Read more!

English | Telugu

సినిమా పేరు: ఏకలవ్యుడు
బ్యానర్:శ్రీ వెంకటరమణ ఫిల్మ్స్
Rating:2.00
విడుదలయిన తేది:Nov 7, 2008
కార్తీక్‌ (ఉదయ్‌కిరణ్‌) మంచి కోసం పోరాడే యువకుడు. మంచికి ఎక్కడైనా అన్యాయం జరిగితే కార్తీక్‌ దానికి ఎదురు నిలిచి పోరాడతాడు. ఇది అతని తండ్రి (చలపతిరావు)కి ససేమిరా నచ్చదు. దాంతో తండ్రీ కొడుకుల మధ్య గొడవ. ఈ గొడవలతో విసిగిపోయిన కార్తీక్‌ ఓ సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకుంటాడు. కానీ ఉన్నట్లుండి కార్తీక్‌ నోట్ల కట్టలతో దిగుతాడు. ఇంటి అప్పులన్నీ తీర్చేస్తాడు. "ఇదెలా సాధ్యమయిందిరా" అని తండ్రి అడిగితే దానికి తనకు అమెరికాలో ఉద్యోగం వచ్చిందని చెపుతాడు కార్తీక్‌. ఇంట్లో వాళ్ళకి అమెరికా వెళ్తున్నాని చెప్పిన కార్తీక్‌ నిజానికి అమెరికా వెళ్ళకుండా ఊటీకి వెళ్ళి స్నేహితులతో ఎంజాయ్‌ చేస్తుంటాడు. ఊటీలో ఇందు (కృతి) అనే అమ్మాయికి చాలా చక్కని ఫాలోయింగ్‌ ఉంటుంది. ఆమెను అక్కడ చాలా మంది అభిమానిస్తుంటారు. కానీ ఆ అమ్మాయి మాత్రం మన కార్తీక్‌నే ప్రేమిస్తుంది. నిజానికి ఆత్మమత్య చేసుకోబోయిన కార్తీక్‌ని ఆపిన భక్త అనే దాదా "నేను చెప్పినప్పుడు చస్తే నీకు బోల్డంత డబ్బిస్తా" నంటాడు. ఆ డబ్బుతోనే కార్తీక్‌ తన ఇంటి అప్పులన్నీ తీర్చేది. అందుకే ఇందుని తను ప్రేమిస్తున్నా కూడా ఆమె ప్రేమను తిరస్కరిస్తాడు కార్తీక్‌. కారణం తానెప్పుడు చస్తాడో తనకే తెలియదు కనుక. ఈ విషయం తెలిసిన అతని స్నేహితులు భక్తాకి ఎదురుతిరగమంటారు. కానీ ఆ ప్రేమ ఫలిస్తుందా...? అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాలి.
ఎనాలసిస్ :
ఈ చిత్రంలో దర్శకుడు కె.ఆర్‌.కె. తను చెప్పాలనుకున్న దాన్ని ఉన్నంతలో బాగానే చెప్పటానికి ప్రయత్నించాడు. కానీ ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించటంలో విఫలమయ్యాడనే చెప్పాలి. స్ర్కీన్‌ప్లే విషయంలో మరింత జాగ్రత్త తీసుకునుంటే బాగుండేది. టేకింగ్‌ ఫరవాలేదు. నటన :- ఉదయ్‌కిరణ్‌ ఈ సినిమాని ఎందుకు ఆలస్యం చేశాడో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. దీన్లో అతని నటన రొటీన్‌గానే ఉంది గానీ ప్రత్యేకంగా ఏం లేదు. మిగిలిన వాళ్ళు కూడా తమ తమ పాత్రలకు తగినట్లు నటించారు. సంగీతం :- ఫరవాలేదు. కొత్త సంగీత దర్శకుడు వీలయినంతలో మంచి సంగీతాన్నే అందించాడు. రీ-రికార్డింగ్‌ ఫరవాలేదు. కెమెరా :- ఊటీ అందాలు ఇంకా అందంగా చూపించొచ్చు. అయితే కొత్తగా కెమెరామేన్‌ అయిన రమేష్‌ కృష్ణ కెమెరామేన్‌గా ఇంకా పరిణితి చెందాల్సి ఉంది. ఎడిటింగ్‌ :- ఒ.కె. కొరియోగ్రఫీ : ఫరవాలేదు. చూసేందుకు బాగానే ఉంది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఈ చిత్రం ఓ.కె. సినిమా