Read more!

English | Telugu

సినిమా పేరు:హాయ్ నాన్న
బ్యానర్:వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్
Rating:2.75
విడుదలయిన తేది:Dec 7, 2023

సినిమా పేరు :హాయ్ నాన్న 
నటీనటులు: నాని, మృణాల్‌ ఠాకూర్‌, కియారా ఖన్నా, శృతి హాసన్‌, జయరామ్‌, అంగద్‌ బేడీ, ప్రియదర్శిని తదితరులు
రచన, దర్శకత్వం : శౌర్యవ్‌
నిర్మాతలు: మోహన్ చెరుకూరి, విజేందర్ రెడ్డి, మూర్తి  
సంగీతం: హేషమ్‌ అబ్దుల్‌ వాహద్‌
సినిమాటోగ్రఫీ: సాను జాన్ వర్గీస్
ఎడిటర్:  ప్రవీణ్ ఆంటోని
విడుదల తేదీ:డిసెంబర్ 7 

దసరా లాంటి మాస్ మసాల మూవీ తర్వాత నాని నుంచి వచ్చిన ప్యూర్ క్లాసికల్ అండ్ ఫ్యామిలీ మూవీ హాయ్ నాన్న.తన కెరీర్ మొదటి నుంచి డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు చేస్తు తన అభిమానులని ప్రేక్షకులని అలరించే నాని ఇప్పుడు హాయ్ నాన్నతో  అలరించాడో లేదో చూద్దాం.

కథ:-

విరాజ్ (నాని ) అంతర్జాతీయంగా రూపుదిద్దుకునే పలు యాడ్స్ ని షూట్ చేసే ఒక ఫేమస్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్..విరాజ్ తన తండ్రి, ఏడేళ్ల వయసున్న కూతురు మహి ( కియారా ఖన్నా) తో కలిసి తన లైఫ్ జర్నీ ని కొనసాగిస్తు ఉంటాడు. తన కూతురు మహి పుట్టినప్పటి నుంచే లంగ్ డిసీజ్‌తో బాధపడుతు ఉంటుంది. పైగా మహి ఎక్కువ రోజులు బతకదని డాక్టర్స్ చెప్తారు. ఆ బాధనంతా దిగమింగుకుంటు తన కూతురే తన ప్రపంచంగా విరాజ్ బతుకుతుంటాడు. ఇలా జరుగుతున్న కథలోకి మిలినియర్ అయిన యష్ణ ( మృణాల్‌ ఠాకూర్‌) ఎంటర్ అవుతుంది. విరాజ్ ద్వారా మహి అమ్మ ఒక యాక్సిడెంట్  లో చనిపోయిందని యష్ణ తెలుసుకుంటుంది. కానీ విరాజ్ భార్య చనిపోదు. కేవలం తన గతాన్ని మాత్రమే మర్చిపోతుంది. మరి ఎందుకు విరాజ్ యష్ణ కి అబద్దం చెప్పాడు. మహి తల్లి ఎక్కడ ఉంది?  విరాజ్,మహి ల మీద అభిమానాన్ని పెంచుకున్న యష్ణ  ఎలాంటి నిర్ణయం తీసుకుంది? మహి తన చావు నుంచి తప్పించుకుందా?  అనేదే ఈ చిత్ర కథ.


ఎనాలసిస్ :

ఈ హాయ్ నాన్న సినిమా ప్రారంభం అయిన తర్వాత ఒక కొత్త రకమైన అనుభూతుని పొందుతున్న ఫీలింగ్ ని ప్రేక్షకులకి కలుగచేస్తుంది. డైరెక్టర్ చాలా తెలివిగా సినిమా మొత్తాన్ని కేరళ ,ముంబై లలో తెరకెక్కించడంతో  ప్రేక్షుకుడు ఆ రకమైన అనుభూతిని పొందుతాడు. కానీ సినిమాలోకి వెళ్లే కొద్దీ ఈ చిత్ర కథ కూడా పాత కథే అని అర్ధం అవుతుంది.1997 వ సంవత్సరంలో రాజశేఖర్, సౌందర్య హీరో హీరోయిన్ లుగా మోహన్ గాంధీ దర్శకత్వంలో వచ్చిన  మా ఆయన బంగారం సినిమా లైన్ కూడా ఇదే .కానీ దర్శకుడు సెకండ్ ఆఫ్ లో చాలా తెలివిగా వ్యవహరించడంతో  హాయ్ నాన్న ని కొత్త రకమైన సినిమాగా నిలబెట్టింది. కానీ సినిమా ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా ఒకే రకమైన ఎమోషన్ తో సాగడం ఈ సినిమాకి కొంచం మైనస్ అవ్వచ్చు.సెకండ్ ఆఫ్ లో కామెడీ తో సినిమాని నడిపించే అవకాశం ఉండి కూడా దర్శకుడు ఆ దిశగా ఎందుకు ఆలోచించలేక పోయాడో అర్ధం కాదు. నాని, మృణాలిని, పాప మధ్య ఎంటర్ టైన్మెంట్ గా సెకండ్ ఆఫ్ లో కనుక కథ నడిపి చివరలో దర్శకుడు అనుకున్న సెంటిమెంట్ ని జోడించి ఉంటే  కనుక ఈ సినిమా హిట్ తాలూకు రేంజ్ ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు ఉండేది. 

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:-

ఈ సినిమా ద్వారా తనని నాచురల్ స్టార్ అని ఎందుకంటారో నాని మరోసారి చాటి చెప్పాడు. ప్రేమికుడిగా,భర్తగా, తండ్రిగా నాని సూపర్ గా చేసాడు. మరి ముఖ్యంగా సెంటిమెంట్ సన్నివేశాల్లో అవార్డ్ పెర్ ఫార్మెన్స్ ని ప్రదర్శించి తన అద్భుతమైన నటనతో సినిమాని కాపాడాడు. అలాగే మృణాల్ ఠాకూర్ ప్రతి ఫ్రేములోను  చాలా అందంగా ఉంది.స్క్రీన్ మీద తను ఉన్నంత సేపు ప్రేక్షకుడు ఒక్క నిమిషం కూడా తల పక్కకి తిప్పుకోకంత అందంగా కూడా మృణాళి  నటించింది. ఒక రకంగా చెప్పాలంటే నాని తో పోటీ పడి మరి ఆమె నటించింది. అలాగే నాని కూతురుగా  చేసిన పాప కూడా నాని మృణాల్ ల తో పోటీ పడి నటించింది. చిన్న చిన్న సన్నివేశాల్లో కూడా సీనియర్ ఆర్టిస్ట్ లు సైతం ఆశ్చర్య పోయేలా నటించింది. జయరాం కూడా చాలా చక్కగా చేసాడు. అలాగే  సినిమాటోగ్రఫీ ఈ సినిమా కథని అర్ధం చేసుకొని  సినిమాకి ప్రాణం పోసింది. అలాగే ఈ హాయ్ నాన్న ద్వారా ఒక ఫీల్ గుడ్ కథకి ఫొటోగ్రఫీ బలమైన శక్తిని ఇస్తుందో అర్ధం అయ్యింది.  పాటలు,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఈ హాయ్ నాన్న మూవీ పక్క క్లాస్ అండ్ ఫ్యామిలీ మూవీ.. మాస్ ఆడియన్స్ ఈ సినిమాని ఆదరించే స్థాయిని బట్టి ఈ సినిమా విజయం ఆధారపడి ఉంది. అలాగే ఈ మూవీ చూస్తున్నంత సేపు కొన్ని సినిమాల తాలూకు ఛాయలు కనిపించడంతో పాటు ఎంటర్ టైన్మెంట్ లేకపోవడం ఈ సినిమాకి కొచం మైనస్ .బట్ సినిమా మాత్రం నాట్ బాడ్. 

                                                                                              - అరుణాచలం