English | Telugu

సినిమా పేరు:డ్యూడ్
బ్యానర్:మైత్రి మూవీ మేకర్స్
Rating:2.00
విడుదలయిన తేది:Oct 17, 2025

సినిమా పేరు: డ్యూడ్  
తారాగణం:  ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు,శరత్ కుమార్, నేహా శెట్టి, సత్య,హ్రిందు హరూన్,రోహిణి తదితరులు 
మ్యూజిక్: సాయి అభ్యంకర్ 
ఎడిటర్:భరత్ విక్రమన్ 
రచన, దర్శకత్వం: కీర్తిశ్వరన్ 
సినిమాటోగ్రాఫర్: నికిత్ బొమ్మి 
బ్యానర్స్  : మైత్రి మూవీ మేకర్స్ 
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్ 
విడుదల తేదీ: అక్టోబర్ 17 ,2025 

ఈ ఏడాది ప్రారంభంలో 'రిటర్న్ఆఫ్ ది డ్రాగన్' తో వచ్చి హిట్ ని అందుకున్న ప్రదీప్ రంగనాధన్(Pradeep Ranganathan)ఈ రోజు 'డ్యూడ్'(Dude)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రదీప్ రంగనాధన్ తో  ప్రేమలు ఫేమ్ మమితా భైజు(Mamitha Baiju)స్క్రీన్ షేర్ చేసుకోవడం ప్రధాన ఆకర్షణ. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.  

కథ
గగన్(ప్రదీప్ రంగనాథన్) అందరితో సరదాగా ఉండే ఒక ప్రాక్టీకల్ వ్యక్తి.  ఏ విషయాన్నీ సీరియస్ గా తీసుకోకుండా ఎదుటివారిని ఆనందంగా ఉంచాలనుకుంటాడు. మూడు సార్లు లవ్ లో ఫెయిలైన హ్యాపీగా ఉండేంత మైండ్ సెట్ కూడా గగన్ సొంతం. కుందన (మమితా భైజు) గగన్ మేనమామ కూతురు. చిన్నవయసు ఉంచే గగన్ ని ప్రేమిస్తూ ఉంటుంది.  గగన్ కి కూడా కుందన అంటే చాలా ఇష్టం. ఇద్దరు ఎంతో క్లోజ్ గా ఉండంతో పాటు ఒకరి ప్రాబ్లమ్ ని ఒకరు షేర్ చేసుకునేంత చనువు. గగన్ కి  కుందన లవ్ ప్రపోజ్ చేస్తుంది. కానీ గగన్ నిరాకరిస్తాడు. నువ్వంటే ఇష్టమే. కానీ లవ్ ఫీలింగ్ లేదని తనతోనే చెప్తాడు. దీంతో కుందన ఉన్నత చదువుల కోసం ఫారెన్ వెళ్తుంది. ఆ తర్వాత కొన్నాళ్లకి గగన్ కి కుందన పై ప్రేమ పుడుతుంది.అదే నిజమైన ప్రేమ అని భావిస్తాడు. ఈ విషయాన్నీ తన మేనమామ కుందన తండ్రి అయిన ఆదిశేషు(శరత్ కుమార్) కి చెప్తాడు. ఆదిశేషు విద్యాశాఖామంత్రితో పాటు ఎంతో పలుకుబడిన వ్యక్తి. కుటుంబ పరువు కోసం సొంత చెల్లెలినే చంపిన ఘనుడు. పైగా మేనల్లుడే అల్లుడు కావాలని ఆశపడే ఆదిశేషు ఇద్దరికి పెళ్లి ఫిక్స్ చేస్తాడు. కానీ గగన్ తో నేను వేరే వ్యక్తిని ప్రేమించానని కుందన చెప్తుంది. అతన్నితనతో పాటు తీసుకొస్తుంది కూడా. మరి కుందన ప్రేమ విషయం తెలిసాక  గగన్ తీసుకున్న నిర్ణయం ఏంటి? అసలు ప్రాక్టీకల్ గా ఉండే గగన్ ఆ విషయాన్నీ తేలిగ్గా తీసుకున్నాడా? ఆదిశేషు కి కుందన ప్రేమ విషయం తెలిస్తే పరిస్థితి ఏంటి? ఒక వేళ గగన్ తనని నిజంగానే ప్రేమించాడని కుందన కి తెలిస్తే, గగన్ లైఫ్ కి సంబంధించి కుందన ఏమైనా నిర్ణయం తీసుకుందా? కుందన బాగుండటానికి గగన్ చివరికి వరకు ఏం చేసాడు అనేదే ఈ కథ   


ఎనాలసిస్ :

 ఇలాంటి కథని మైత్రి మూవీ మేకర్స్ ఎలా ఓకే చేసిందో అర్ధం కావడం లేదు.   ఎందుకంటే ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ నువ్వే కావాలి, సెకండ్ ఆఫ్ ఆర్య 2 . ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే గగన్, కుందన ఎంట్రీ సీన్స్ బాగున్నాయి. సదరు సీన్స్ కి ఒక పర్పస్ కూడా  ఉండటంతో ఆ ఇద్దరి మధ్య వచ్చే రాబోయే సన్నివేశాలతో పాటు కథనం ఎలా ఉండబోతోందనే  ఆసక్తి ఏర్పడుతుంది. ఎర్లీ గానే  గగన్ కి కుందన ఐ లవ్ యు చెప్తుంది. గగన్ నో చెప్తాడు. ఇక్కడ నుంచి సరికొత్త కథని ఉహించుకుంటాం. కానీ రొటీన్ సన్నివేశాలతో కథ నిదానంగా గాడి తప్పుతు వచ్చింది. గగన్ కి కుందన పై ఇన్నాళ్లు ఉన్న ఇష్టం ప్రేమగా మారిందని చెప్పడానికి బలమైన కారణాన్ని చూపించాల్సింది.  టోటల్ గా చూసుకుంటే  ఫస్ట్ హాఫ్ పర్లేదని అనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ పెద్దగా పేలలేదు. సెకండ్ హాఫ్ మొత్తం హీరో అంటే శాక్రిఫైజ్ చెయ్యడానికే పుట్టినట్టుగా చూపించారు. అసలు ఆ త్యాగాల కోసమే సినిమా తెరకెక్కించినట్టుగా కూడా ఉంది.  కుందన ని  హీరోయిన్ లాగానే చూపించలేదు. కుందన ప్రేమించిన పార్ధు అనే వ్యక్తిని కూడా సైడ్ క్యారక్టర్ ఎస్టాబ్లిష్ చేసినట్టుగా చేసారు. పైగా గగన్ తో పార్థుని ప్రేమిస్తున్నానో లేదో తెలియదనే డైలాగ్ చెప్పినా, పార్థు, కుందన ని గగన్ కలపాలని అనుకోవడం విడ్డూరం. ఇక్కడ నుంచైనా కథనం లో మార్పులు చేసి, కుందన ప్రేమని  గగన్ గెలుచుకోవడం  చూపించాలసింది. టోటల్ గా ఆర్య 2 స్టోరీ ని నడిపించారు.  కుందన కి భర్తగా సమాజం దృష్టిలో గగన్ ఉండటం, కుందన తల్లి అయ్యి, ఆ బిడ్డకి తండ్రిగా కూడా గగన్  ని చెప్పించడంతో సినిమాగాడి తప్పిపోయింది. తాళి కట్టినోడికి, కట్టించుకున్నోళ్లకి గగన్ విలువ ఇచ్చి తాళి కి విలువ లేదని చెప్పడం మరి  విచిత్రం. క్లైమాక్స్ కూడా బాగోలేదు
   
నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు

 ప్రేమించిన అమ్మాయి బాగుండాలని తన కోసం ఎన్ని సమస్యలు ఎదురైనా,ధైర్యంగా ఫేస్ చేసే గగన్ క్యారక్టర్ లో ప్రదీప్ రంగనాధన్ అత్యద్భుతంగా నటించాడు.  కానీ కథనం లోని లోపాల వల్ల ఆ పెర్ ఫార్మెన్స్ మొత్తం బూడిదలో పోసిన పన్నీరయ్యింది.  మమితా భైజు మరో సారి తన క్యూట్ నటనతో ఆకట్టుకుంది. ఒకప్పటి సూపర్ స్టార్ శరత్ కుమార్ అయితే ఆదిశేషు క్యారక్టర్ లో జీవించాడు. సిల్వర్ స్క్రీన్ పై మళ్ళీ బిజీ ఆర్టిస్ట్ గా మారడం ఖాయం. దర్శకుడిగా  కీర్తిశ్వరన్(Keerthiswaran)టేకింగ్, షాట్ సెలక్షన్ బాగుంది. కానీ రచయితగా తను ఫెయిల్ అవ్వడంతో పాటు హీరో, హీరోయిన్ క్యారెక్టర్స్ కి కూడా అన్యాయం చేసాడు. ఫొటోగ్రఫీ, మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మైత్రి మూవీస్ నిర్మాణ విలువలు హైలెట్.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఫైనల్ గా చెప్పాలంటే కథ, కథనాలు డ్యూడ్ కి మైనస్ గా నిలిచాయి. ప్రదీప్ రంగనాధన్, మమితా భైజు, శరత్ కుమార్ ల పెర్ ఫార్మెన్స్ మాత్రం బాగుంది.

 


Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 2.50