English | Telugu

సినిమా పేరు:ధృవ‌
బ్యానర్:గీతా ఆర్ట్స్
Rating:2.50
విడుదలయిన తేది:Dec 9, 2016

ఊహ‌ల్లో విహ‌రించి ఓ అంద‌మైన బొమ్మ గీయ‌డం  ఓ ఆర్ట్‌. అలా గీసిన బొమ్మ‌నే మ‌ళ్లీ గీయ‌డం...  రీమేక్‌. ఎంత ప్ర‌య‌త్నించినా... ఒర్జినాలిటీని మ‌ళ్లీ తీసుకురావ‌డం క‌ష్టాతిక‌ష్టం. ఒక వేళ తీసుకొచ్చినా.. అదెందుకో అంత సంతృప్తి ఇవ్వ‌దు. ఇది తెలిసి కూడా రీమేక్ క‌థ‌ల్ని చేయ‌డానికి మ‌న‌వాళ్లు తెగ ఉత్సాహ‌ప‌డుతుంటారు.  రీమేక్ అన‌గానే..  అస‌లు క‌థ‌ని పాడు చేయ‌కుండాఉంటే చాలు..  అనే రంగంలోకి దిగుతారు. చాలా కొద్ది సినిమాలు మాత్ర‌మే ఆ మార్జిన్‌కి చాలా ద‌గ్గ‌ర‌గా వ‌స్తాయి. అలాంటి సినిమాల్లో ధృవ ఒక‌టి.  త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన త‌ని ఒరువ‌న్‌కి రీమేక్ ఇది. వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న రామ్ చ‌ర‌ణ్‌కి ఈ రీమేక్ ఎంత వ‌ర‌కూ రిలీఫ్ ఇచ్చింది?  ధృవ రిజ‌ల్ట్ ఏంటి?


*  క‌థ‌

సిద్దార్థ్ అభిమ‌న్యు (అర‌వింద్ స్వామి) ఓ సైంటిస్ట్‌. అయితే తెర చాటున ఎన్నో అరాచ‌కాలు చేస్తుంటాడు. త‌న పావులుగా ముగ్గుర్ని వాడుకొంటూ.. వెనుక నుండి త‌తంగం అంతా న‌డిపిస్తుంటాడు. మ‌రోవైపు ధృవ (రామ్‌చ‌ర‌ణ్‌) ఓ సిన్సియ‌ర్ ఐపీఎస్ ఆఫీస‌ర్‌. ట్రైనింగ్‌లో ఉన్న‌ప్పుడే ఆన్ డ్యూటీలో... అక్ర‌మార్కుల గుట్టు ర‌ట్టు చేస్తుంటాడు. ఐపీఎస్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టాక‌.. త‌న దృష్టి సిద్దార్థ్ అభిమ‌న్యుపై ప‌డుతుంది. ఒక్క సిద్దార్థ్ అభిమ‌న్యుని ప‌ట్టుకొంటే.. వంద మంది అక్క‌మార్కుల్ని అంత‌మొందించిన‌ట్టు అవుతుంద‌ని సిద్దార్థ్‌ని టార్గెట్ చేస్తాడు ధృవ‌. మ‌రి ఆ ప్ర‌య‌త్నంలో ధృవ విజ‌యం సాధించాడా, లేదా?  అస‌లింత‌కీ.. సిద్దార్థ్ అభిమ‌న్యు ఎలాంటి వాడు??  ఈ విష‌యాలు తెలియాలంటే ధృవ చూడాల్సిందే.


ఎనాలసిస్ :

త‌ని ఒరువ‌న్ ని జాగ్ర‌త్త‌గా ఫాలో అయిపోయాడు సురేంద‌ర్ రెడ్డి. మ‌రీ ఫ్రేమ్ టూ ఫ్రేమ్ కాపీ చేయ‌లేదు గానీ.. ఏ సీన్‌నీ వ‌ద‌ల‌కుండా ప‌క్కాగా దించేశాడు. నిజానికి త‌ని ఒరువ‌న్‌లో మార్చ‌ద‌గిన విష‌యాలూ పెద్ద‌గా ఉండ‌వు. అందులో ఏ సీన్ త‌ప్పినా స్క్రిప్టు చెడిపోతుంది. అందుకే... సురేంద‌ర్ రెడ్డి ఆ సాహ‌సం చేయ‌లేక‌పోయాడు. త‌ని ఒరువ‌న్ క‌థే.. ఇంట్ర‌స్టింగ్ గా ఉంటుంది. అదే ఆసక్తి , టెంపో.. ధృవ‌లోనూ క‌నిపించేలా జాగ్ర‌త్త ప‌డ్డాడు సూరి. క‌థ ప్రారంభం.. చ‌ర‌ణ్ ఇంట్ర‌డ‌క్ష‌న్ ఇవ‌న్నీ ఆస‌క్తి క‌ట్టించేవే. అయితే ర‌కుల్‌తో ల‌వ్ ట్రాక్ బోర్ కొట్టించింది. అర‌వింద్ స్వామిపై చ‌ర‌ణ్ గురి పెట్టేంత వ‌ర‌కూ క‌థ న‌త్త‌న‌డ‌క న‌డుస్తూనే ఉంటుంది. అర‌వింద్ - చ‌ర‌ణ్ యుద్దం ప్రారంభ‌మ‌య్యాక క‌థ ర‌క్తి క‌డుతుంది. ఇంట్ర‌వెల్‌కి ముందు ప‌ది నిమిషాలూ... సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడ‌తాయి.  `బ‌గ్‌..` ఎపిసోడ్‌తో... సినిమా అంతా విల‌న్ వైపుకు ట‌ర్న్ తీసుకొంటుంది. అర‌వింద్ స్వామి విజృంభించేది అక్క‌డే. ఎప్పుడైతే హీరో ఆ `బ‌గ్‌`ని త‌న‌కు అనుకూలంగా మార్చుకొన్నాడో అప్ప‌టి నుంచి హీరోయిజం మొద‌ల‌వుతుంది. ఆయా స‌న్నివేశాల్ని త‌ని ఒరువ‌న్ నుంచి మ‌క్కీకి మ‌క్కీ దింపేసినా.. ఆ సినిమా చూడ‌ని వాళ్ల‌కు మాత్రం థ్రిల్లింగ్ క‌లిగిస్తాయి. హీరోహీరోయిన్లు ల‌వ్ ప్ర‌పోజ‌ల్ సీన్ అయితే... కేక పెట్టిస్తుంది. ఆ త‌ర‌వాత‌.. సినిమా మ‌ళ్లీ నత్త‌న‌డ‌క న‌డుస్తుంది. ప‌తాక స‌న్నివేశాల్ని మాత్రం ఆస‌క్తిగా మ‌లిచాడు. అక్క‌డ‌క్క‌డ సినిమా టెంపో త‌గ్గ‌డం.. మ‌ళ్లీ పుంజుకోవ‌డం ధృవ‌లో క‌నిపిస్తాయి. కొన్ని సీన్లు మ‌రీ ఇంలిజెంట్ గా ఉంటాయి. సామ‌న్య ప్రేక్ష‌కుల‌కు అవి అర్థ‌మ‌వుతాయా అన్న‌ది సందేహం. మ‌ధ్య మ‌ధ్య‌లో వ‌చ్చే పాట‌లు క‌థాగ‌మ‌నానికి అడ్డుత‌గులుతాయి. త‌ని ఒరువ‌న్‌ని ధృవ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మ‌రిపించదు. అలాగ‌ని... ఆ క‌థ‌ని పాడు చేయ‌లేదు కూడా.

* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

చర‌ణ్ బాగా క‌ష్ట‌ప‌డ్డాడు. సిక్స్ ప్యాక్ కోస‌మే కాదు.. అన్ని విష‌యాల్లోనూ. ఇలాంటి క‌థ ఎంచుకోవ‌డం కాస్త సాహ‌స‌మే అనుకోవాలి. ఫ‌క్తు ఫార్ములా క‌థ‌ల‌తో చ‌ర‌ణ్ కూడా విసిగిపోయి ఉంటాడు. త‌న మేకొవ‌ర్ బాగుంది. అయితే కొన్ని డైలాగులు ప‌ట్టిబ‌ట్టి మ‌రీ చెబుతున్నాడు. దాంతో స‌హ‌జ‌త్వం మాయ‌మ‌వుతోంది. చ‌ర‌ణ్ అంటే డాన్సులు అనుకొనేవాళ్లు మాత్రం కాస్త నిరుత్సాహ‌ప‌డ‌తారు. ర‌కుల్‌ది గ్లామ‌ర్ డాల్ పాత్రే అనుకొంటే.. తాను కాస్త ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అక్క‌డ‌క్క‌డా న‌టించే ప్ర‌య‌త్నం చేసింది. అమాయ‌క నాన్న‌గా పోసాని పాత్ర కూడా ఆక‌ట్టుకొంటుంది. న‌వ‌దీప్ ఓకే అనిపించాడు. ఇక అర‌వింద్ స్వామి అయితే విజృంభించాడు. త‌ని ఒరువ‌న్‌లో ఎలాగైతే సినిమాని త‌న వైపుకు తిప్పుకొన్నాడో.. ఇక్క‌డా అదే చేశాడు. చ‌ర‌ణ్ కంటే స్టైలీష్‌గా క‌నిపించాడు. ఆ మాట‌కొస్తే.. చ‌ర‌ణ్ కంటే అందంగా ఉన్నాడు.

* సాంకేతిక వ‌ర్గం
టెక్నిక‌ల్‌గా ధృవ సూప‌ర్బ్‌గా ఉంది. సూరి స్టైలీష్ మేకింగ్ ప్ర‌తీ సీన్‌లోనూ క‌నిపించింది. ఫొటోగ్ర‌ఫీ సూప‌ర్బ్‌. హిప్ ఆప్ త‌మిళ నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకొంటుంది. పాట‌ల్లో ఇలాంటి సౌండింగ్ మ‌న‌కు కాస్త కొత్త‌.  ఫ‌స్టాఫ్‌, సెకండాఫ్ అక్క‌డ‌క్క‌డ సినిమాని ట్రిమ్ చేసుకోవొచ్చు.

 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

* ఫైన‌ల్ ట‌చ్ :   

త‌ని ఒరువ‌న్ మార్క్‌కి దగ్గ‌ర‌గా వెళ్ల‌గ‌లిగింది ధృవ‌. నిజానికి ఇలాంటి సినిమాల్ని రీమేక్ చేయ‌డం కూడా క‌ష్ట‌మే. కాక‌పోతే.. చ‌రణ్‌, సూరి త‌మ వంతుగా ప్ర‌య‌త్నించారు. అంతే.

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25