Read more!

English | Telugu

సినిమా పేరు:చాప్టర్ -6
బ్యానర్:మిడాస్ టచ్
Rating:2.00
విడుదలయిన తేది:Aug 19, 2010
ఈ మధ్య మన సినిమాల్లో ఒక సెలబ్రిటి వాయిస్ ఓవర్ ఇవ్వటం ఒక ఫ్యాషన్ లా మారిపోయింది.కథ విషయానికొస్తే భరత్ (బాల), కమీషనర్(రాజన్ పి దేవ్)కూతురు శిల్ప(సోనియా సూరి)ప్రేమించుకుంటారు.తనకిష్టం లేని పెళ్ళి చేయబోతుండటతో తన ప్రియుడితో కలసి లేచిపోదామని ప్లాన్ చేసుకుంటారు శిల్పా,భరత్.కానీ శిల్పని ఎవరో కిడ్నాప్ చేస్తారు.కళ్యాణి ఒక అనాథ.ఆమెను అక్కా అని పిలిచే ఒకమ్మాయిని డ్రగ్స్ కి బానిసను చేసి,ఆమె న్యూడ్ ఫొటోలు నెట్ లో పెడతానని ఒకడు బ్లాక్ మెయిల్‍ చేయటంతో ఆమె కళ్యాణికి లెటర్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకుంటుంది.దాంతో కళ్యాణి ఆ డ్రగ్స్ డీలర్ ని ,అతనికి సహకరించే పోలీసాఫీసర్ని అరెస్ట్ చేయిస్తుంది. హాస్టల్ వార్డెన్ సలహా మేరకు కళ్యాణి హైదరాబాద్ నుండి మకాం వైజాగ్‍ కు మార్చుతుంది.అక్కడ ఆమెని ఒక ఇంటిరియర్ డెకరేటర్ ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు.కళ్యాణి పనిచేసే చిట్ ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేయటంతో పోలీసులు అంద్రు ఉద్యోగులతో పాటు కళ్యాణిని కూడా విచారనకు పిలుస్తారు.అక్కడ కళ్యాణి పట్టిచ్చిన పోలీసాఫీసర్ కూడా ఉంటాడు.అతను కళ్యాణి భర్తను అనుమానం మీద అరెస్ట్ చేసి,కళ్యాణిని లేడీ యస్.ఐ.కి అప్పగిస్తాడు.ఆ తర్వాత ఏంజరిగిందనేది మిగిలిన కథ.
ఎనాలసిస్ :
ఒక కథని ముందుది వెనుక,వెనుకది ముందు చెప్పటం ప్రస్తుతం లేటెస్ట్ నెరేషన్ లా కనిపిస్తూంది.మనసైడు ఈ సాంప్రదాయాన్ని మణిరత్నం తన "యువ"సినిమాతో మొదలుపెట్టారు.ఆయన కూడా అలా కథని ప్రెజేంట్ చేయటంలో ఒక విధంగా ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి.దాన్నే ఈ సినిమాలో సూర్యకిరణ్ కూడా అనుసరించాడు.ఈ సినిమా నెరేషన్ చాలా నెమ్మదిగా ప్రేక్షకుడి సహనం పరీక్షించేలా సాగుతుంది.ఈ సినిమాలో పాటలు కథాగమనానికి అడ్డం రావటమే కాకుండా చిరాకు తెప్పిస్తాయి.ఇక ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కొండ వలస,విస్సు ల కామేడీ పండలేదు సరికదా విసుగుపుట్టిస్తుంది.ఈ చిత్రం ఏ విధంగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోదనే చెప్పాలి. నటన - కొత్తవారైనా బాల,సోనియా సూరి ఫరవాలేదనిపించేలా నటించారు.మిగిలిన వారంతా వారి వారి పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి. సంగీతం - సగటు ప్రేక్షకుడికి ఈ చిత్రంలోని పాటలు ఎంతవరకూ అర్థమవుతాయో ఆ దేవుడికే తెలియాలి.రీ-రికార్డింగ్‍ మాత్రం ఫరవాలేదు. కెమెరా - ఇది కాస్త ఫరవాలేదు.కెమెరా వర్క్ బాగానే ఉంది. ఎడిటింగ్ - ఇది కూడా అంతే. మాటలు - సగటు స్థాయిలోనే ఉన్నాయి. పాటలు - పాటల్లో సాహిత్యం గొప్పగా లేదనే చెప్పాలి. కొరియోగ్రఫీ - ఇదీ అంతే. యాక్షన్ - ఇది కాస్త ఫరవాలేదు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఈ సినిమా చూసి తీరాల్సినంత గొప్ప సినిమా ఏం కాదు.కాదూ కూడదూ మేం చూస్తామంటే చూడండి.మీ ఇష్టం.