Read more!

English | Telugu

సినిమా పేరు:డాన్ శీను
బ్యానర్:ఆర్ ఆర్‍ మూవీ మేకర్స్
Rating:2.75
విడుదలయిన తేది:Aug 6, 2010
అమితాబ్ బచ్చన్ "డాన్" సినిమా చూసిన ఒక పిల్లాడు విపరీతంగా ప్రభావితుడై, తన పేరుని "డాన్ శీను" గా మార్చుకుంటాడు.అతని జీవితాశయం పెద్ద డాన్ కావాలని.చిన్నప్పటి నుంచీ డాన్ లాగే బిహేవ్ చేయటం వల్ల, ఇంట్లో తల్లి అతన్ని కొట్టి హాస్టల్లో పడేయమని అతని తండ్రితో చెపుతుంది.అందరితో డాన్ లా ప్రవర్తించే శీను ఆ ఊరి థియేటర్లో ఆపరేటర్ నిబాబాయ్ అనీ,అతని కూతుర్ని అక్కా అనీ పిలుస్తూంటాడు.ఇంట్లోంచి పారిపోయిన శీనుని తమ ఊరికెళుతున్న థియేటర్ ఆపరేటర్ తమతోటి తీసుకెళ్తాడు. కట్ చేస్తే డాన్ శీను సిటీకి వస్తాడు.మాదాపూర్ మాచిరాజు(షాయాజీ షిండే), నారాయణ గూడ నర్సింగ్(శ్రీహరి) అనే డాన్ లకిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు.మాచిరాజు ప్రతీదాంట్లో నర్సింగ్ తో పోటీపడతాడు.నర్సింగ్‍ తన చెల్లెల్ని జర్మనీలో చదివిస్తూంటే,మాచిరాజు కూడా తన చెల్లిని జర్మనీలో అదే కాలేజీలో చదివిస్తూంటాడు.వీళ్ళందరికీ గురువు, గాడ్ ఫాదర్ అయిన ముఖేష్ దుగ్గల్(మహేష్ మంజ్రేకర్) కొడుకుని డాన్ శీను కొడతాడు.దాంతో డాన్ శీనుని మాచిరాజు చేరదీస్తాడు.నర్సింగ్‍ మీద పగతీర్చుకోటానికి తన దగ్గర పనిచేస్తున్న నర్సింగ్ మనిషిని చంపి, "నీ కొడుకుని కొట్టిన డాన్ శీనునినేనే చంపేశాన"ని ముఖేష్ దుగ్గల్ దగ్గర కలరిస్తాడు.అప్పుడు డాన్ శీనుని జర్మనీ వెళ్ళి నర్సింగ్ చెల్లిని ప్రేమించమని చెప్పి డాన్ శీనుని జర్మనీ పంపుతాడు మాచిరాజు.జర్మనీ వెళ్ళిన డాన్ శీను ఏం చేశాడు...? ఎవర్ని ప్రేమించాడు...?తన ప్రాణాలు పణంగా పెట్టి మరీ ఈ డాన్లిద్దరితో ఎందుకు అంత రిస్క్ తీసుకుని అలా ఆడుకున్నాడూ అన్నది మిగిలిన కథ.
ఎనాలసిస్ :
ఈ సినిమాకి దర్శకత్వం వహించిన గోపీచంద్ మలినేనిని అభినందించాలి.ఎందుకంటే ఇది అతనికి తొలి చిత్రం.అయినా ఆ తడబాటు ఎక్కడా ఈ చిత్రంలో కనిపించదు.పైగా బాగా అనుభవమున్న దర్శకుడిలా ఈ చిత్రాన్ని డీల్ చేశాడతను.తెలుగు తెరకు గోపీ మరో వినాయక్, రాజమౌళి వంటి వాడనటంలో సందేహం లేది.అతని తొలి చిత్రమే శతదినోత్సవ చిత్రమని ఘంటాపదంగా చెప్పొచ్చు.ఈ సినిమా మొదలైన దగ్గర నుండీ చివరి వరకూ ఎంటర్ టాయన్ మెంట్ తప్ప మరొకటి కనిపించదు.ఈ కథలో చాలా ట్విస్టులుంటాయి.మాచిరాజు చెల్లిని ప్రేమిస్తున్నట్లు నర్సింగ్ దగ్గరా, నర్సింగ్ చెల్లిని ప్రేమిస్తున్నట్లుమాచిరాజు దగ్గర డాన్ శీను ఆడే డ్రామా, నర్సింగ్ చెల్లిని డాన్ శీను పటాయించే విధానం వంటివి సగటు ప్రేక్షకుణ్ణి బాగా అలరిస్తాయి. ఈ సినిమా తొలి సగం రవితేజతో ఆలీ కామేడీని పండిస్తే, సెకండ్ హాఫ్ లో రవితేజకు బ్రహ్మానందం తోడవుతాడు.ఇక కామెడీకి కొదవేముంటుంది. ఇక నిర్మాణపు విలువలు గురించి చెప్పాలంటే ఈ చిత్రానికి ఇరవై మూడు కోట్లయిందని వినపడింది.ఆ ఖర్చంతా మనకు స్క్రీన్ మీద కనపడుతుంది.ఈ చిత్ర నిర్మాణంలో నిర్మాత ఎక్కడా రాజీపడలేదు.ఒక కొత్త దర్శకుణ్ణి నమ్మి అంతడబ్బు ఖర్చుచేయటానికి చాలా దమ్ము కావాలి. నటన - రవితేజ యధాప్రకారం ఫుల్ ఎనర్జీతో నటించాడు.ఇది మామూలే. శ్రీహరి నటన, అతని పాత్ర "ఢీ" సినిమా స్టైల్లో సాగుతుంది. మాచిరాజుగా షాయాజీ షిండే కూడా చక్కగా నటించాడు.ఇక ఆలీ, బ్రహ్మానందం, రఘుబాబు,సురేఖ అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.ఇక హీరోయిన్లు శ్రియ, సమజనా సుఖానీ ఒకరికి మించి ఒకరు పోటీపడి మరీ ఈ చిత్రంలో గ్లామర్ వొలికించారు. సంగీతం -మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఇప్పటికే పెద్ద హిట్టయింది.పాటలన్నీ బాగున్నాయి.రీ-రికార్డింగ్‍ ఈ చిత్రానికి ప్లస్సయింది. [Fore Color] సినిమాటోగ్రఫీ - చాలా బాగుంది.పాటల్లో జర్మనీ అందాలు చాలా బాగున్నాయి.యాక్షన్ సీన్లలో కూడా సమీర్ రెడ్డి కేమెరా వర్క్ బాగుంది. మాటలు -కోన వెంకట్ కలం ఈ చిత్రంలో మరింత పదును తేలింది.ఈ చిత్రంలోని మాటలు వింటూంటే రవితేజలాంటి పక్కా మాస్ హీరోకి ఎలాంటి మాటలు రాయాలో కోన వెంకట్ కి తెలిసినట్లు ఇంకేరవయితకీ తేలిదేమోననిపిస్తుంది. ఉదాహరణకి "బ్రెడ్డు ముక్కలు తినే మీకే ఇంత పొగరుంటే, గొడ్డుకారం తినే నాకెంత బలుపుండాల్రా" వంటి డైలాగులు మాస్ ని బాగా ఆకట్టుకుంటాయి. ఎడీటింగ్ - గౌతంరాజు ఎడిటింగ్ కి రారాజు.ఆయన ఎడిటింగ్ కి వంకపెట్టగలమా...? పాటలు- ఈ చిత్రంలోని పాటలన్నీ మాస్ సాంగ్సే.అన్నీ బాగున్నాయి. కొరియోగ్రఫీ- అన్ని పాటల్లోనూ బాగుంది కాబట్టే సిగిరేట్ తాగటానికీ, టీలు తాగటానికీ జనం ఎవరూ బయటకి పోలేదు.ఇది చాలుగా ఈ సినిమాలో కోరియోగ్రఫీ ఎలాగుందో చెప్పటానికి. యాక్షన్- ఇద్దరు ఫైట్ మాస్టర్లీ చిత్రానికి ఒకరికొకరు పోటీపడి మరీ ఫైట్లు కంపోజ్ చేశారు.చూస్తే మీకే తెలుస్తుంది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఒక పక్కా మాస్ ఎంటర్ టైనర్ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ సినిమాని తప్పకుండా చూడాలి.