Read more!

English | Telugu

సినిమా పేరు:దొంగల ముఠా
బ్యానర్:శ్రేయ ప్రోడక్షన్స్
Rating:2.25
విడుదలయిన తేది:Mar 18, 2011

ఓపెనింగ్ సీన్లో నారాయణ మూర్తి ( బ్రహ్మానందం ) అనే వ్యాపారవేత్తను కొందరు కిడ్నాప్ చేస్తారు. సుధీర్ (రవితేజ), అతని భార్య రాణి (ఛార్మి) కలసి కారులో రాణి స్నేహితురాలి పెళ్ళికి బయలు దేరతారు. దారిలో ఒక రిసార్ట్ దగ్గర కారు పాడవుతుంది. ఆ రిసార్ట్ లోకి వెళ్ళి అక్కడ రూమ్ తీసుకున్న వీరికి ఎటువంటి అనుభవాలెదురయ్యాయి, ఆ రిసార్ట్ లో ఉన్న వాళ్ళెవరు అన్నది మిగిలిన కథ.


ఎనాలసిస్ :

ఈ తెలుగు సినిమా రివ్యూ వ్రాసే ముందు ఆరున్నర లక్షల ఖర్చుతో, నాలుగున్నర రోజుల్లో ఇలాంటి ఒక సినిమా తీసినందుకు వర్మని మనం అభినందించాలి. ఈ సినిమా రివ్యూని ఆ దృష్టిలోనే వ్రాయటం జరుగుతూంది. కేవలం రాక్ కేజల్ అనే హోటల్‍ నీ, దాని పరిసర ప్రామతాలనూ ఉపయోగించుకుని ఈ చిత్రాన్ని తీశాడు వర్మ. వర్మ టాలెంట్ గురించి ఈరోజు కొత్తగా చెప్పేదేం లేదు. కానీ గతంలో స్టడీ కామ్ కేమెరాని సీనియర్ కెమెరామెన్లంతా వద్దంటే ఇలాగే విప్లవాత్మకంగా ఆ కెమెరాని తన తొలి చిత్రం"శివ"లో ఉపయోగించిన వాడు శివ. ఆ తర్వాత ఇప్పుడు ఛేజింగ్ సీన్లన్నీ ఆ కేమెరాతోనే అందరూ తీస్తున్నారు. ఈ చిత్రంలో కథలో దమ్ముంటే ఇది ఖచ్చితమైన కమర్షియల్ హిట్టే అయి ఉండేది.

 

కానీ రషీద్ (సత్యప్రకాష్) అనే బుల్లి డాన్ తన బాస్ మున్నాభాయ్ ( ప్రకాష్ రాజ్) ఆజ్ఞ మేరకు తన అనుచరులతో నారాయణ మూర్తిని కిడ్నాప్ చేయిస్తే, స్పెషల్ బ్రాంచ్ ఇనస్పెక్టర్ శివ (మంచు లక్షి) ఆమె సబార్డినేట్ రిచర్డ్ (సునీల్) కలసిఈ కిడ్నాప్ కేసుని సాల్వ్ చేయటానికి వెళ్ళి, తామిద్దరూ రషిద్ భాయ్ మనుషులమని చెప్పి ఆ కిడ్నాపర్స్ చెర నుంచి నారాయణ మూర్తిని, సుధీర్, రాణిలను కాపాడి, మున్నాభాయ్ ని అరెస్ట్ చేయటం అనే చిన్న థీమ్ తో ఈ సినిమా తీయటం వల్ల ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోదు. కానీ, ఈ టెక్నాలజీని వర్మ వాడుకున్న తీరు అందరికీ శిరోధార్యం. తక్కువ సమయంలో, అతి తక్కువ ఖర్చుతో కేనన్ 5డి కెమెరాలను ఉపయోగించి తీసిన ఈ సినిమా వర్మ చెప్పినట్టు విడుదలయిన ప్రతి చోటా తొలి ఆట ఆడితే హిట్టయినట్లే.

 

ఎనీ వే వర్మ ది గ్రేట్ మరోసారి సినీ నిర్మాణంలో విప్లవాత్మకమైన మార్పుని ఈ "దొంగల ముఠా" సినిమాతో తీసుకొచ్చాడని చెప్పవచ్చు. సంగీతం - ఈ సినిమాలో ఉన్న ఒకే ఒక్క పాట ఈ చిత్రం టైటిల్ సాంగ్. అదికూడా సినిమా అయిపోయాక మనకు చూపిస్తాడు. ఈ చిత్రానికి అమర్ బ్యాగ్రౌండ్ సంగీతాన్ని అందించగా, పాటకు సత్యం సంగీతం అందించారు. మొత్తానికి ఈ సినిమా సంగీతం బాగుంది. మాటలు - ఈ సినిమాలో మాటలకు అవకాశమే చాలా తక్కువ. అవి చాలా క్లుప్తంగా ఉన్నాయి. కానీ అవసరమైన పంచ్ లు పెద్దగా లేకపోవటం మైనస్ పాయింట్.

పాట -: ఈ పాటను సిరాశ్రీ వ్రాశారు. అది కూడా చక్కని ప్రాసతో వ్రాయటం బాగుంది. ఈ పాట ఆకట్టుకుంటుంది.

ఆర్ట్ -: కృష్ణ మాయ ఆర్ట్ పనితనం బాగుంది.

యాక్షన్-: ఒ.కె.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

వర్మ ఎలా ఈ సినిమాని కేవలం నాలుగున్నర రోజుల్లో, ఆరున్నర లక్షల అతి తక్కువ ఖర్చుతో ఈ సినిమా తీశాడాని తెలుసుకోటానికీ, కేనన్ 5డి కెమెరాతో తీస్తే ఎలాంటి క్వాలిటీ స్క్రీన్ మీద కనపడుతుందీ అని తెలుసుకోవాలంటే ఈ సినిమా తప్పక చూడాల్సిందే. లేకపోతే ఇదేదో అద్భుతమైన సినిమా అనుకుని చూడాలనుకుంటే ఈ సినిమాని చూడక్కరలేదు.