English | Telugu

సినిమా పేరు:బుర్ర‌క‌థ
బ్యానర్:దీపాల ఆర్ట్స్
Rating:2.00
విడుదలయిన తేది:Jul 5, 2019

న‌టీన‌టులు: ఆది సాయికుమార్‌, మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి, నైరా షా, రాజేంద్ర ప్ర‌సాద్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, పృథ్వీరాజ్‌, గాయ‌త్రి గుప్తా, అభిమ‌న్యు సింగ్‌, ఫిష్ వెంక‌ట్‌, ప్ర‌భాస్ శ్రీను, గీతా సింగ్ త‌దిత‌రులు
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  డైమండ్ ర‌త్న‌బాబు
నిర్మాత‌లు:  హెచ్‌.కె.శ్రీకాంత్ దీపాల‌
బ్యాన‌ర్‌:  దీపాల ఆర్ట్స్
మ్యూజిక్‌:  సాయికార్తీక్‌
సినిమాటోగ్ర‌ఫీ:  సి.రాంప్ర‌సాద్‌
ఎడిట‌ర్‌: ఎం.ఆర్‌.వ‌ర్మ‌
ఆర్ట్‌:  చిన్నా
పాట‌లు:  శివ‌శ‌క్తి ద్త‌, భాస్క‌ర భ‌ట్ల‌, కె.కె
ఫైట్స్‌:  వెంక‌ట్, సాల్మ‌న్ రాజ్‌, రియ‌ల్ స‌తీష్‌
విడుదల తేదీ: 05 జులై  2019

  ఇంత వ‌ర‌కు మ‌నం డ్యూయ‌ల్ రోల్  సినిమాలు చాలానే చూసాం. ఇద్ద‌రు ఒకేలా ఉంటారు కానీ, వారి వేష భాష‌లు , మైండ్ సెట్స్ వేర్వేరుగా ఉంటాయి.  కానీ ఒక్క మ‌నిషి  బుర్ర‌లోనే రెండు బ్రెయిన్స్ ఉంటే ఆ రెండు బ్రెయిన్స్ ఆపోజిట్ గా ఆలోచేస్తే  ఎలా ఉంటుంది అనే క‌థాంశంతో డైమండ్ ర‌త్న‌బాబు `బుర్ర‌క‌థ‌` అనే చిత్రాన్ని డైర‌క్ట్ చేసాడు. ఆది సాయికుమార్ హీరోగా , మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి హీరోయిన్ గా న‌టించారు. మ‌రి ఈ సినిమా ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కులు ముందుకు వ‌చ్చింది. ఇక ప్రేక్ష‌కుల‌ను ఈ చిత్రం ఎలా ఆక‌ట్టుకుంటుందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం...
 
 క‌థ విష‌యానికొస్తే...
రాజేంద్ర‌ప్ర‌సాద్ ఇద్ద‌రు క‌వ‌ల పిల్ల‌లు పుట్టాల‌ని కోరుకుంటాడు. కానీ ఆయ‌న‌కు ఒకే బుర్ర‌లో రెండు బ్రెయిన్స్ తో  ఉన్న ఒక కొడుకు పుడ‌తాడు. అత‌డే అభిరామ్ ( ఆది సాయికుమార్).  వీరిద్ద‌రిని గుర్తు ప‌ట్ట‌డం ఎలా అంటే మాస్ గా ఉంటే అభి, క్లాస్ గా ఉంటే రామ్.  అభి ఏమో లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండాల‌నుకునే టైపు రామ్ మాత్రం ఇవేమీ లేకుండా బ్ర‌హ్మ‌చారిగా మారి పోవాలనుకుంటాడు. ఇలా త‌నకు తానే శత్రువుగా మారిన అభిరామ్ చివ‌ర‌కు రెండు బుర్ర‌ల‌తో ఎలాంటి టార్చ‌ర్ అనుభ‌వించాడు. త‌ను ల‌వ్ ని ఎలా స‌క్సెస్ చేసుకున్నాడు అన్న‌ది చిత్ర క‌థాంశం.


ఎనాలసిస్ :

డైర‌క్ట‌ర్ ర‌త్న‌బాబు తీసుకున్న పాయింట్ బాగున్న‌ప్ప‌టికీ దాన్ని ఇంప్రెసివ్ గా, ఎంట‌ర్ టైనింగ్ గా  చూపించ‌లేక‌పోయాడు.  ఎగ్జిక్యూష‌న్ మీద ఇంకా దృష్టి సారిస్తే సినిమా వ‌ర్క‌వుట్ అయ్యేది. కాకుంటే ఇద్ద‌రికీ వేరియేష‌న్ చూపించ‌డంలో మ‌న బుర్ర‌లు హీటెక్కించే విధంగా మాత్రం తాను క‌న్ఫ్యూజ్ మాత్రం  లేకుండా అలా సాఫీగా తీసుకెళ్లాడు. ఆ విష‌యంలో ద‌ర్శ‌కుణ్ని మెచ్చుకోవాలి. కానీ స‌న్నివేశం పండిన‌ప్పుడే ప్రేక్ష‌కుడు దాన్ని క‌నెక్ట్ అవుతాడు. ఇలాంటి సినిమాలు విప‌రీతంగా రెండు క్యార‌క్ట‌ర్స్ తో నవ్వించి,  ఆ రెండు క్యార‌క్ట‌ర్స్ కు ప్రేక్ష‌కుడిని క‌నెక్ట్ చేసి ఇద్ద‌రిలో ఏ క్యార‌క్ట‌ర్ ని చంపేసినా త‌ట్టుకోలేనంత ఎమోష‌న్ క్ల్లైమాక్స్ లో చూపిస్తే  సినిమా ఓ స్థాయిలో ఉండేది.  ఎందుకంటే క్లైమాక్స్ లో అంత ఎమోష‌న్ పండించ‌డానికి సినిమాలో చాలా స్కోపు ఉంది.  ఇక  మ‌ధ్య‌లో పృథ్వీ కామెడీ ట్రాక్, విల‌న్ గ్యాంగ్  ర‌చ్చ దీని వ‌ల్ల సినిమా  ప‌క్క‌దారి ప‌ట్టింది. రంగ‌స్థ‌లం మ‌హేష్ డైలాగ్స్ అక్క‌డ‌క్క‌డా న‌వ్వించాయి. తప్ప మిగ‌తా చాలా చోట్ల బోర్ ఫీల్ వ‌స్తుంది. డ్యూయ‌ల్ రోల్ సినిమాలు చాలా వ‌ర‌కు ఇలాగే ఉంటాయి. ఒక క్యార‌క్ట‌ర్ మాస్ గా ఉంటాడు మ‌రో క్యార‌క్ట‌ర్ క్లాస్ గా ఉంటాడు. సివరాఖ‌రికి మాస్ హీరో విల‌న్స్ నుంచి ఆ ఫ్యామిలీని కాపాడి అప్ప‌డి వ‌ర‌కు అందరితో తిట్టు తిన్న అత‌డే  అంద‌రి చేత శ‌భాష్ అనిపించుకుంటాడు. దీంతో శుభం కార్డ్ ప‌డుతుంది. ఇక అదే జ‌రిగింది. ఒక విభిన్న‌మైన పాయింట్ తీసుకుని ద‌ర్శ‌కుడు క్లైమాక్స్ కు వ‌చ్చేస‌రికి అదే ఫార్మాట్ ఫాలో అయ్యాడు. కాకుంటే అక్క‌డ ఇద్ద‌రు హీరోలు. ఇక్క‌డ మాత్రం ఒక హీరో,  రెండు బుర్ర‌లు అంతే తేడా మిగ‌తాదంతా చాలా వ‌ర‌కు సేమ్ టు సేమ్. ఇక హీరో ఆది మాత్రం రెండు బ్రెయిన్స్ క్యార‌క్ట‌ర్ లో త‌న వంతు న్యాయం చేసాడు.  రెండు క్యార‌క్ట‌ర్స్ కు వేరియేష‌న్, ప‌ర్ఫార్మెన్స్ ప‌రంగా చాలా బాగా డెవ‌ల‌ప్ అయ్యాడు ఆది.  సీరియ‌స్ , ఎమోష‌న్స్ తో కూడిన స‌న్నివేశాలు చాలా బాగా చేసాడు.  హీరోయిన్ మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి , ఆది ఇద్ద‌రికీ కెమిస్ట్రీ బాగుంది.  ఇక రాజేంద్ర‌ప్ర‌సాద్, పోసాని, పృథ్వీ , అభిమన్యు సింగ్ ఎప్ప‌టిలాగే వారి పాత్ర‌ల‌కు న్యాయం చేసారు.

 ప‌స్ పాయింట్స్
 స్టోరి లైన్ అండ్ డైలాగ్స్
 ఆది సాయికుమార్ న‌ట‌న‌
 సినిమాటోగ్ర‌ఫీ

మైన‌స్ పాయింట్స్
 స్టోరి  నేరేష‌న్, ఎగ్జిక్యూష‌న్‌
 క్లైమాక్స్
 సంగీతం
 కామెడీ ట్రాక్

సాంకేతిక నిపుణుల ప‌నితీరుః
 ముందుగా రామ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ గురించి చెప్పుకోవాలి. ప్ర‌తి సీన్ అందంగా చూపించాడు. ఇక సాయి కార్తీక్ సంగీతం సోసోగా ఉంది. నిర్మాత‌లు కూడా క‌థ‌కు ఎంత వ‌ర‌కు పెట్టాలో అంత వ‌ర‌కు పెట్టారు. ద‌ర్శ‌కుడు తీసుకున్న పాయింట్, సంభాష‌ణ‌లు బావున్నాయి. క‌థ చెప్పే విధానం ఇంప్రెసివ్ గా అనిపించ‌దు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ముందే  చెప్పిన‌ట్టు ద‌ర్శ‌కుడు తీసుకున్న పాయింట్ కొత్త‌గా ఉంది. కానీ దాన్ని ప్ర‌జంట్ చేసే విధానం ఆస‌క్తి క‌రంగా లేదు.  కొత్త పాయింట్ ని రెగ్యుల‌ర్ సీన్స్ తో చూసిన‌ట్టుగా ఉంది. దీని వ‌ల్ల స‌క్సెస్ జాబితాలోకి వెళ్లాల్సిన  సినిమా కాస్త నార్మ‌ల్ సినిమాగా మిగిలిపోయింది.  ఇక కామెడీ అయినా విప‌రీతంగా న‌వ్వించేలా ఉంటుందా అంటే అదీ లేదు. అక్క‌డ‌క్క‌డా ఏదో అలా వ‌చ్చి వెళ్లిపోతుంది త‌ప్ప విప‌రీత‌మైనా కామెడీ , కానీ ఎమోష‌న్ కానీ లేదు.  అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శ‌ని అన్న‌ట్లు త‌యారైందీ సినిమా ప‌రిస్థితి.  ఆది ఎంత ఎఫ‌ర్ట్ పెట్టినా కూడా ఈ సినిమా కూడా నిరాశే ప‌రిచిందని చెప్ప‌క త‌ప్ప‌దు.

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25