English | Telugu

సినిమా పేరు:కరెంట్
బ్యానర్:శ్రీ నాగ్ కార్పొరేషన్
Rating:2.00
విడుదలయిన తేది:Jun 19, 2009
బ్యానర్:శ్రీ నాగ్ కార్పొరేషన్
Rating:2.00
విడుదలయిన తేది:Jun 19, 2009
ఒకమ్మాయి స్నేహ (స్నేహ ఉల్లాల్)ని చూసిన ఒకబ్బాయి సుశాంత్ (సుశాంత్) వెంటనే ప్రేమలో పడటం, అలాగే ఆ అమ్మాయిచేత ప్రేమింపబడటం, ఆ తర్వాత ఆ అమ్మాయి తండ్రి (చరణ్ రాజ్)తో విభేదించి ఆమెకు దూరమవటం, ఆ అమ్మాయి కోరిక మేరకు ఆమె మనసులో నుంచి తన మీద ఉన్న ప్రేమను తొలగించటం, ఆ అమ్మాయి వేరే సంబంధం చేసుకోటానికి సిద్ధపడటం, అయినా చివరికి వీరిద్దరూ కలవటం క్లుప్తంగా ఈ చిత్ర కథ. సర్వే డిపార్ట్మెంటులో పనిచేసే తనికెళ్ళభరణి కొడుకు సుశాంత్. అతని భార్య సుధ. ఇతనికి తరచూ ట్రాన్స్ ఫర్ అవుతూంటుంది.అలా ఒక ఊరినుంచి మరో ఊరికి మారూతూండగా రైల్వే స్టేషన్‌లో ఈ సినిమా మొదలవుతుంది. సుశాంత్ చేద్దాంలే.. చూద్దాంలే అనే టైపు మనిషి. పొద్దున్నే తొమ్మిదిన్నరకు అతని పేరెంట్స్ బలవంతంగా లేపితే కానీ కాలేజీకి కూడా పోని వ్యక్తి సుశాంత్. ఇంకా చెప్పాలంటే "నిన్నటి గురించి వర్రీ లేదు...రేపటి గురించి హర్రీ లేద"నే నేటితరం యువతకు ప్రతీక.అతను ఆ ఊరికి రాగానే ఒకమ్మాయిని పార్కులో చూస్తాడు. ఆమె ఆ ఊరిలో జడ్జిగారమ్మాయి స్నేహ. ఆమెను సుశాంత్ ప్రేమించినా ఆమె ఇతన్ని ప్రేమించదు. లక్కీగా సుశాంత్ చదివే కాలేజీలోనే ఆమె కూడా చదువుతూంటుంది. ఆ కాలేజీలో చేరిన దగ్గర నుంచీ ఆమెకు సైటుకొడుతుంటాడు సుశాంత్. స్నేహకు కలలు బాగా వస్తూంటాయి. దాన్ని అలుసుగా తీసుకుని ప్రతిరోజూ ఆమె ఇంటికి రాత్రిపూట వెళ్ళి అది కలో నిజమో ఆమెకు తెలియకుండా అయోమయంలో పడేస్తాడు సుశాంత్. పైకి ఆమెను పట్టించుకోకుండా ఉన్నట్టు నటిస్తూ, రాత్రి పూట ఆమెకు కల్లోకి వచ్చినట్టుగా కనిపిస్తూ ఆమెను ప్రేమిస్తూంటాడు. చివరికి ఈ విషయం తెలుసుకున్న స్నేహ చివరికి అతనితో ప్రేమలో పడుతుంది.ఈ విషయం తన తండ్రికి చెపితే, అతను సుశాంత్‌ని రేపు తొమ్మిదింటికి ఇంటికి తీసుకురమ్మని స్నేహతో చెపుతాడు. కానీ పదయినా సుశాంత్ స్నేహ ఇంటికి రాడు. తీరా సుశాంత్ పొడిచేస్తున్న రాచకార్యం ఏమిటయ్యా అంటే కాలేజీ గ్రౌండ్‌లో క్రికెట్ ఆడటం.అక్కడికే వచ్చి స్నేహ అతన్ని తన ఇంటికి తీసుకెళ్ళి తన తండ్రికి ఇతన్ని పరిచయం చేస్తుంది. అక్కడ సుశాంత్‌తో మాట్లాడిన స్నేహ తండ్రికి సుశాంత్ ఒక బాధ్యలేని వ్యక్తిగా, దేన్నీ సీరియస్‌గా తీసుకోని వ్యక్తిగా, జీవితంలో ఒక లక్ష్యం లేని వ్యక్తిగా కనిపిస్తాడు.అదే సుశాంత్‌తో అంటాడు. దాంతో కోపం వచ్చిన సుశాంత్ "నేనింతే నేనిలాగే ఉంటాను... ఎవరి కోసమూ మారను" అని స్నేహతో అంటాడు. కానీ అతనున్నంత మామూలుగా స్నేహ ఉండలేకపోతుంది.ఆమె సుశాంత్‌తో "నామనసులో ప్రేమను పుట్టించింది నువ్వే గనక, ఆ ప్రేమని నా మనసులోనుంచి తీసివేయ"మని అడుగుతుంది. దానికి సరేనంటాడు సుశాంత్. ఒకరి మనసులో కలిగిన ప్రేమను తీసివేయటం సాధ్యమా...? అసలు ప్రేమ అనేది నమ్మకమా...? బాధ్యతా...? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి.