English | Telugu

సినిమా పేరు: దొంగల బండి
బ్యానర్: జి.యస్.కె. నెట్వర్క్
Rating:2.00
విడుదలయిన తేది:Dec 12, 2008
నిజాం సంస్థానం భారతదేశంలో విలీనమయ్యే సమయాన, నిజాం నవాబు తన విధిని భద్రంగా దాయమని తన సైన్యాధిపతికి అప్పచెపుతాడు. ఆ నిధిని దాయటానికి తీసుకెళ్ళిన ముగ్గురు వ్యక్తులు (ఆలీ, యమ్‌.యస్‌, వేణుమాధవ్‌) దొంగలు కావటం వలన, ఆ నిధిని తామే దొంగిలించి, అడవిలో ఒక చోట భద్రంగా దాచి, ఆ ప్రదేశాన్ని ఒక మేప్‌లా గీసి, ఆ మేప్‌ని మూడు ముక్కలుగా చేసి. తలో ఒక ముక్క తీసుని ఎవరి దారిన వారు వెళతారు. ఆ ముగ్గురు దొంగల వారసులు ఆ నిధికోసం ప్రయత్నించి దాన్ని సంపాదించటానికి ఎన్ని పాట్లు పడ్డారనేది సరదా సరదాగా సాగిపోయే మిగిలిన కథ.
ఎనాలసిస్ :
సినీ పరిశ్రమలో మాటల రచయితగా ఉన్న వేగేశ్న సతీష్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తొలిసారిగా దర్శకత్వం వహించిన ఆ తడబాటు ఏమాత్రం కనిపించకుండా చక్కని దర్శకత్వ ప్రతిభను కనపరచారు సతీష్‌. స్వతమాగా తాను కామెడీ రచయిత కావటం వల్ల, ఈ చిత్రం నిండా కామెడీ పంచ్‌లు పుష్కలంగా ఉన్నాయి. టేకింగ్‌ పరంగా చూసినా, స్ర్కీన్‌ప్లే పరంగా చూసినా ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది. దర్శకుడిగా తన తొలి చిత్రంతో సినీ పరిశ్రమలో తన స్థానాన్ని పదిలం చేస్తున్నారు సతీష్‌. ఇక నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి. ఇది ఒక కామెడీ చిత్రంలా కాక ఒక పెద్ద హీరో చిత్రానికి ఖర్చు పెట్టినట్టు భారీ సెట్టింగ్స్‌తో ఈ చిత్రాన్ని తీయడం, క్యాలిటీ విషయంలో నిర్మాత రాజీ పడని ధోరణిని తెలియజేస్తుంది. దండకారణ్యంలోని కోయగూడెం సెట్‌, చివరి పాటలో సెట్‌ ఇలా అన్ని విషయాల్లో నిర్మాత రాజీపడకుండా ఖర్చుచేశారు.నేరేష్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. అతని స్టైల్‌ అతనిదే. అయితే ఈ చిత్రంలో డ్యాన్స్‌లో క్వాలిటీపరంగా మెరుగుపరిచాడు నరేష్‌. బాలకృష్ణను, పవన్‌ కళ్యాణ్‌ని, డాక్టర్‌ రాజశేఖర్‌ని నరేష్ ఇమిటేట్‌ చేసిన తీరు బాగుంది. కామెడీ హీరోగా నరేష్‌ చేసే సినిమాలు అప్పుడప్పుడూ చేస్తూ, ఇక అతను మాస్‌ హీరోగా ఎదిగే ప్రయత్నం కూడా ధైర్యంగా చెయొచ్చు. తాన్యా ఫరవాలేదు. ఆలీ, యమ్‌.యస్‌., కొండవలస, వేణుమాధవ్‌, కోవై సరళ, షకీలా, జీవా, రావు రమేష్‌రావు తదితరులు తమవంతు కామెడీని బాగానే పండించారు. సంగీతం:- ఈ చిత్రంలోని పాటలన్నీ బాగున్నాయి. పాటల్లో సాహిత్యం చక్కగా శ్రవణానందంగా వినపడటం బహుశా ఈ సినిమా పాటల్లోనే ఈ మధ్య వినగలిగింది. అందుకు సంగీత దర్శకుడుకి కృతజ్ఞతలు చెప్పాలి. రీ-రికార్డింగ్‌లో అతని అనుభవరాహిత్యం కొంచెం వినిపిస్తుంది. కానీ ఓవరాల్‌గా ఈ చిత్రంలోని సంగీతం బాగుంది. బాగుంది. ఎడిటింగ్:- ఇంకా క్రిస్ప్‌గా కట్‌ చేస్తే బాగుండేది. ఆర్ట్‌:- ఆర్ట్‌ డైరెక్షన్‌ బాగుంది. కోయగూడెం సెట్‌ చక్కగా అచ్చం నిజమైనకోయగూడెంలా చూడముచ్చటగా వేశాడు ఆర్ట్‌ డైరెక్టర్‌ రమణ. కొరియోగ్రఫీ:- ఈ సినిమాలో కాన్సెప్ట్‌ బేస్ట్‌గా కొరియోగ్రఫీ చేసినట్టు కనిపిస్తుంది. కొరియోగ్రఫీ అన్ని పాటల్లో బాగుంది. ముఖ్యంగా "అమ్మ చెప్పిందీ" పాటలో ఇంకా బాగుంది. లిన కథ.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
మీరు ఏ అంచనాలు లేకుండా వెళ్ళితే సకుటుంబంగా కాసేపు నవ్వుకొని ఎజాయ్‌ చేయాలంటే ఈ చిత్రాన్ని చూడొచ్చు.

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25