Read more!

English | Telugu

సినిమా పేరు:ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్
బ్యానర్:శ్రేష్ట్ మూవీస్
Rating:2.50
విడుదలయిన తేది:Dec 8, 2023

సినిమా పేరు :ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్
నటీనటులు: నితిన్ ,శ్రీలీల, రాజశేఖర్, మిర్చి సంపత్, సుదీవ్ నాయర్, రావు రమేష్, రోహిణి, అజయ్ తదితరులు 
రచన, దర్శకత్వం : వక్కంతం వంశీ 
నిర్మాతలు:సుధాకరరెడ్డి, నిఖితా రెడ్డి   
సంగీతం: హారిస్ జైరాజ్ 
సినిమాటోగ్రఫీ: ఆర్థర్ ఏ  విల్సన్,
ఎడిటర్:  ప్రవీణ్ పూడి 
విడుదల తేదీ:డిసెంబర్ 8  

సాధారణంగా ఏ తెలుగు సినిమా విడుదలైనా కూడా ఆ సినిమా యొక్క విజయం ఆ సినిమా హీరోకి దర్శకుడుకి చాలా ముఖ్యం.ఎందుకంటే ఆ విజయం ఆ ఇద్దరికి  సినిమారంగంలో మరిన్ని సినిమాలు చెయ్యడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ రోజు  విడుదలైన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్ విజయం ఇప్పుడు ఇద్దరికి చాలా అవసరం. ఆ ఇద్దరే హీరో నితిన్ అండ్ డైరెక్టర్ వక్కంతం వంశీ. మరి వరుస పరాజయాల బాటలో నడుస్తున్న ఆ ఇద్దరికి ఈ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్ విజయాన్ని తెచ్చిపెట్టిందో  లేదో చూద్దాం.

కథ

అభికి  (నితిన్)  చిన్నపటినుంచి  రోజు తనలా బతకాలంటే పరమబోరుగా ఉంటుంది. రోజుకొక మనిషిలా బతకాలనుకునే అభి పెద్దవాడు అయ్యాక సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా మారతాడు. బాహుబలి,శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో కూడా   నటించిన అభి ఏ రోజుకైనా పెద్ద ఆర్టిస్ట్ కావాలని కలలు  కంటు ఉంటాడు.  కానీ అతని తండ్రి రావు రమేష్ కి మాత్రం అభిని ఎందుకు పనికి రాని వెధవ అంటూ ఎప్పుడు తిడుతుంటాడు. ఈ క్రమంలో అభికి ఒక సినిమాలో హీరో గా అవకాశం వస్తుంది. ఆ సినిమా  డైరెక్టర్ ప్రస్తుతం ఒక ప్రాంతంలో  రియల్ గా  జరుగుతున్న కథని తన సినిమా కథ గా రాసుకొని అభిని హీరోగా ఫిక్స్ చేస్తాడు. ఇంకో పక్క నీరో(సుదీవ్ నాయర్) అనే ఒక కరుడుగట్టిన విలన్ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో ఉన్న ఒక గ్రామ ప్రజల్ని తన వ్యాపార సామ్రాజ్యం కోసం చంపుతుంటాడు.ఇంకో పక్క అభికి సినిమా హీరో అవకాశం పోతుంది. ఈ క్రమంలో అభి తిరిగి సినిమాల్లో అవకాశం సంపాదించాడా? నీరో నుంచి  ఊరి ప్రజలు ఎలా బయటపడ్డారు అనేదే మిగతా కథ.


ఎనాలసిస్ :

ఈ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్ కథ ముమ్మాటికీ హిట్ ఫార్ములాతో దర్శకుడు వక్కంతం వంశీ రాసుకున్న ప్యూర్ కమర్షియల్ కథ. సినిమా చూస్తున్నంత సేపు గతంలో వచ్చిన చాలా సినిమాలు గుర్తుకొస్తున్నా కుడా వంశీ స్క్రీన్ ప్లే అండ్ దర్శకత్వ ప్రతిభ  సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులని కట్టి పడేస్తుంది. అలాగే  అన్ని కమర్షియల్ సినిమాల్లోని హీరోయిన్ క్యారెక్టర్ లు ఎలా అయితే ఉంటాయో ఈ సినిమాలోని హీరోయిన్ పరిస్థితి కూడా అదే.విధంగా ఉంటుంది. విలన్ ఒక ఊరికి చేసే అన్యాయాన్ని దర్శకుడు సరిగా ఎలివేట్ చెయ్యకవడం ఈ కథ కి మైనస్. అది మరింతగా ఎలివేట్ చేసి  హీరో నిజంగానే విలన్ మీద పగ తీర్చుకోవడమనేది ఒరిజినల్ గా ఉంటే సినిమా లుక్ వేరేగా ఉండేది.దర్శకుడు ఎంత సేపు తన సినిమా హీరోని నిజమైన జూనియర్ ఆర్టిస్ట్ గా బావించాడని ప్రేక్షకుడికి అనిపిస్తుంది. అన్ని సినిమాల్లో హీరో చివరికి విలన్  చంపుతాడని ప్రేక్షకుడు ఆల్రెడీ ఫిక్స్ అయ్యే ఉంటారు కాబట్టి వంశీ సినిమా మొదటి నుంచి రివర్స్ స్క్రీన్ ప్లే లో సీన్స్ ని చెప్తున్నాడు కాబట్టి నితిన్ విలన్ ని చంపడం కొత్తగా చూపిస్తే బాగుండేది. అలాగే నితిన్ చేత కూడా తన క్యారక్టర్ యొక్క ఇజాన్ని ప్రేక్షకుడికి  క్లారిఫై గా చెప్పి ఉంటే  సినిమా విజయం రేంజ్ పెరిగేది.  రాజశేఖర్ క్యారక్టర్ ఇంకొంచం ముందు వస్తే బాగుండేదని సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు భావిస్తాడు. అలాగే మరి ముఖ్యంగా సాంగ్స్  కనుక బాగుండి ఉంటే ఎక్కువ రోజులు ఈ సినిమా నిలబడేది. అలాగే హీరోయిన్ ని సెకండ్ ఆఫ్ లో హీరోతో పాటే ట్రావెల్ చేయించి ఉంటే  సినిమాకి మరింతగా ప్లస్ అయ్యేది. శ్రీలీల కి ఉన్న కాల్షీట్ల ప్రాబ్లెమ్ అని ప్రేక్షకుడికి  స్పష్టంగా అర్ధం అవుతుంది.అలాగే విలన్ పాత్ర చాలా సినిమాల్లోని విలన్ పాత్రల్ని పోలి ఉండటం కూడా మూవీకి కొంచం మైనస్.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:

ఇక నటి నటుల విషయానికి వస్తే అభి క్యారక్టర్లో నితిన్ వీరవిహారం చేసాడు.జూనియర్ ఆర్టిస్ట్ గా ఆ తర్వాత సినిమా కోసం ఎంత దూరమైన వెళ్లే క్యారక్టర్ లో నితిన్ నటన సూపర్ గా ఉంది.అలాగే  నితిన్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ తన గత సినిమాలకంటే భిన్నంగా అగ్ర హీరో రేంజ్ లో ఉంది. కామెడీ ని కూడా నితిన్ సూపర్ గా చేసాడు. సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాలపై వేసుకొని ప్రేక్షకులకి తన క్యారక్టర్ ద్వారా సూపర్ గా ఫన్నీ ని అందించాడు. శ్రీలీల బబ్లీ క్యారక్టర్ బాగున్నా కూడా ఇలాంటి పాత్రల్ని తను ఆల్రెడీ చాలా సినిమాల్లో చేసింది. రావు రమేష్ ,రోహిణి ల కామెడీ బాగుంది. అలాగే ముఖ్యంగా సీనియర్ హీరో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో చించి పడేసాడు. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లో బిజీ ఆర్టిస్ట్ గా మారడం  ఖాయం. అలాగే విలన్ పాత్ర  పోషించిన  సుదీవ్ నాయర్  కూడా సూపర్ గా చేసాడు. ఇక వక్కంతం వంశీ డైరెక్షన్ అయితే ఒక రేంజ్ లో ఉంది. అలాగే ఆయన స్క్రీన్ ప్లే కి ఉన్న బలాన్ని ఈ సినిమా మరో సారి నిరూపించింది.ఎన్నో సినిమాలకి సూపర్ మ్యూజిక్ ఆల్బమ్ ని అందించిన హారిస్ జైరాజ్ ఈ సినిమాకి మాత్రం అన్యాయం చేసాడు. కెమెరా పనితనం అండ్ నిర్మాణ విలువలు బాగున్నాయి. మిర్చి సంపత్  కొంచం సేపే కనపడినా కూడా ఫన్నీ క్యారక్టర్ చేసి మెప్పించాడు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ అంశాలతో రూపొందిన  ఈ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్ మూవీని చూస్తున్నంత సేపు ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటారు. కానీ ఆ టైప్ ఆఫ్ కామెడీ తెలుగు ప్రేక్షకులకి కొత్త కాదు. వేసవి కి వస్తే ఈ సినిమా విజయం తాలూకు వేరేలా ఉండేది. ఎక్కడ బోర్ కొట్టని మైసమ్మ రాసిన స్క్రీన్ ప్లే ఈ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్ మూవీ.

 

- అరుణాచలం