Read more!

English | Telugu

సినిమా పేరు:హాసిని
బ్యానర్:కమల్ పిక్చర్స్
Rating:2.25
విడుదలయిన తేది:May 7, 2010
ఓ రైలు ప్రయాణంలో ఒకే కంపార్ట్ మెంట్లో హాసిని (సంధ్య), కమల్ (కమలాకర్) లు ప్రయాణం చేస్తుంటారు. ఆనందం (అలీ) అనే దొంగ కారణంగా హాసిని బ్యాగ్ కమల్ దగ్గర, కమల్ డైమండ్ రింగ్ హాసిని దగ్గర వుండి పోతాయి. హాసిని కి ఆ బ్యాగ్ ఎంతో ముఖ్యం. దాంతో కమల్ సొంత గ్రామానికి వెళుతుంది. అక్కడ కమల్ లేకపోవడంతో పాటు కమల్ ప్రేయాసిగా అక్కడే కమల్ కుటుంభ సభ్యుల మధ్యన వుండి పోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితుల్లో హాసిని ఏం చేసింది..? ఇంతకీ ఈ హాసిని ఎవరు..? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
ఎనాలసిస్ :
కథ, కథనాన్ని సరైన పంథాలో నడిపించడంలో దర్శకుదు సక్సెస్ సాధించాడు. ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ లెంత్ ఎక్కువగా వుందనిపిస్తుంది. కామెడి, సెంటిమెంట్ జోడించి కథని మలిచిన విధానం బాగుంది. అరుంధతి లోని పశుపతి, బొమ్మలి పాత్రలతో చేసిన పేరడీ ఆకట్టుకుంటుంది. ఓవరాల్ గా సినిమాని దర్శకుడు తెరకెక్కించిన విధానం బావుంది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
సంధ్య :- సంధ్య కారెక్టర్ ఈ చిత్రానికి హైలెట్.. సినిమా మొదలు నుండి చివరి వరకు సంధ్య పాత్రే సినిమా ని నడిపిస్తుంది. అక్కడక్కడా కాస్త ఓవర్ గా అనిపించినా.. ఈ సినిమాకి ఆమె పాత్రే ప్రధానం. ఓవర్ ఆల్ గా ఆమె నటన ఆకట్టుకునే విదానంగానే వుంటుంది.కమలాకర్ :- కమలాకర్ నటన ఫర్వాలేదు.. ఎక్స్ ప్రెషన్స్ విషయం లో మరి కాస్త జాగ్రత్త వహిస్తే బావుంటుంది. మిగతా నటీ నటులు తమ పాత్రలకి తగ్గట్టుగా బాగానే చేసారు. కోటి:- సంగీతం ఈ చిత్రానికి మరో హైలెట్. సాంగ్స్ బావున్నాయి, బాగ్రౌండ్ మ్యూసిక్ ఆకట్టుకుంటుంది. మరుధూరి రాజ:- డైలాగ్స్ బావున్నాయి. 'అబద్దం ఆడితే అపార్ట్ మెంట్ కట్టినంత స్ట్రాంగ్ గా వుండాలి.. లాంటి డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. కథ-కథనం-దర్శకత్వ భాద్యతలు అందించిన దర్శకుడు బి.వి. రమణ ఈ చిత్రాన్ని కామెడి, సెంటిమెంట్ జోడించి చక్కగా చిత్రీకరించారు. సంధ్య పెర్ఫార్మెన్స్, కామెడి కోసం ఈ చిత్రాన్ని చూడొచ్చు.