English | Telugu

సినిమా పేరు:చావు క‌బురు చ‌ల్ల‌గా
బ్యానర్:జీఏ2 పిక్చ‌ర్స్
Rating:2.50
విడుదలయిన తేది:Mar 19, 2021

సినిమా పేరు: చావు క‌బురు చ‌ల్ల‌గా
తారాగ‌ణం: కార్తికేయ‌‌, లావ‌ణ్యా త్రిపాఠి, ఆమ‌ని, ముర‌ళీ శ‌ర్మ‌, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, ర‌జిత‌, భ‌ద్రం, జ‌బ‌ర్ద‌స్త్ మ‌హేష్‌, ప్ర‌భు
అడిషిన‌ల్ డైలాగ్స్: శివ కుమార్ భూజుల‌
మ్యూజిక్: జేక్స్ బిజోయ్
సినిమాటోగ్రాఫ‌ర్: క‌ర‌మ్ చావ్లా
ఎడిట‌ర్‌: స‌త్య జి
ఆర్ట్‌: జి.ఎమ్. శేఖ‌ర్
స‌మ‌ర్ప‌ణ: అల్లు అర‌వింద్
నిర్మాత: బ‌న్నీ వాసు
దర్శకుడు: కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి
బ్యాన‌ర్: జీఏ2 పిక్చ‌ర్స్
విడుద‌ల తేదీ: 19 మార్చి 2021‌

'ఆర్ఎక్స్ 100' మూవీతో మంచిగ మెప్పించి, ఆ త‌ర్వాత కెరీర్‌లో వెన‌క‌ప‌డ్డ హీరో కార్తికేయ గుమ్మ‌కొండ ఎన్నో ఆశ‌ల‌తోని చేసిన సినిమా 'చావు క‌బురు చ‌ల్ల‌గా' అని మ‌న‌కి ఎరికే. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ కంట్ల‌ ప‌డి, జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ మీద‌ న‌టించే చాన్స్ కొట్టేశాడు ఆ యంగ్ హీరో. కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి అనే కొత్త డైరెక్ట‌ర్ తీసిన ఈ మూవీల బ్యూటిఫుల్ గాళ్ లావ‌ణ్యా త్రిపాఠి హీరోయిన్‌గ యాక్ట్ జేసింది. ఆ సిన్మా ఇయ్యాళే థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది. అది ఎట్టుందో చెప్పేసుకుందామా...

క‌థ‌
చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పాల్న‌ని పెద్దోళ్లు చెప్తా ఉంటారు. మ‌రి మ‌న బ‌స్తీ బాల‌రాజు అయితే ప్రెతి దినామూ చావుల‌తోనే మొద‌ల‌యిత‌ది. అంటే చ‌చ్చిపోయినోళ్ల‌ని శ్మ‌శానానికి తీస్క‌పోయే "స్వ‌ర్గ‌పురి వాహ‌న‌ము"ను న‌డిపే డ్రైవర్ అన్నమాట‌. అట్టాంటోడు మ‌ల్లిక అనే ఓ కిర‌స్తానీ అమ్మాయిని తొలిసూపులోనే ప్రేమించేస్త‌డు. అదీ.. ఎప్పుడో తెలుసా? ఆమె హ‌జ్బెండ్ చ‌నిపోయి, శ‌వ‌పేటిక ముందు కూర్చొని ఏడుస్తున్న‌ప్పుడు! అంటే ఏంది.. నిన్ను ప్రేమిస్త‌న్నా.. అని విడో ఎంట ప‌డుతూ, ఆమె తోని తిట్లు తింటా కూడా నవ్వుతా ఉంటడు. ఆ య‌బ్బికి మంచాన‌ప‌డిన ముస‌లి తండ్రి, గంగ‌మ్మ అనే త‌ల్లి ఉంట‌రు. ఆ గంగ‌మ్మ‌ను మోహ‌న అనే ఓ ఎల‌క్ట్రానిక్ షాప్ ఓన‌రు ఇష్ట‌ప‌డుతుంట‌డు. ఇట్లాంటి అన్‌యూజ్వ‌ల్ స్టోరీల బాల‌రాజు జీవితం ఏమైత‌ది? మ‌ల్లిక అత‌నికి ద‌క్కుత‌దా?.. బాల‌రాజు త‌ల్లి గంగ‌మ్మ క‌త ఏ తీరానికి చేర‌త‌ది?.. అనేటివి 'చావు క‌బురు చ‌ల్ల‌గా' సిన్మాలోని పాయింట్లు.


ఎనాలసిస్ :

ఫ‌స్టాఫ్ అయ్యేత‌లికి త‌ల‌నొప్పి వొస్తే అది మ‌న త‌ప్పు కాదు బాస్‌. పెళ్ల‌యిన కొద్ది రోజుల‌కే మొగుడు స‌చ్చిపోయి ఏడుస్తున్న అమ్మాయిని... ఆమె ఛీ కొడ్త‌న్నా ఎంట ప‌డ్తా, ఆమె తిడ్తంటే న‌వ్వుతా ఉండే బాల‌రాజుని చూస్తే ఎవ‌రికి ఒళ్లు మండ‌కుండా ఉంట‌ది! అందుకే మ‌ల్ల‌.. మ‌నం బాల‌రాజు ల‌వ్‌ని యాక్సెప్ట్ చెయ్య‌లేం. అత‌నితోని క‌నెక్ట్ కాలేం. అయితే మ‌ల్లిక‌తోని, ఆమె పెయిన్‌తోని క‌నెక్ట‌వుతాం. అట్టాగే బాల‌రాజు ఇంట్లోని వాతావ‌ర‌ణం కూడా మ‌న‌కి డైజెస్ట్ అవ‌ది. బాల‌రాజే కాదు, వాళ్ల‌మ్మ గంగ‌మ్మ కూడా తాగుబోతే.. ర‌మ్ము గ‌ట‌గ‌టా తాగేస్త‌ది. ఫ‌స్ట్ టైమ్.. తెలుగు సిన్మాల త‌ల్లీకొడుకులు క‌లిసి మందు కొట్టే సీన్‌ను చూసి త‌రించే భాగ్యం మ‌న‌కి ద‌క్కిందబ్బా!

క్రాంతికుమార్ అనే గొప్ప డైరెక్ట‌ర్ తీసిన 'స్వాతి' సిన్మాల విడో అయిన త‌ల్లికి స్వాతి అనే అమ్మాయి తనే ద‌గ్గ‌రుండి రెండో పెళ్లి చెయ్య‌డం జూసి, సంతోష‌ప‌డ్డాం. యాదికొచ్చింది క‌దా.. అందులో మ‌న‌కి త‌ప్పేమీ క‌నిపియ్య‌లే. ఇప్పుడు 'చావు క‌బురు చ‌ల్ల‌గా' సిన్మాల‌.. త‌న‌కూ ఊహ వ‌చ్చే నాటికే మంచాన ప‌డ్డ తండ్రితోని ఏ సుఖ‌మూ ఎరుగని త‌ల్లిని ఇంకో మ‌నిషి ఇష్ట‌ప‌డ్త‌న్నాడ‌ని స‌మ‌జై, ఆ ఇద్ద‌రికీ పెళ్లి చెయ్యాల‌నే కొడుకుని చూస్తాం. ముందుగాల.. ఇదేం క‌త‌రా, ఈ క‌త‌ని చూసే బాధ మ‌న‌కేల‌రా.. అని ఇబ్బందిప‌డ్తం. అయితే సిన్మా క్లైమాక్స్‌కు ద‌గ్గ‌ర‌య్యే స‌రికి బాల‌రాజు చేస్తున్న ప‌ని మంచిదేన‌ని అర్థ‌మై, అత‌డి ఎమోష‌న్‌తోని క‌నెక్ట‌వుతాం.

అంటే ఏంది? ఫ‌స్టాఫ్‌ల‌ ఎంత బోర్‌గ ఫీల‌యిత‌మో, సెకండాఫ్‌ల‌ బాల‌రాజు ఎమోష‌న్స్‌తోని క‌నెక్ట‌యి, అంత మంచిగ ఫీల‌యితం. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' సినిమాని కాస్తయినా నిల‌బెట్టింది సెకండాఫేన‌ని నాక‌నిపించ్చింది.. ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ల వ‌ర‌స‌బెట్టి క‌ళ్లెంట నీళ్లు తెప్పించాడ‌బ్బా డైరెక్ట‌ర్ కౌశిక్‌! ఫ‌స్టాఫ్‌ల సీన్లు, డైలాగులు ఇంకా మంచిగ రాసుకొని ఉంటే, సిన్మా ఇంకా మంచిగ అనిపిచ్చేది.

టెక్నిక‌ల్‌గా జూస్తే, జేక్స్ బిజోయ్ అనే మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఇచ్చిన మ్యూజిక్ ఓకే అనిపిచ్చింది. క‌ర‌మ్ చావ్లా సినిమాటోగ్ర‌ఫీ మంచిగ‌నే ఉంది. ఫ‌స్టాఫ్ ఎడిటింగ్ మంచిగ అనిపియ్య‌లే కానీ, సెకండాఫ్ మ‌స్తుగ అనిపిచ్చింది.

న‌టీన‌టుల అభిన‌యం
బాల‌రాజు క్యారెక్ట‌ర్‌కి న్యాయం చెయ్య‌నీకి కార్తికేయ శానా క‌ష్ట‌ప‌డ్డాడ‌ని తెలుస్తా ఉంట‌ది. అయితే కొన్నిచోట్ల‌ ఎక్స్‌ప్రెష‌న్స్ నాచుర‌ల్‌గా రాలేద‌నేది నా ఫీలింగ్‌. అత‌ను న‌వ్వుతుండే సీన్ల కంటే ఎమోష‌న‌ల్ సీన్ల‌లోనే మంచిగ యాక్ట్ జేసిండు. ప‌ర్ఫామ్ జెయ్య‌నీకి మంచి ఛాన్స్ ఉన్న బాల‌రాజు క్యారెక్ట‌ర్ ప‌డ‌టం అత‌ని కెరీర్‌కు మంచి జేస్త‌ద‌నే అనుకుంటా. మ‌ల్లిక క్యారెక్ట‌ర్‌ల లావ‌ణ్యా త్రిపాఠి జీవించేసింది. ఆ పాత్ర‌కు ప‌ర్ఫెక్టుగా సూట‌యింది. ఆ క్యారెక్ట‌ర్‌లోని పెయిన్‌ను సూప‌ర్‌గా ప‌ర్ఫామ్ జేసింది. అట్టాగే శానా కాలం త‌ర్వాత ఆమ‌నిలోని చ‌క్క‌ని న‌టిని ఈ సిన్మా మ‌రోసారి ప‌రిచ‌యం జేసింద‌బ్బా.. హీరో త‌ల్లి గంగ‌మ్మ పాత్ర‌లో ఆమ‌ని న‌ట‌న జూస్తుంటే ఎంత మంచిగ అనిపిచ్చిందో!

మ‌ల్లిక మామ‌య్య పాత్ర‌ల‌ ముర‌ళీశ‌ర్మ ఎప్ప‌ట్లా త‌న యాక్టింగ్‌తో ఆక‌ట్టుకున్న‌డు. హీరో బావ‌మ‌రిది పాత్ర‌ల భ‌ద్రం మంచిగ న‌వ్వించిండు. ఆమ‌నిని ఇష్ట‌ప‌డే మోహ‌న క్యారెక్ట‌ర్‌ల శ్రీ‌కాంత్ అయ్యంగార్ ఓకే అనిపిచ్చిండు. జ‌బ‌ర్ద‌స్త్ మ‌హేశ్‌, ర‌జిత‌, ప్ర‌భు పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్లు చేసిన్రు. 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఓవ‌రాల్‌గ జూస్తే, ముందుగాల కొంచెం త‌ల‌నొప్పి తెప్పించి... ఆపైన దానికి రిలీఫ్ క‌లించేలా ఎమోష‌న్స్ పంచిన సిన్మా 'చావు క‌బురు చ‌ల్ల‌గా' అనేటిది నా ఒపీనియ‌న్‌.‌‌

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి

 

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25