English | Telugu

సినిమా పేరు:డబుల్ ఇస్మార్ట్
బ్యానర్:పూరి కనట్స్  
Rating:2.50
విడుదలయిన తేది:Aug 15, 2024

సినిమా పేరు: డబుల్ ఇస్మార్ట్ 
తారాగణం: రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, షాయాజీ షిండే, ఉత్తేజ్, బని, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను,అలీ  తదితరులు   
సంగీతం:మణి శర్మ   
సినిమాటోగ్రఫీ:శ్యాం కె నాయుడు,  జియాన్ని   
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ 
రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్ 
నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ 
బ్యానర్: పూరి కనట్స్   
విడుదల తేదీ: అగస్ట్ 15  2024 

పూరి జగన్నాధ్(puri jaggandh)రామ్ పోతినేని(ram pothineni)అభిమానులతో పాటు మూవీ లవర్స్ అందరు ఏ  రోజు కోసమే అయితే ఎదురుచూసారో ఆ రోజు రానే వచ్చింది. వరల్డ్ వైడ్ గా డబుల్ ఇస్మార్ట్ ఈ రోజు  ఒక రేంజ్ లో రిలీజ్ అయ్యింది. పైగా ఇస్మార్ట్ శంకర్ కి సీ క్వెల్. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ
శంకర్ అలియాస్ ఇస్మార్ట్ శంకర్( రామ్ పోతినేని ) కి తన తల్లి పోచమ్మ (ఝాన్సీ) అంటే చాలా ప్రేమ. ఒక బిజినెస్ మ్యాన్  ఇంట్లో పని మనిషిగా చేస్తుంటుంది. శంకర్ చిన్న వయసులోనే  హత్యకి గురవుతుంది. దాంతో తన తల్లిని చంపిన వాళ్ళ కోసం వెతుకుతూ పక్కా ప్లాన్ తో భారీ ఎత్తున డబ్బు దొంగతనం చేస్తుంటాడు. ఈ క్రమంలో తన లైఫ్ లోకి ఢిల్లీకి చెందిన  జన్నత్ (కావ్య థాపర్ ) ఎంటర్ అవుతుంది. తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఇంకో పక్క కొన్ని నెలల్లో చనిపోయే బిగ్ బుల్ (సంజయ్ దత్ ) అనే ఒక అండర్ వరల్డ్ డాన్ శంకర్ కోసం ఇండియా వస్తాడు. ఇండియాని రెండు ముక్కలుగా చెయ్యాలన్నది బిగ్ బుల్ ప్లాన్. ఆ  ప్లాన్ ని శంకర్ కి చెప్తే శంకర్ కూడా ఒప్పుకుంటాడు. ఇంకో పక్క  'రా' డిపార్ట్మెంట్  అధికారి పరమేశ్(షాయాజీ షిండే) జన్నత్ లు కలిసి  శంకర్ కి తనకి ఉన్న సమస్య గురించి చెప్పాలనుకుంటారు.ఇండియా ముక్కలు అవ్వడానికి శంకర్ నిజంగానే బిగ్ బుల్ కి సహాయపడ్డాడా?  ఆ ఇద్దరు ఏం చెప్పాలనుకుంటున్నారు?  అసలు శంకర్ మొదటినుంచి  దొంగతనాలు ఎందుకు చేస్తున్నాడు?  బిగ్ బుల్ లాంటి సంఘ విద్రోహ శక్తితో  శంకర్ ఎందుకు చేతులు కలిపాడు?  తన తల్లిని చంపిన వాళ్ళని శంకర్ ఎలా అంతమొందించాడా లేదా ? అనేదే ఈ కథ 


ఎనాలసిస్ :

అసలు ఈ కథ లో ఏముందని పూరి అంత రిచ్ గా తీసాడో అర్ధం కానీ ప్రశ్న. ఓపెనింగ్ సీన్ నుంచి చివరి సీన్ వరకు  చాలా తెలుగు సినిమాల్లో చూసేసినవే. పైగా తన ఇస్మార్ట్ శంకర్ నే డిటో చూస్తున్నట్టుగా ఉంది. హీరో బాడీ లాంగ్వేజ్ ని మరో రకంగా ఫిక్స్ చేసుంటే బాగుండేది. ఇస్మార్ట్ శంకర్ లోని పోలీస్ ఆఫీసర్ చిప్ శంకర్ మైండ్ లోనే  ఉంది కాబట్టి ఆ దిశగా కథ ని ఆలోచించాలసింది.ఇక  ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే తల్లి సెంటిమెంట్ ని గత సినిమాల ప్రభావంతో పెట్టినట్టుగా ఉంది. హీరో హీరోయిన్ ల  ఇంట్రడక్షన్ దగ్గరనుంచే ఇస్మార్ట్ శంకర్  తరహాలో సాగబోతుందనే విషయం అర్థమైపోతుంది.చివరకి ఐటెం సాంగ్ కి కూడా హీరోయిన్ నే  వాడుకున్నారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. కాకపోతే  ఆ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం బాగా  పండింది.ఇక  ఎప్పుడైతే విలన్ సంజయ్ దత్(Sanjay Dutt)ఇండియాలో అడుగుపెట్టాడో అప్పటినుంచి కథ స్వరూపం మారిపోయింది. సెకండ్ ఆఫ్ లో ఏం జరుగుతుందో కూడా ప్రేక్షకుడు చెప్పేలా వరుస పెట్టి సీన్స్ వచ్చాయి. హీరో కూడా కథ కి తగట్టుగా మారిపోయాడు. ప్రత్యేకంగా చేసింది ఏమి లేదు. లాగ్ సీన్స్ కూడా బోలెడు. హీరో, విలన్ ఒకే మాట మీద ఉంటారని  సినిమా స్టార్టింగ్ లోనే చెప్పి రివర్స్ స్క్రీన్ ప్లే లో  కథనాలు ఉండాల్సింది.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:

రామ్ పోతినేని మరో సారి తన పవర్ ఫుల్ యాక్టింగ్ తో ఒక రేంజ్ లో పెర్ ఫార్మ్ చేసాడు.డాన్స్ అండ్ ఫైట్స్ లో తనకి తిరుగులేదని మరో సారి సిల్వర్ స్క్రీన్ సాక్షిగా చాటి చెప్పాడు. కాకపోతే కథ, కథనాల్లో గ్రిప్ లేకపోవడం వలన  తేలిపోయాడు. హీరోయిన్ కావ్య థాపర్ విషయానికి వస్తే క్యూట్ యాక్టింగ్ తో కట్టిపడేసింది. కాకపోతే గుర్తు పెట్టుకునే నటన కాదు. ఇక సంజయ్ దత్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇలాంటి క్యారెక్టర్స్ ఆయనకీ కొట్టిన పిండి.తమిళ సూపర్ స్టార్  విజయ్  లాస్ట్ మూవీ లియో లో కూడా ఇంచు మించు ఇదే తరహా బాడీ లాంగ్వేజ్ తో చేసాడు. మిగతా నటుల గురించి కూడా చెప్పుకోవాల్సిన పని లేదు. అలీ చేసిన కామెడీ వల్ల సినిమాకి ఎలాంటి ఉపయోగం లేదు.పాటలు  కూడా అదే కోవలోకి వస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. సీన్స్ లో బలం లేకపోయినా కాపాడింది. ఇక కెమెరా పని తనం, ఎడిటింగ్ కూడా పర్వాలేదనే స్థాయిలో ఉన్నాయి. ఇక పూరి  దర్శకత్వ ప్రతిభ బాగున్నా కూడా కథ కథనాలు  ఆ  ప్రతిభ గురించి చెప్పుకునే అవసరాన్ని కల్పించలేదు..నిర్మాణ విలువలు అయితే సూపర్ గా ఉన్నాయి. 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఫైనల్ గా చెప్పాలంటే... డబుల్ ఇస్మార్ట్  కథ, కథనాలలో కొత్తధనం లోపించింది. ఇస్మార్ట్ శంకర్ నే చూసినట్టుగా ఉంది.

- అరుణాచలం