Read more!

English | Telugu

సినిమా పేరు:చింతకాయల రవి
బ్యానర్:శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్
Rating:2.75
విడుదలయిన తేది:Oct 2, 2008
చింతకాయల రవి" (వెంకటేష్) అమెరాకా వెళ్ళి సైబర్ వేవ్ అనే బార్లో వెయిటర్‌గా పనిచేస్తుంటాడు. కానీ ఇంట్లోని వారికి మాత్రం తానొక సాప్ట్‌వేర్‌ ఇంజనీగా ఉన్నానని చెపుతాడు. దానికి కారణం రవి అమెరికా వెళ్ళగానే అక్కడ తారసపడిన శ్రీకాంత్‌ (వేణు) అనే అతనికి మెదడుకి అపరేషన్‌కి డబ్బు అవసరమైతే, తన దగ్గరున్న డబ్బిచ్చి అతన్ని కాపాడటమే. అతనికి లావణ్య (మమతా మోహన్‌దాస్‌) అనే అమ్మాయితో వివాహం చేయాలని అతని తల్లి శేషుమాంబ (లక్ష్మీ నిశ్చయించగా, లావణ్య అమెరికాలో వున్న తన స్నేహితురాలు సునీత (అనుష్క)ను చింతకాయల రవి గురించి విచారించమంటుంది. అనుకోకుండా కొన్ని సందర్భాల్లో రవిని సునీత కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో చూస్తుంది. తన గురించిన నిజం లావణ్యకు రవి చెపుదామని ప్రయత్నిస్తే అతని స్నేహితులు ఆ ప్రయత్నం సఫలం కానీయరు. చివరకి రవి బార్లో పనిచేస్తున్నాడని అతని కాబోయే మామ (షాయాజీ షిండే)కి సునీత ద్వార తెలిసిన రవి తండ్రి (చంద్రమోహన్‌) రవిని తిట్టి తిరిగి అమెరికా వెళ్ళిపోమంటాడు. దీనికంతటికీ సునీత ఆరణమని తెలుసుకున్న రవి అమెరికా వెళ్ళి ఆమె జీవితం దుర్భరం చెయ్యాలనుకుంటాడు. కానీ ఆ ప్రయత్నంలో ఆమె తండ్రికి గుండె నొప్పి రావటంతో అతన్ని మాస్పిటల్లో చేరుస్తారు. అక్కడ అనుకోకుండా రవి అతన్ని కాపాడతాడు. రవి గురించి, అతని క్యారెక్టర్‌ గురించీ నిజం తెలుసుకున్న సునీత పశ్చాత్తాప పడుతుంది. లావణ్యతో అతని పెళ్ళి జరిపించటానికి ప్రయత్నిస్తే అది బెడిసి కొడుతుంది. సునీతకి సబంధాలు వెతకటం పనిగా పెట్టుకున్న రవి ఆమెను ప్రేమిస్తాడు. సునీత కూడా అతన్ని ప్రేమిస్తుంది. తన ప్రేమను రవికి చెప్పాలనుకుంటున్న సమయంలో రవికి లావణ్యకూ పెళ్ళి కుదిరిందని లావణ్య నుంచి సునీతకు ఫోన్‌ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది వెండితెరమీద చూడాల్సిందే.
ఎనాలసిస్ :
ఈ సినిమా బోర్‌ కొట్టే సమయంలో కామెడీ ట్రాక్‌ మొదలవుతుంది. అలా ఈ చిత్రం స్ర్కీన్‌ప్లేని రాశాడు కోన వెంకట్‌. తెలుగులో త్రివిక్రమ్‌ తర్వాత ఆ రేంజ్‌లో కోన వెంకట్‌ ఈ చిత్రానికి మాటలు వ్రాశాడు. మాటలు చాలా బాగున్నాయి. దర్శకత్వం గురించి చెప్పాలంటే ఓ.కె. ఎంతో జాగ్రత్తగా ఈ చిత్రాన్ని దర్శకుడు డీల్‌ చేశాడు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన:- కామెడీ, సెంటిమెంట్‌ కలగలసిన పాత్రలో వెంకటేష్ చాలా బాగా నటించారు. అనుష్క, మమతా మోహన్‌దాస్‌లు గ్లామర్‌ ఒలకపోయగా, లక్ష్మీ, చంద్రమోహన్‌లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సునీల్‌ కామెడీ ఫరవాలేదు. బ్రహ్మానందం, వేణుమాధవ్‌ల కామెడీ కొంచెం ఎబ్బెట్టుగా వుంది. ఎడిటింగ్‌:- బాగుంది ఆర్ట్‌:- ఒ.కె. ఈ చిత్రం ఆడవారికీ, కుటుంబ ప్రేక్షకులకూ నచ్చే చిత్రం.