English | Telugu

సినిమా పేరు:క్లైమాక్స్
బ్యానర్:కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్
Rating:2.25
విడుదలయిన తేది:Mar 5, 2021

సినిమా పేరు: క‌్లైమాక్స్‌
తారాగ‌ణం:  రాజేంద్ర‌ప్ర‌సాద్‌, శ్రీ‌నివాస్‌, పృథ్వీ, శివ‌శంక‌ర్‌, సాషా సింగ్‌, శ్రీ‌రెడ్డి, ర‌మేశ్‌
మ్యూజిక్‌:  రాజేశ్, నిధ్వాన‌‌
సినిమాటోగ్ర‌ఫీ: ర‌వికుమార్ నీర్ల‌
ఎడిటింగ్‌: బ‌స్వా పైడిరెడ్డి
ఆర్ట్‌:  రాజ్‌కుమార్‌, ర‌వి
కొరియోగ్ర‌ఫీ:  ప్రేమ్ ర‌క్షిత్‌
నిర్మాతలు:  రాజేశ్వ‌ర్ రెడ్డి, క‌రుణాక‌ర్ రెడ్డి
ద‌ర్శ‌క‌త్వం: భ‌వానీ శంక‌ర్ కె.
బ్యాన‌ర్‌: కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్
విడుద‌ల తేదీ: 5 మార్చి 2021

రాజేంద్ర‌ప్ర‌సాద్‌తో ఇదివ‌ర‌కు 'డ్రీమ్' (2012) అనే అవార్డులు పొందిన చిత్రాన్ని డైరెక్ట్ చేసిన‌ భ‌వానీ శంక‌ర్ మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు ఆయ‌న‌తోటే తీసిన సినిమా 'క్లైమాక్స్‌'. కామెడీ హీరోగా ల‌బ్ధ‌ప్ర‌తిష్ఠుడైన రాజేంద్ర‌ప్ర‌సాద్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మారాక చాలా బిజీ అయ్యారు. ఆయ‌న 'క్లైమాక్స్‌'లో మ‌రో విల‌క్ష‌ణ పాత్ర‌తో మ‌న‌ముందుకు వ‌చ్చారు. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లో క‌నిపించిన రాజేంద్ర‌ప్ర‌సాద్ రూపం ఇప్ప‌టికే సినీ ప్రియుల్ని ఆక‌ర్షించింది. థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వ‌డానికి ముందుగానే మార్చి 4 సాయంత్రం 'క్లైమాక్స్‌'ను రామానాయుడు ప్రివ్యూ థియేట‌ర్‌లో మీడియాకు ప్ర‌ద‌ర్శించారు. మ‌రి సినిమా ఎలా ఉందో చూద్దాం ప‌దండి.

క‌థ‌
వ‌య‌సు మ‌ళ్లిన విజ‌య్ మోడీ (రాజేంద్ర‌ప్ర‌సాద్‌)కి ఇద్ద‌రు భార్య‌లు, ఇద్ద‌రు కొడుకులు. ఒక మినిస్ట‌ర్‌కు బినామీ అని జ‌నం చెప్పుకునే అత‌ను ప‌వ‌ర్‌లోకి రావాల‌నీ, సినీ హీరో కావాల‌నీ, విలాస‌వంత‌మైన జీవితం గ‌డ‌పాల‌నీ త‌పిస్తుంటాడు. అలాంటివాడు దారుణ‌ హ‌త్య‌కు గుర‌వుతాడు. హంత‌కుడు అత‌డి చేతి, కాలి వేళ్ల‌ను న‌రికేస్తాడు, క‌ళ్లు పీకేస్తాడు. అత‌డిని ఎవ‌రు హ‌త్య చేశారో తెలుసుకోవ‌డం కోసం పోలీసులు జ‌రిపే ఇన్వెస్టిగేష‌న్‌లో విజ‌య్ మోడీ గురించి ఒక్కొక్క విష‌య‌మే రివీల్ అవుతూ వ‌స్తుంది. అత‌డికి అమ్మాయిల పిచ్చి ఉంద‌నీ, మినిస్ట‌ర్‌కు సంబంధించిన‌ భూవివాదంలో హ‌త్య‌లు కూడా చేశాడ‌నీ, ఆస్తుల‌కు మించి అప్పులు ఉన్నాయ‌నీ తెలుస్తుంది. ఇంత‌కీ అత‌డిని ఎవ‌రు చంపారు? క‌్లైమాక్స్‌లో వెల్ల‌డైన షాకింగ్ ట్రూత్ ఏమిటి?


ఎనాలసిస్ :

మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ చుట్టూ న‌డిచే ఈ క‌థ‌లో ఫ‌స్టాఫ్ ఆర్డిన‌రీగా న‌డిస్తే, సెకండాఫ్ గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ప‌రుగులు పెడుతుంది. సినిమా నిడివి 79 నిమిషాలే కావ‌డంతో మ‌నం విసుగు చెంద‌డానికి పెద్ద‌గా అవ‌కాశం ఇవ్వ‌లేదు ద‌ర్శ‌కుడు. కాక‌పోతే ఫ‌స్టాఫ్‌లో స‌న్నివేశాల‌ను ఆస‌క్తిక‌రంగా మ‌ల‌చ‌లేక‌పోయాడు. ఇంట‌ర్వెల్ నుంచి ఎండింగ్ దాకా ఎంగేజింగ్‌గా క‌థ‌నాన్ని న‌డ‌ప‌డంలో మాత్రం స‌క్సెస్ అయ్యాడు. టైటిల్‌కు త‌గ్గ‌ట్లు క‌థ‌లోని విష‌య‌మంతా క్లైమాక్స్‌లోనే ఉంది. విలాస‌వంత‌మైన జీవితాల‌ను గడుపుతూ వంద‌ల‌, వేల కోట్లు బ్యాంకుల‌కు ఎగ్గొట్టిన విజ‌య్ మాల్యా, నీర‌వ్ మోడీల‌ను దృష్టిలో పెట్టుకొని ప్ర‌ధాన పాత్ర‌కు విజ‌య్ మోడీ అనే పేరు పెట్టిన‌ట్లు ఈజీగా మ‌న‌కు అర్థ‌మ‌వుతుంది. ఇంట‌రెస్టింగ్ స్క్రిప్ట్‌కు త‌గ్గ‌ట్లు ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ రిచ్‌గా ఉన్న‌ట్ల‌యితే సినిమా ఇంకా ఆక‌ర్ష‌ణీయంగా వ‌చ్చి ఉండేది. సినిమాలో ముప్పావు వంతు భాగాన్ని ఒక హోట‌ల్‌లోనే తీసేశారు. ఔట్‌డోర్ సీన్లు ఒక‌ట్రెండు మిన‌హా లేవు. అన్నీ ఇన్‌డోర్ సీన్లు కావ‌టాన, స‌న్నివేశాల దృష్ట్యా త‌క్కువ ఖ‌ర్చుతో లాగించేశారు.

సినిమా చూశాక మ‌న‌కు కొన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ల‌భించ‌దు. ప‌వ‌ర్ కోసం రాజ‌కీయాల్లోకి రావాల‌నుకున్న విజ‌య్ మోడీ ప్రెస్‌మీట్ పెట్టి, పిచ్చిపిచ్చిగా మాట్లాడి పార్టీ స‌భ్య‌త్వాన్ని కోల్పోయేలా ఎందుకు చేసుకుంటాడు?  పార్టీ కంటే దేశ‌మే త‌న‌కు ముఖ్య‌మ‌ని గొప్ప‌గా చెప్పిన అత‌ను హ‌త్య‌లు ఎందుకు చేస్తాడు? ఏకంగా కోటి రూపాయ‌లు ఆఫ‌ర్ చేసి, త‌న‌కు న‌చ్చిన ఓ అమ్మాయిని రాత్రంతా తాక‌నైనా తాక‌కుండా, కేవ‌లం త‌ను చెప్పే క‌బుర్లు వినేందుకు, త‌నకు కంపెనీ ఇచ్చేందుకు త‌న రూమ్‌లో ఉంచుకున్నాడు? అలాంటి వాడు కిరాత‌కంగా ఎలా ప్ర‌వ‌ర్తిస్తాడు?  

ఉన్న రెండు పాట‌ల పిక్చ‌రైజేష‌న్ బాగుంది. కెమెరా వ‌ర్క్, ఎడిటింగ్‌ ఫ‌ర్వాలేదు. సెకండాఫ్ స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌గా ఉంది. కొన్ని విష‌యాల‌కు డైరెక్ట‌ర్ జ‌స్టిఫికేష‌న్ ఇవ్వ‌లేక‌పోవ‌డం మైన‌స్‌. క్లైమాక్స్ సీన్ల‌లో అది మ‌రింత కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించింది.

న‌టీన‌టుల అభిన‌యం
'క్లైమాక్స్‌'కు బ‌లం రాజేంద్ర‌ప్ర‌సాద్‌. ఆయ‌న గెట‌ప్ భిన్నంగా ఉండి ఆక‌ట్టుకుంది. పూర్తిగా వైట్ హెయిర్‌, బియ‌ర్డ్‌తో కొత్త‌గా క‌నిపించిన ఆయ‌న విజ‌య్ మోడీ అనే విలాస పురుషుడి పాత్ర‌లో సునాయాసంగా ఇమిడిపోయి జీవించారు. కీల‌క‌మైన న‌వ్య అనే పాత్ర‌లో సాషా సింగ్ అందంగా క‌నిపించింది. పృథ్వీ, శివ‌శంక‌ర్‌, శ్రీ‌రెడ్డి ఒక‌ట్రెండు సీన్ల‌లో అలా క‌నిపిస్తారు. మోడీ డ్రైవ‌ర్ నాగ‌రాజు‌గా రాజేంద్ర‌ప్ర‌సాద్ మేనేజ‌ర్ నాగ‌రాజారెడ్డి ప్రాధాన్యం ఉన్న‌పాత్ర‌లో క‌నిపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. మినిస్ట‌ర్ క్యారెక్ట‌ర్‌కు శ్రీ‌నివాస్ భోగిరెడ్డి బాగానే న‌ప్పారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఓవ‌రాల్‌గా రాజేంద్ర‌ప్ర‌సాద్ అభిమానుల‌ను కాస్త అల‌రించే సినిమా 'క్లైమాక్స్‌'. అలాగ‌ని ఆయ‌న న‌ట‌న‌, కొంత ఉత్కంఠ‌భ‌రితంగా సాగే సెకండాఫ్ ఈ సినిమాని ర‌క్షిస్తాయ‌నుకోవడం అత్యాశే!

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25