆర్‌.ఐ. అయిన హర్షారెడ్డి తెలుగు సినీ పరిశ్రమలో ఎవరిదగ్గర పనిచేశారో తెలీదు కానీ... ఒక హర్రర్‌ సినిమాని ఎలా చూపిస్తే ప్రేక్షకులను బాగా భయపెట్టొచ్చో బాగా తెలిసినట్టుంది. ఈ చిత్రం దర్శకుడు ఒక విధంగా "మంత్ర" చిత్రం ఫార్మెట్‌ని చాలా ఈట్‌గా, మరో విధంగా అమలుపరచి విజయం సాధించారని అనవచ్చు. చివరి వరకూ అసలు ఎవరు హత్యలు చేస్తున్నారో, అసలు హంతకుడెవరన్నది ప్రేక్షకులకు తెలీకుండా, టెంపోని మెయిటైన్‌ చేయటం ఈ చిత్రంలోని ప్రత్యేకత. సీరియస్‌ హారర్‌ చిత్రంలో, మధ్యలో శ్రీనివాసరెడ్డిని ప్రవేశపెట్టి చక్కని హాస్యాన్ని పండించటం ఈ చిత్రం స్ర్కీన్‌ప్లేలోని ప్రత్యేకత. ఈ చిత్రానికి అవుయుపట్టు అయిన మల్టిపుల్‌ సైకాలజికల్‌ డిజార్డర్‌ అనే దాన్ని "అపరిచితుడు" చిత్రం నుంచి స్ఫూర్తిగా తీసుకున్నట్లు తోస్తుంది. ఇదొక సినిమాలా కనపడుతూ "మంత్ర"లా పెద్ద హిట్‌ సాధిస్తుంది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
మీరు నిజంగా ఒక సినిమా చూసి భయపడాలనుకుంటే అలాంటి దాన్లో కూడా మీరు ఊహించని క్లైమాక్స్ ఉండాలనుకుంటే ఈ సినిమాని ఓసారి చూడొచ్చు