English | Telugu

సినిమా పేరు:ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడా
బ్యానర్:మేఘనా ఆర్ట్స్
Rating:2.25
విడుదలయిన తేది:Nov 18, 2016

తెలిసిన క‌థ‌ని అందంగా చెప్పాలి..
లేదంటే కొత్త క‌థే చెప్పాలి..
- ఓ విజ‌య‌వంత‌మైన సినిమా ఈ సూత్రాన్ని న‌మ్ముతుంది. పాటిస్తుంది. అయితే... హార‌ర్ కామెడీ లాంటి జోన‌ర్ల‌లో ఇవి రెండూ ఉండ‌వు. ఎందుకంటే అన్ని క‌థ‌లూ ఒకే గిరి గీసుకొని తిరుగుతుంటాయి. అందులో కొత్త‌ద‌నం క‌నిపించ‌మ‌న్నా క‌నిపించ‌దు. చెప్పే విధానం, మ‌ధ్య‌లో వ‌చ్చే మ‌లుపులూ.. క‌థ‌ని ముగించిన ప‌ద్ద‌తీ ఇవే.. హార‌ర్ సినిమాల్ని కాపాడే ఆయుధాలు. ఆ పాయింట్లని స‌రిగ్గా రాసుకొని డీల్ చేయ‌గ‌లిగితే.. క‌చ్చితంగా మంచి ఫ‌లితం వ‌స్తుంది. దాన్నే న‌మ్ముకొని వ‌చ్చిన మ‌రో సినిమా 'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా'. మ‌రి ఈసినిమాలో క‌థ కొత్త‌దా, లేదంటే కొత్త‌గా చెప్పే ప్ర‌య‌త్నం చేశారా?  రాసుకొన్న ట్విస్ట్‌లూ, ట‌ర్న్‌లూ ఈసినిమాని ఏ స్థాయికి తీసుకెళ్లాయి అనేవి తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

* క‌థ‌

సిద్దార్థ్ (నిఖిల్‌) త‌న స్నేహితుడు (వెన్నెల కిషోర్‌)ని ప‌ట్టుకొన్న దెయ్యాన్ని వ‌దిలించ‌డానికి కేర‌ళ వెళ్తాడు. అదే స‌మ‌స్య‌తో అక్క‌డికి విజ‌య‌వాడ నుంచి అమ‌ల (హెబ్బా ప‌టేల్‌) వ‌స్తుంది. అమ‌ల‌లోని అందం, ఆమె అల్ల‌రి సిద్దార్ద్‌కు బాగా న‌చ్చుతాయి. అమ‌ల కూడా సిద్దార్థ్‌తో చ‌నువుగా ఉంటుంది. అది ప్రేమే అనుకొంటాడు సిద్దార్ద్‌. అయితే ఓరోజు సిద్దార్థ్‌కి చెప్ప‌కుండా అక్క‌డ్నుంచి వెళ్లిపోతుంది అమ‌ల‌. త‌న‌ని వెదుక్కొంటూ విజ‌య‌వాడ వెళ్తాడు సిద్దార్థ్‌. అక్క‌డ త‌న‌ని కొన్ని భ‌యంక‌ర‌మైన నిజాలు తెలుస్తాయి. కేర‌ళ‌లో తాను ప్రేమించిన అమ్మాయి పేరు అమ‌ల కాదు. నిత్య‌. పైగా త‌న‌కి దెయ్యం ప‌ట్టుకొంది. ఆ దెయ్యంతోనే తిరిగాడు... మాట్లాడాడు.. ప్రేమ‌లో ప‌డ్డాడ‌న్న‌మాట‌. ఆ దెయ్యం కేర‌ళ‌లోని భూత వైద్యులు వ‌దిలించేస్తారు. దాంతో మామూలు అమ్మాయి నిత్య‌గా మారి హైద‌రాబాద్ వ‌చ్చేస్తుంది. మ‌రి నిత్య సిద్దార్థ్‌ని గుర్తించిందా లేదా?  అస‌లు అమ‌ల ఎవ‌రు?  ఆత్మ రూపంలో ఎందుకు తిరుగుతోంది?  అనేదే అస‌లు కథ.


ఎనాలసిస్ :

దీన్ని హార‌ర్ సినిమా అనుకోకూడ‌దు. ఓ ప్రేమ క‌థ‌. ఆ మాట కొస్తే దెయ్యం ప్రేమ‌క‌థ‌. దానికి ఎప్ప‌ట్లా కామెడీ, థ్రిల్ జోడించి తీసిన సినిమా ఇది. క‌థ‌ని ప్రారంభించిన విధానం ఆస‌క్తిని రేపుతుంది. కేర‌ళ ఎపిసోడ్‌, అక్క‌డ ల‌వ్ ట్రాక్ మాత్రం బోర్ కొట్టిస్తాయి. ఈ సీన్లు ఎప్పుడైపోతాయో అనిపించాయంటే... దాన్ని తెర‌కెక్కించిన విధానం ఎలా ఉందో అర్థం చేసుకోవొచ్చు. విశ్రాంతి ముందు ట్విస్టతో క‌థ ప‌రుగు పెడుతుంది. అయితే.. మ‌రీ దిమ్మ తిరిగే ఇంట్ర‌వెల్ బ్యాంగ్ ఏమీ లేదు. ఓపెనింగ్ సీన్‌ని కాస్త లోతుగా ఆలోచిస్తే... ఈ సినిమా ఇంట్ర‌వెల్ ట్విస్ట్‌ని ముందే ఊహించొచ్చు. ఆ ఆత్మ ఎవ‌ర‌న్న క్లూ దొరగ్గానే, త‌రవాత ఏం జ‌ర‌గ‌బోతోంది అనేదీ తెలిసిపోతుంది. స్క్రీన్ ప్లేలో చిన్న చిన్న మార్పులు చేసుకొంటే,. ఈ క‌థ ఇంకాస్త ర‌క్తి క‌ట్టేది. ప్ర‌ధ‌మార్థంలో వెన్నెల కిషోర్ ఆ మాత్రం కామెడీ చేయ‌క‌పోతే.. ఇంట్ర‌వెల్ ఎపిసోడ్ ప‌డ‌గానే జ‌నం తుర్రుమ‌నేవారు. కిషోర్ కామెడీ త‌ప్ప ఫ‌స్టాఫ్‌లో ఏం లేదు. సెకండాఫ్‌లో ఆ బాధ్య‌త స‌త్య తీసుకొన్నాడు. కామెడీ ఎపిసోడ్లు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా సినిమా హాయిగా సాగుతుంది. సెకండాఫ్‌లో కూడా చాలా సీన్లు లెంగ్తీగా సాగుతాయి. ఫ్లాష్ బ్యాక్‌లో మ‌ళ్లీ ఫ్లాష్ బ్యాక్ రావ‌డం.. త‌ల‌నొప్పి వ్య‌వ‌హార‌మే. దాంతో సినిమా లెంగ్త్ పెరిగింది.. ఆ సినిమాపై ప్రేక్ష‌కుడు పెంచుకొన్న ప్రేమ త‌గ్గింది. క‌థ‌లో ఉప‌క‌థ‌లు... ట్విస్టుకు స‌బ్ ట్విస్టులూ ఇలా ముడులు ఎక్కువై... థ్రిల్ స‌న్న‌గిల్లింది. అలాగ‌ని ఇది బ్యాడ్ ఫిల్మ్ ఏం కాదు. డీసెంట్‌గానే ఉంటుంది. కావ‌ల్సినంత ఫ‌న్ ఇస్తుంది. అయితే.. థ్రిల్‌, హార‌ర్‌ల విష‌యంలో లోటు జ‌రిగింది.

* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

నిఖిల్ ఎప్ప‌ట్లా చ‌లాకీగా న‌టించాడు. అత‌ని న‌ట‌న‌లో సినిమా సినిమాకీ ఈజ్ పెరుగుతోంది. హెయిర్ స్టైల్ మార్చాడేమో లుక్ కూడా మారింది. హెబ్బాకి అంత స్కోప్ లేదు. మేక‌ప్ మ‌రీ ఎక్కువైంది.  కొత్త‌మ్మాయి నందిత శ్వేత న‌ట‌న ఆక‌ట్టుకొంటుంది. సెకండాఫ్ అంతా ఆమెదే ఆధిపత్యం.. నిఖిల్ కూడా సైడ్ క్యారెక్ట‌ర్‌లా మారిపోయాడు. అవికా క‌నిపించింది కాసేపే అయినా ఆక‌ట్టుకొంటుంది. స‌త్య మ‌రోసారి సునీల్‌ని గుర్తు చేసే కామెడీ టైమింగ్‌తో చెల‌రేగిపోయాడు. వెన్నెల కిషోర్ పంచ్‌లు బాగా పేలాయి. రూ.500, రూ.1000 నోట్ల ర‌ద్దుపై కూడా ఈ సినిమాలో పంచ్‌లేశారు. ఈ టైమ్‌లో అలాంటి డైలాగులు వ‌ద‌ల‌డం.. బాగుంది.


* సాంకేతికంగా...
సంగీతం, ఛాయాగ్ర‌హ‌ణం ఈ చిత్రానికి క‌లిసొచ్చే అంశాలు. పాట‌లు బాగున్నాయి. వాటిని తెర‌కెక్కించిన విధానం కూడా. అయితే స్క్రీన్ ప్లే ప‌రంగా లోపాలున్నాయి. సీన్లు మ‌రీ లెంగ్తీగా మార‌డం.. ఈ సినిమా ఫేట్ ని మార్చేశాయి. తొలి ప్ర‌య‌త్నంగా టైగ‌ర్‌లాంటి సినిమా తీసిన ఆనంద్‌.. మ‌రీ ఇంత స‌డ‌న్‌గా జోన‌ర్ ఛేంజ్ చేస్తాడ‌ని ఎవ్వ‌రూ ఊహించ‌రు.  ప్ర‌ధ‌మార్థంలో ల‌వ్ స్టోరీని కాస్త బాగా రాసుకొని ఉంటే బాగుండేది.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

* చివ‌రిగా:  ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా..  ల్యాగ్ ఎక్కువైన ఓ ఆత్మ క‌థ‌.

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25